6 జూన్, 2017

వస్తా వట్టిదె .. పో తా వట్టిదే ..

అలెగ్జాండరు ..
ఎన్నో కథలు..
రాజ్యకాంక్షను పెనవేసుకున్న 
పదహారేళ్ళ పసి హృదయం ..
ఒకవైపు యుథ్థోన్మాదం..
మరోవైపు గురువు పయనించిన 
తత్త్వ రహస్యదారులపై ఆసక్తి..

ఎంతమంది మహనీయులను చూసినా..

మరణం చేయి చాచేవరకూ..
ఆ సారసమీరం హృదయాన్ని స్ప్రుశించనేలేదు..

రాచరికపు నెత్తుటిదారులలో పడిపోతున్నప్పుడు

 అతణ్ణి అరిస్టోటిలు పట్టినిలిపినట్లనిపించేది..
ఆయన తన విద్యా బోధకుడు. 
 ప్లేటో ఆరాధకుడు .. 
 గొప్ప తాత్త్వికుడు ప్లేటో.. 


మనిషిమార్గాన్నిమార్చేవి రెండే రెండు..

తల్లి.. గురువు..
గురువు నతడు సొంతం చేసుకునే సరికి..
కాలం జారిపోయింది..
రిక్త హస్తాలే మిగిలాయి..
వాటినేఅతను ప్రపంచానికి చూపాలనుకున్నాడు..


కాస్త మట్టి..

గంగాజలం..
రామాయణ భారతాలు.. 
ఒక గురువు..
భారత దేశం నుంచీ కానుకగా కావాలని  
అరిస్టాటిల్ ఎందుకడిగాడో అర్థమైంది ..
అప్పటికే సమయం మించిపోయింది .. 
జీవితం అతి త్వరగా ముప్ఫయి రెండేళ్ల కే 
ముగిసి పోయింది .. 
ఇది అలెగ్జాండరు  జీవితం .. 
మరాఠీ నుంచీ 
''భారతీయ ఇతిహాసాం తిల్ సాహసోనేరిసావే''
 అనువదించిన పుట్టపర్తి 
మన గురించి ఏం చెబుతారో చూద్దాం.. 
పుట్టపర్తి ఒరిజినల్ మరాఠీ నుంచీ తర్జుమా చేసిన వ్యక్తి 
అంతే కానీ 
మరాఠీగ్రంధానికి  ఇంగ్లిష్ అనువాదం 
దానికి మళ్ళీ తెలుగు అనువాదం .. 
ఇలా కాదు 
మరాఠీ భాష సొగసులు పరిమళాలు 
ఆత్మ జారిపోనివ్వని కథ ఇది .. 
అనువాదాలలోను పుట్టపర్తికి గొప్ప పేరే వుంది .. 
గ్రీ కు చక్రవర్తి దేశమున నలువేపులకును 

జారుల నంపుచుండెను.

జయించిన జయింపవలసిన దేశములలో 

వారు సంచరించి వచ్చి..
యక్కడి స్థితి గతులను చక్రవర్తికి దెలిపెడువారు.

వారు దెచ్చిన వృత్తాంతములలో 

నరణ్యముల నేకాంతవాస మొనర్చు తపస్వులు.. తపోవనములు.. 
నిస్సంగులు..
గ్రామైక రాత్రముగ దిరుగు తత్త్వ చింతకులు .. 
వీరి వర్ణనములు గూడ నుండెడివి.

గ్రీకు చక్రవర్తికి స్వయముగ తత్త్వజ్ఞానమునందభిరుచిగద్దు..

అతడరిస్టోటిలు శిష్యుడు..

భారతదేశమునందలి ఇట్టి 

నిస్సంగులైన పురుషుల విషయమున..
గ్రీకుదేశమునందే యెంతయో యాదరముండెడిది..
భారతదేశమునకు రాకముందే వీరి కీర్తి 
యలగ్జాండరు చెవులకెక్కినది..

గ్రీకు దేశస్తులిట్టి యతులు మొదలైన వారిని 

తమ భాషలో
జిమ్నాసోఫిస్ట్  Gymnosophist  అని పిలచెడివారు..

ఇట్టివారిని ప్రత్యక్షముగ జూచి .. 

వారితో మాటాడవలెనని గ్రీకులకెంతయో ఆశ.

అరణ్యల దపమొనర్చికొను సన్యాసులనెందరినో 

అలగ్జాండరు దనకడకు రప్పించుకొనెను..
కొన్ని యెడల దానే పోయి వారిని జూచెను..
ఇట్టి సన్నివేశముల గురించిన కొన్ని కథలు
గ్రీకు చారిత్రకులు వ్రాసిరి..
వానిలో నొకటి రెండు కథల నిచట నుధ్ధృతీ కరింతును..

ఈ యుదాహరణములతో గ్రీకులు 

భగవంతుని పుత్రుడనుకొన్న యలగ్జాండరు
వ్యక్తిత్వము గూడ మనకు బోధపడగలదు..

గ్రీకు చక్రవర్తి 

యొకనాడొక యతిని గలిసికొన్నాడు..
అతనినితడు
'' నాకీ దిగ్విజయములో సంపూర్ణ యశస్సు లభించునా లేదా..??''
యని ప్రశ్నించెను..
దానికాసన్యాసి యేమియు బదులివ్వలేదు..
అతడొక కృష్ణాజినమునుదెఛ్చి ఇఛ్చి .. 
దీనిని బరచికొని గూర్చుండుమని 
చక్రవర్తితోనన్నాడు.

ఆ కృష్ణాజినమరటియాకువలె 

ముడుచుకొని పోయినది..
దానిని జక్కగా నేలపై బరచి కూర్చొనవలసినదనియతియన్నాడు..

దానిపై యలగ్జాండరో ... 

లేక యతని యాజ్ఞ తో మరియొకరో .. 
కూ ర్చొనుటకై యత్నించెను..

కాని దానిని బరచికొనుటెట్లు..??

ఒకవైపు సరిజేసిన మరియొకవైపునుండీ.. 
యది ముడుతలువడుచు వచ్చును..

వారెంతయోబ్రయత్నించిరి..

దాని ముడు తలుబోగొట్టుటకు సాధ్యము గాలేదు..

ఆయవస్తజూచి యాయతి ఫక్కున నవ్వినాడు..

అపుడాతడనెను..
'' చక్రవర్తీ..!! భారతదేశ దండయాత్రవలన 
నీకు గలుగబోవు లాభమింతే..!!
నీవొకవేపునుండీ ముందుకు సాగిపోవునప్పుడు..
నీచే జితులైన రాజ్యములు మరల నూత్న శక్తిని సంపాదించుకుని నీపై బడును.. 
వారిని జయించుటకు నీవు వెనుదిరిగినప్పుడు.. 
జయింపవలసిన రాజ్జములు నీపై బడును.. 
నీవెట్లును.. భారతదేశ సామ్రాట్టువు కాజాలవు..''

1 జూన్, 2017

వినర ఓ రన్న..

రావణుణ్ణి రాక్షసునిగా చూడటమే 
మనం ఇంతవరకూ  చూసాం..
కానీ అదే రావణుణ్ణి దేవునిగా..
తమ పూర్వీకునిగా చూసే ఆదీవాసీలున్నారు..
రావణునికి ఆలయాలూ వున్నాయి....]
అంతే కాదు రావణునికి రాక్షస ముద్ర వేసి..
చరిత్ర వక్రీకరిచి.. 
సాంస్కృతిక దాడి చేసారన్నది ఆదివాసీల వాదన..

ఇప్పటికీ చాలాచోట్ల రావణుని ఆలయాలున్నాయంటే
రావణుని వారెన ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు..

మధ్యప్రదేశ్ లోని విదేశ జిల్లా..
రావణ్ గ్రామంలోలేని ఆలయం.. రాజస్థాన్ లో జోధాపూర్ సమీపంలోని
స్థానికులు రామ రావణ యుద్ద్ధం తర్వాత.. 
శ్రీలంకనుంచి జోధాపూర్ వఛ్చి స్థిరపడినట్లు చెబుతారు ..

వీరితో పాటూ మరికొన్ని తె గల వారు కుడా
రావణుని వీరునిగా గౌరవిస్తారు ..
కాన్పూర్ లోనూ రావణుని ఆలయం వుంది..

ఆ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి
 పూజలు నిర్వహిస్తారు ..
ఇంకా చాల ప్రాంతాలలో రావణుడే ఆరాధ్య దైవం..
వీరు ప్రపంచంలోనే
అతి పెద్ద ఆదివాసీ తెగవారు..
వీరి భాషకు లిపి లేదు..
ఇలా చరిత్రలోఈ హీరోలనుకున్న వాళ్ళు
కాలక్రమంలో విలన్ లుగా మారిపోతే ఆశ్చర్య పడక్కర్లేదు..

తొడకొట్టడాలు ..
మీసం తిప్పడాలు ..
కట్టి దూయతలు వంటి 
భీకర దృశ్యాలతో ప్రేక్షకులను వెర్రెత్తి పోయేలా చేసిన 
గౌతమీపుత్ర శాతకర్ణి  లో 
సత్యమెంత.. ??
చరిత్ర ఎంత .. ??
కల్పనా ఎంత .. ?? 
అని తరచి చూస్తే .. 
గందరగోళమే తప్ప మరేం కాదని 
సినీ పండితుల ఉవాచ.. 

ఇలాంటివే చాణక్యునిపైనా కల్పించారట.. 
ప్రసిధ్ధ వ్యక్తులపై అభూత కల్పనలు 
బయలుదేరడం సహజమే కదా.. 

చంద్రగుప్తుని కండగా నిలచిన చాణక్యునిపై.. 
కథలు .. నాటకాలు.. కావ్యాలు ..  రాయడానికి.. 
ఆకాలంలో చాలామంది ప్రయత్నించి ఉండవచ్చు .. 

ఎందుకంటే .. 
అర్థశాస్త్రవేత్తగా .. రాజనీతిజ్ఞునిగా నందులనంతం చేసి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న పౌరుషవంతునిగా 
ఏంతో మందికి సుపూర్తి ప్రదాత కదా.. 
కొంత మంది వీరత్వాన్ని ఎంచుకుంటే.. 
కొందరు శారీరకంగా ఆయనపై దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు.. 

ఒక నాటకకర్త.. 
చాణక్యుని కురూపిగా.. 
వికృత  వానిగా మలచి .. 
 ఆనంద పడినాడట .. 

ఈ విషయాలు .. 
మన పుట్టపర్తి తెనిగించిన మరాఠీ గ్రంధం.. 
'' భారతీయ ఇతిహాశాంతిల్ సాహసోనేరి సావే''
 "స్వర్ణ  పత్రములు ''       లో మనకు కనిపిస్తాయి.. 

శక హూణాది విదేశీ దురాక్రమణదారులందరినీ తరిమికొట్టి 
జాతిని రక్షించిన చంద్రగుప్త విక్రమాదిత్య యశోధర్మాది భారత వీరుల విజయ గాధలను అభివర్ణించే స్పూర్తిప్రదమగు చారిత్రక పరిశోధక గ్రంధం  వీర సావర్కరు మరాఠీ భాషలో రచించిన 
'' భారతీయ ఇతిహాసాంతిల్ సహసోనేరి పానే '' 


ప్రసిధ్ధపురుషులను గురించి గాధలల్లుట సాధారణముగ వాడుక..
ఆ స్థితి యాతనికి దప్పలేదు.
చంద్రగుప్త చాణక్యులు మరణించిన పిదప 
ననేక సంవత్సరములకు వ్రాసిన గ్రంధములలో గట్టుకథలకు లెక్కలేదు..

జైన , బౌధ్ధ, వైదిక గ్రంధములలో నీ గాధలు

 భిన భిన్నములుగ గల్పింపబడెను..

సంస్కృత నాటక మొకటి గలదు..

ఆ నాటక కర్త కళాదృష్టితో గొన్ని గాధలల్లినాడు..
చాణక్యుడు కురూపియట..
అతని వికృత దంతములను గురించి 
నాటకకారులు విపులముగ వర్ణించిరి..

చంద్రగుప్తునాతడొకనాడు ద్రోవలో గలసెను..

నాటికి జంద్రగుప్తుడొకనాడొక గ్రామీణ తరుణుడు మాత్రమే.
వాని సాముద్రిక లక్షణములను చాణక్యుడు గమనించి యాతనిని సామ్రాజ్యాధిపతిగ నొనర్ప దలచెనట..
ఇట్టి వెన్నియో గల్పనలు..
ఈ కల్పనలలో గొన్ని యైతిహాసింక 
సత్య కణికలేమైనను గంపించునాయని జూతముగాక..

26 మే, 2017

ధ్యానారూఢుడనైన తలపులో..

ఆనందాశ్రులు గన్నులన్ వెడల.. రోమాంచంబుతో..తత్పద 
ధ్యానారూఢుడనైన నా తలపులో..నద్దేవుడుందోచె... నే
నానందాబ్ధి గతుండనై.. యెరుగలేనైతిన్..ననున్నీశ్వరున్..
నానా శోకహమైన యత్తనువు గానన్ లేక.. యట్లంతటన్..
(Telugu bhagavatam.org nunchee)

నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.25 మే, 2017

దొరకునా ఇటువంటిసేవ..
శృతిలయలు సినిమా ఫంక్షన్ కడపలో జరిగింద.
విశ్వనాథ్ గారు వచ్చారు. 
మాఅయ్య పుట్టపర్తి ముఖ్య అతిథి. 
ఆ సందర్భంలో జరిగిన విషయం 
కళాతపస్వి ప్రస్థావన వచ్చిన ప్రతిచోటా 
విశ్వనాథ్ గారు చెబుతూనే వున్నారు.

30.10 నిమిషాలకు అయ్యమాట వస్తుంది. 
ఇవన్నీ దాచుకోడం..పెట్టుకోడం అయ్యకు ఇష్టం వుఃడదు.. అయ్యకు తెలీకుండా దొంగ దొంగగా చేయాలి. అందుకే..ఏదో సంశయం..
మీకుతెలుసా..ఆ పద్మశ్రీ అవార్డు 
ఆ పతకం ఎక్కడ పోయాయో.. 
బ్రౌన్ లైబ్రరీ లో వున్నాయేమో..

24 మే, 2017

నాపుణ్యమేమిజెప్పుదు..

కడప రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేస్తూ..
మాఅయ్య సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి వారికీ..
కుటుంబ సభ్యులమైన మాకు
ఎంతో ఆత్మీయులైన డా.రేవూరి అనంత పద్మనాభరావు గారు.
 నాకు ఈ ఆర్టికల్ పంపారు.
రేవూరి వారు అవధానాలలో అందె వేసిన చేయి.
 బహు గ్రంథ కర్త.
మీదుమిక్కిలి పుట్టపర్తి వారికి చేరువైనవారు.

 ఇదివరలో స్వర్గీయ శ్రీశైలం గారు
అయ్య అభిమాని..
ఎన్నో పేపర్ కటింగ్స్..
అయ్యవి భద్రపరచి నాకు అందజేశారు.

వానిని నా బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది..
ఇప్పుడు అనంతపద్భనాభరావుగారు
నన్ను గుర్తు పెట్టుకుని ఆర్టికల్ పంపారు.
వారిపై నున్న భక్తి భావంతో దీనిని తిరిగి ప్రచురిస్తున్నాను.


18 మే, 2017

పుణ్యంబై..మునివల్లభ గణ్యంబై..


ఒక కొడుకు తనను వీడిపోయాడు
అదీ తనవల్ల
కారణం తనకు ధర్మబధ్ధమే
కానీ పర్యవసానం అతి ఘోరం
మనసు దహించుకుపోతోంది..
స్వాంతన కావాలి
ముగ్గురు భార్యలు
ఒక్కోరిదీ ఒక్కో పంధా..
చిన్నదని ముద్దు చేసిన మూడవ భార్య తన నిస్సహాయతను అడ్డంపెట్టుకుని
కోరరాని కోరిక కోరింది..
ఇచ్చిన మాట వలన తను నిస్సహాయుడు

ఫలితం ..
ముక్కుపచ్చలారని కొడుకు అడవులు పట్టిపోవలసివచ్చింది
ఇక మిగిలిన ఇద్దరు భార్యలు ప్రజలు అధికారులు అందరు తనని అపరాధిగా చూస్తున్నారు
తన ఆత్మే తనని చిత్రవధ చేస్తూంది
కొడుకు కోడలు పసిపిల్లలు వట్టికాళ్ళతో నడచివెళ్ళారు
ఇంకో కొడుకు అన్నకు అండగా వెళతానని పోయాడు
అతని భార్య చేసేదేమీలేక దీర్ఘ నిద్రను ఆశ్రయించింది
అన్నీ తనవల్లే..
ఇంతకీ తన తప్పేమిటి
సత్య సంధత ధర్మ పాశానికీ సత్యపాశానికీ కట్టుబడిన నేరం తనది
సత్యం ధర్మానికీ కట్టుబడటం తప్పెలా అవుతుంది

కుమిలి కుమిలి పలవరిస్తూ కళ్ళుమూసాడు
నలుగురు కొడుకులున్న ఆయనను అంతిమ సంస్కారాలు చేయడానికి ఒక్కడూ లేడు
ప్రేతసంస్కారం జరపడానికి వీలులేని ఆ శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టవలసివచ్చింది..


ఇది దశరధ పాత్ర.
ఇలాంటి ఎన్నో సంఘర్షణల కలయిక రామాయణం.

ఇంత అద్భుత సృష్టి గురించి 
మిగిలిన  మహాకవుల స్పందన ఎలా ఉండేది .. 
ఇవి మనకెవరు చెబుతారు .. 
పుట్టపర్తి తప్ప .. 

ఏ ముహూర్తంలో వాల్మీకి రామాయణ రచన ఆరంభించినాడో ..
అందరికీ దాని పైననేకన్ను..

గత దశాబ్దాలలో కొందరు పాశ్చాత్యులు 
 రహస్యంగా మత దురభిమానం ఎక్కడో పని చేసేవారు
తమ గ్రంధాలతో రామాయణాన్ని పోల్చి చూడటానికి 
వ్యర్థ ప్రయత్నాలు చేశారు
కానీ అవి వ్యర్థాలుగానే మిగిలిపోయాయ్ 

వారు కూడా కడకు రామాయణ కవిత్వానికి 
తలవంచక తప్పదు
రష్యా దేశంలో సుమారు ఇరవైయేండ్లనుంచీ 
కొన్ని నూర్ల సార్లు రామాయణం నటింపచేశారట.

ఇంకా వారి హృదయాలు రామాయణచాపల్యాన్ని వదలలేదని 
వాళ్ళ వ్రాతలే చెబుతున్నాయి
కవిత్వం వరకూ పోకుండానే
కేవలం కథయే వారి దృష్టిని ఎంతో ఆకర్షించింది

రాముని పితృవాక్యపరిపాలనా
ఏకపత్నీవ్రతమూ
భ్రాతృప్రేమ
ఇలాంటి గుణాలే వారిని సమ్మోహితుల్ని చేశాయి

ఇక భారతీయులకు రామాయణమంటే నిత్యదాహం
దేశ భాషల్లో ఎందరో
 రామకథను వ్రాసుకుంటూ వచ్చినారు
రామకథాకారుల్లో పరమభక్తులై 
భగవత్సాక్షాత్కారం పొందినవారున్నారు
మహారాష్ట్రలో పండరీనాధుణ్ణి సాక్షాత్కరించుకున్న ఏకనాథుడు
భావార్థరామాయణం రాసినాడు
అవధీభాషలో తులసీదాసు రామకథను పాడినాడు
అతడు రామభక్తాగ్రేసరుడు
తమిళంలోని కంబరామాయణం చాలా ప్రసిధ్ధమైనది
మళయాళంలో ఎజుత్తచ్చెన్ రామాయణ కర్త.
వీరంతా కూడా భగవదనుభూతి కల్గినవారే.

వీరే కాక కావ్యరచనా దృష్టితో రా మకథను చేపట్టినవారెందరో
కన్నడంలో రెండు మూడు రామాయణాలున్నాయి
ఇక తక్కిన భాషల్లోను లేకపోలేదు
జైన రామాయణాలూ కొన్ని
విదేశీయ రామాయణాలూ కొన్ని.
తెలుగు కన్నడాలలో మొన్న మొన్న కూడా ఏదో శిల్పమని పేరుపెట్టి
రామకథను కొత్తరంగులు పూసిన వారున్నూ లేకపోలేదు

కానీ
 ఎవరెన్ని వ్రాసినా ఇవన్నీ 
వాల్మీకి రచనా కౌశలమ్ముందు పిల్లి మొగ్గలే అయిపోయినాయి

సావిత్రి వంటి మహాకావ్యాన్ని వ్రాసిన అరవిందయోగికి కూడా 
వాల్మీకి వంటి రచన చేయలేకపోయానే అనే నిరాశ.

ఇక సంస్కృత కవులందామా
ప్రతి ఒక్కరికి రామాయణం పైననే కన్ను
ఇది ఒక అమృత సముద్రం
సంస్కృతకవులలో అనేకులు ఆ సముద్రానికి దూరంలోనే నిలిచి నమస్కారం చేసినారు
కొందరు గట్టువరకు పోయి నిలబడినారు
కొందరు ఏవో చిన్న చిన్న మునకలు వేసినారు

ఉత్తర రామ చరిత్ర చూస్తే ఒక్కొక్కసారి నా దృష్టికి రామాయణాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతినే
అని భవభూతి పడిన వేదనగానే అర్థమవుతుంది


ఒక భవభూతి యేమిటి ..
అలా మథన పడిన వారెందరో ఉన్నారు.