12 డిసెం, 2013

భాగవతాలెన్నో ..మరి.. మనకు తెలిసినవెన్ని..??



రామాయణం..
భారతం..
భాగవతం..
రామాయణం.. రాముని గమనం.. అంటే నడక


ధర్మాధర్మముల మధ్య అతని ప్రయాణం.
భారతం ..కౌరవులు పాండవులవారసత్వ
యుధ్ధం..
దానికి కృష్ణుని సారధ్యం
 

ఇక భాగవతం..??
కృష్ణ తత్త్వాన్ని చెప్పే సాధనం..
దీనిని రాసింది పోతన్న
పొలాలు దున్నుకొనే పోతన్న 

భాగవతాన్ని ఆంధ్రీకరించాడు
దీనిద్వారా అతను కోరింది తనకూ త
తో పాటూ 
అది చదివిన వారందరికీ కృష్ణ ప్రేమ..
తరువాత ఎంతమంది ఎన్ని రాసినా ..

పోతన్న రాసినదే ప్రామాణ్యమైంది
 

మరి ఇతర భాషలలోనూ భాగవతాలుంటాయిగా
వుంటాయి ..ఎందుకుండవూ..
వివిధ భాషలలోని భాగవతాలను గురించి 

మనకెవరు చెబుతారు..
అని ఆలోచిస్తున్నారా..?
 

'' కొందరకు దెనుగు గుణమగు
గొందరకును సంస్కృతంబు గుణమగు రెండుం
 
గొందరకు గుణములగు నే
నందర మెప్పింతు గృతుల నయ్యై యెడలన్.. ''
అని పోతన ప్రతిజ్ఞ
 

యీ ప్రతిజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చి శాశ్వత కీర్తిని పోతనార్యుడు గడిస్తే
పుట్టపర్తి కూడా ఆబాటనే పట్టి 

మరిన్ని భాషల భాగవత సుధలనాస్వాదించారు..

రాళ్ళసీమగా పేరుపడిన రాయలసీమలో 
రత్నమై భాసిల్లి..
తన జీవితం ద్వారా ...

ఆత్మ గౌరవానికి అసలైన అర్థం చెప్పి
పధ్నాలుగు భాషలపై మంచి పట్టున్న
మన సరస్వతీపుత్రులు పుట్టపర్తి వారి కన్నా సమర్థవంతంగా యెవ్వరు చెప్పగలరు..?



పదండి ..
అడుగుదాం.. 



భాగవతమన్నిభాషలయందును గలదు
కాని కొన్నిటిలో మాత్రమేయది 

సమర్థుల చేతిలో పడి నది.
 

కన్నడము నందును భాగవతము గలదు
సదస్త్సంశయ గోచరము. 

కుమార వ్యాసుని భారతమునకు 
యితర వీర శైవ కావ్యములకు వచ్చినంత ప్రచారము భాగవతమునకు రాలేదు.
 

తమిళ భాగవతమునకు కూడ నింతే గతి..
ఆ భాషలో నాయనార్లు, ఆళ్వార్లు 

వీరు రచియించిన భక్తి రచనలకే ప్రధమ తాంబూలము.
వాని తరువాతే నట్టి గౌరవము కలిసి వచ్చినది 

కంబ రామాయణమునకే.
భారత భాగవతములకు గాదు
భారతమునకంటె భాగవతమునకు 

బరియు వ్యాప్తి దక్కువ
 

కేరళ దేశమున మాత్రము 
భాగవతము ప్రజాదరమును గౌరవమును జూరగొన్నది
దానిని రచించిన మహాకవి ఎజుత్తచ్చన్ .
 

మహారాష్ట్రము నం దేకనాధుడు 
భాగవతమును రచించెను.
 

హిందీలోని సూరసాగరము ప్రసిధ్ధమే.
ఒరియా భాషయందును అచల దాసనుకొందును భాగవతమును వ్రాసి నారట.
అది ప్రసిధ్ధములే యని వారందురు. 


కాని యిన్ని భాగవతములున్నను..
వీనిలో వేనికిని పట్టని యదృష్టము 

ఆంధ్ర భాగవతమునకే బట్టినదని నా యూహ..

''పాయియకత్వం పడిడం , గుంఫేఉం , తహయకుజ్జ పసూణం
కునియంచ పసాయేవుం,అజ్జని బహవేణ యాణంతై''(వజ్జలగ్గ)
 

ఏకనాధుడు తన భాగవతమునందు 
బ్రహ్మండముగ పెంచి వ్రాసినది కృష్ణోధ్ధవ సంవాదమునే.
తక్కిన క
థాభాగమునంతయు జాల టూకీగ వెళ్ళగొట్టినాడు.
 

''ఎచుత్తచ్చన్'' వ్రాసిన భాగవతమునకు వర్ణలావైపుల్యమునను కథా సంవిధానమునకు పోతన్నతో పోటీలేదు.
అతని రచనలోనూ దశమస్కంధమొక్కటే పెద్దది.
 

హృదయ లాలిత్యమునకు 
భావోన్మాదమునకు ప్రతీకమైన సూరదాసునకు భావముల నదుపులో నుంచుకొను వశిత్వము తక్కువ
తలపులెట్లీడ్చిన నాతడట్లు పరువెత్తిపోవును. 

ఒక దశమ స్కంధము బాత్రమే యాతని కవితోద్యానమున విరిసి పూలు బూచినది.
తక్కినవన్నియు రసమును మూతిముట్ట వెలిచినవే..
దశమ స్కంధము నందును 

యొక దారి యొక తెన్ననిలేదు.
తోచినది తోచినట్లు వర్ణింపబడెను
 

ఒరియాలోని భాగవతమును నేను చదువలేదు..
కన్నడము , అరవ
ము
  వీనిలో భాగవతము లున్నవనిగూడ చాలమందికి దెలియదు.
 

కారణమేమననా గ్రంధకర్తలు  తపస్వులుగారు కవితా నిర్మాణమున నందెవేసిన వారును గారు
రెంటను సమర్థుడైనవాడు తెనుగునందలి పోతనామాత్యుడొక్కడే..
అతడు పవిత్రుడైన తపస్వి..
కవితలో నెన్ని పోకడలైనను పోగలవాడు..