24 ఫిబ్ర, 2016

ధార..



సాధారణముగా విమర్శకులు పూర్వకవులను 'ధారాశుధ్ధిగలవారని..'
యొకటే గాటిలో గట్టివేయుట కద్దు

కాని ..
వారు వారు సాధించిన ధారాశుధ్ధులలో దేడాలున్నవి

నన్నయ్యగారిది శ్రోత్రపేయమైన ధార..
'దీని తెర గిట్టిదీ' యని నిర్ధారింపరాని సంగీతము..
తిక్కన్నది ఎండాకాలపు వాగు..
నిలిచి.. నిలిచి .. ప్రవహించును..
శ్రీనాధునిది నాద శుధ్ధిపై ప్రత్యేక దృష్టిలేని 
వర్షాకాలపు ప్రవాహపు హోరు...
పెద్దన్న గారిది 
వీణానిక్వాణములు ఆనుషంగికముగా వెంట రాసాగిన ధార..
రాయలు .. రామకృష్ణుడు 
వీరిర్వురిది.. డొంకతిరుగుడు ధార..
ప్రవాహములో నెక్కడ సుడులున్నవో .. తెలియదు..
తలలెత్తిన గుండ్లెక్కడున్నవో యెరుగలేము..
నారదుని మహతినే.. 
కనకాద్రి కూట గర్జత్కాళికతో బోల్చిన రసికుడు వాడు..
రామరాజ భూషణుడు సాధించినది .. 
మాధురీధుర్యమైన తానా మృతముల  ధా ర ..
సంగీతములో జెవిగలిగిన సాహిత్యకారుల కీవింగడింపులంత కష్టసాధ్యముగాదు..

'వరాహపురాణము ' పరిచయము నుంచీ..

4 కామెంట్‌లు :

  1. ఎంత అద్భుతమైన విశ్లేషణ! ఆచార్యుల వారికి జోహారులు!!

    రిప్లయితొలగించండి
  2. ఆచార్యగారూ.. మీవంటి పెద్దల దయాదృష్టి ప్రసరిస్తుండగా మా అయ్య ఆశీస్సులు పైనుంచీ వర్షిస్తుండగా .. నా తపస్సు ఫలిస్తున్నదండీ..

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది. నిజమే. రాయలవారు, రామకృష్ణులవారిది అలాగే అనిపించింది. శ్రీనాథునిదీ తెలిసినది.తిక్కన గారిదీ అర్థమౌతోంది. మిగతావారివి నేనెక్కువ చదవలేదు , తెలియదు. ఆచార్యుల వారి పరిశీలనా, అవగాహన సామాన్యమైనది గాదు.

    రిప్లయితొలగించండి
  4. నా బ్లాగులోనికి స్వాగతం..మీ అమూల్యమైన వ్యాఖ్యకు థాంక్స్.. ఇక అయ్య ను తరచి తరచి చూస్తున్నకొద్దీ ఎన్నో విషయాలు కొత్త కొత్తగా తోస్తున్నాయి.. నేనూ మీలానే ఫీలవుతూ నా బ్లాగులో పెడుతున్నా..

    రిప్లయితొలగించండి