28 జూన్, 2013

వారాల అబ్బాయిలు

                        
వట్టి చేతులతో వచ్చిన లక్ష్మీదేవికి ఎవరు ఆతిధ్యమివ్వగలరు..?


ధనం ఉన్నప్పుడే దానం చేయగలడనీ..
ఉపాధి ఉన్నవాడే ఊరికి ఉపకారం చేస్తాడనీ..
అనుకోవడం వెర్రి తనం ..

గుండె పండినవాడే పదిమందికి సాయం చేస్తాడు..
చెప్పులు కుట్టే చంద్రయ్య కైనా 
రోజుకి అర్ధరూపాయ్ వస్తుందేమో
 కానీ
అచ్యుతరామయ్యకి ఖచ్చితంగా ఇంత వస్తుందని  ఉండేది కాదు..
పొద్దుటే ముష్టి చెంబు పట్టుకుని
సీతారామాభ్యాన్నమః
అంటూ నాలుగు వీధులూ తిరిగితే అర్ధశేరు బియ్యం
జంధ్యాలు వడికితే అర్ధరూపాయి దక్కేవి
వీటితో సంసారం గడవడం కష్టమే

అయినా అతనెప్పుడూ దీనంగా దిగులుగా ఉండేవాడు కాదు..
పదిమందికీ తల్లో నాలుకలా నవ్వుతూ నవ్విస్తూ 
పదిమందికీ సాయం చేస్తూ కాలక్షేపం చేసేవాడు

ఊరంతా ఉప్పునీళ్ళే
కూలిపోతున్న పాకా 
ఓ మందార చెట్టు 
పక్కనే ఓ మంచినీళ్ళ బావీ..

ఊరందరూ అతని బావిలో నీరు తోడుకు వెళ్ళవలసిందే..
అతను కాదంటే వారికి మరో మార్గం లేదు..
అతని దారిద్ర్యం ఆసరా చేసుకుని 
అందరి దగ్గరా తలా అర్ధరూపాయ్ వసూలు చేసినా 
అతని బీదరికం మటుమాయమయ్యేది..

కానీ 
అతనికి అలాంటి నీచమైన ఆలోచన యెప్పుడూ రాలేదు..
ఊరంతా తన బావిలో నీళ్ళు తోడుకుని వెడుతుంటే 
ఆనందంగా సంతోషంగా చూస్తూ ఉండేవాడు..
ముసలి వాళ్ళూ 
పిల్లలూ చేద లాగలేక ఇబ్బంది పడితే
తాను వెళ్ళి సాయం చేసి వారు కృతజ్ఞతలు చెప్పబోతే.. 
చాల్లెండి ఏమాత్రానికేనా 
అని సిగ్గు పడిపోయేవాడు..

అవతలి వాడు అవసరం లో ఉన్నాడు కదా
 వీలైనంత దండుకుందాం 
అనే తత్త్వం ఆ రోజుల్లో నూటికి తొంభై మందికి ఉండేది కాదు 

ఇలా 
''ఆరోజుల్లో..'' పుస్తకంలో 
పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు 
పరిచయం చేసిన నాటి మనుష్యుల మనస్తత్వాలు ఎన్నో
చెయ్యి తిరిగిన రచయిత ఏది చెప్పినా అద్భుతమే..

నిజమే ఆ రోజుల్లో దాతృత్వం పాలు ఎక్కువే..
మా ఇంట్లో 
వారాల అబ్బాయిలు ఎప్పుడూ ఉండేవారట..
ముగ్గురు నలుగురు..

వంటవగానే మా అమ్మ 
అప్పటికి పదేండ్ల దయిన మా నాగక్కయ్యతో 

"ఏయ్ నాగా..
 వెళ్ళి వాళ్ళని అన్నానికి రమ్మను పో .."అనేదట
మా అక్కయ్య రివ్వున వెళ్ళి
"అన్నా..
 అన్నానికి రావాలంట
వంటయింది..
మా అమ్మ రమ్మంటూంది.."
అని చెప్పేది..

ఆ హైస్కూల్ పండితుని 
రెండువందల జీతంలో 
అద్దె ఇంట్లోనితమ అయిదుగురు పిల్లలతో  పాటూ
 వారాల అబ్బాయిలూ బరువనిపించలేదు..

ఒకసారి
మా పిన్ని కూతురు అల్లుడూ వచ్చారు చూడటానికి
''ఉండండి..
సాపాటు చేద్దురు ..''అంది అమ్మ

కానీ
ఇంట్లో బియ్యం లేవు
పక్క ఇంట్లో అరువుకు బియ్యం కావలసిన సామగ్రి తెచ్చి 
వారికి అతిఢి సత్కారం చేసింది మా అమ్మ

మా పిన్ని అల్లుడు పుట్టపర్తికి అమిత భక్తుడు
ఉపాసనాపరంగా సాహిత్య పరంగానూ
ఆయన ఇంటి పరిస్తితి చూసి 
అంతటి పండితునికీ పరిస్తితి యేమిటో కదా
అని చాలా బాధ పడ్డాడట.. 


23 జూన్, 2013

readers mail english paper cutting



పుట్టపర్తి స్వంత దస్తూరి తో శ్రీశైలం గారికి వ్రాసిన లేఖ 

ఒకప్పుడు కడప ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో
సాహిత్య దుమారం చెలరేగింది
అప్పుడప్పుడే పైకి వస్తున్న పుట్టపర్తిని చూచి ఓర్వలేని
ప్రాంతీయ కవులు కొందరు
పుట్టపర్తికి సంస్కృతం రాదనీ
మేఘదూతంలోని కొన్ని అంశాలపై
వరుస కధనాలను దినపత్రికలలో ప్రచురించారు
కానీ 
అవేవీ పుట్టపర్తి కీర్తిని తగ్గించలేకపోయాయి
కానీ 
ఎంతో మనస్తాపాన్ని కలిగించాయి
లౌక్యం  లేని వాణిగా పరిగణింపబడే పుట్టపర్తి
సూటిదనమే తనకు సరైన మార్గంగా ఎంచుకున్నారు





నిత్య పాండిత్య పరిశోధకుడు పుట్టపర్తి


సేకరణ : రామవఝుల శ్రీశైలం 



నిత్య పాండిత్య పరిశోధకుడు పుట్టపర్తి 

21 జూన్, 2013

"సరస్వతీ సంహారము " కన్నడ మూలం : బీచీ తెలుగు అనువాదం : సరస్వతీపుత్ర పుట్టపర్తి

"సరస్వతీ  సంహారము " 
ప్రముఖ కన్నడ రచయిత బీచీ రచనకు
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అనువాదం

కన్నడ భాషపై పుట్టపర్తికి చాలా అభిమానం  
మా అమ్మ మా పెద్ద బావగారు 
బసవని వచనాలు తెలుగు లోకి అనువాదం చేసారు..

మా రెండవ అక్కయ్యను 
కర్ణాటక లోని హొస్పేట వద్ద నున్న 
కామలాపురానికి ఇవ్వడం
 అక్కడికి  హంపీ శిధిలాలు దగ్గరే కావడం
 అయ్యకు పరమానందం 

అంతేకాక 
మా బావగారు శ్రీమాన్ రామానుజాచార్యులు 
చాలా మంచివారు. బంధు ప్రీతి ఎక్కువ
మా అయ్యను తన తండ్రి లాగానే 
చూచి ప్రేమించి బాధ్యతను కూడా తీసుకొని 
మా అందరి పెళ్ళిళ్ళూ పెద్దరికం వహించి 
మా అమ్మకు కొండంత అండగా నిలబడినవాడు


మా అయ్య జబ్బు పడినప్పుడు
సొంత కొడుకు కంటే ఎక్కువ సేవ చేసాడు
రెండునెలలు సెలవు పెట్టివచ్చి 
ఆసుపత్రికి రోజూ వెళ్ళి 
పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ అక్కడే వుండటం 
మందులు జాగ్రత్తగా ఇవ్వటం 
చివరికి బాత్రూముకు కూడా తీసుకు వెళ్ళటం 
ఎన్నని చెప్పను..

అయ్య అప్పుడప్పుడూ కామలాపురానికి వచ్చి 
ఒకటి రెండు నెలలుండి
తన  మనవలు మనవరాళ్ళతో సరదాగా 
ఆ శిధిలాల మధ్య తిరుగుతూ
తమాషా కబుర్లు చెబుతూ 

మా బావగారి  తోటలోని 
మామిడి పళ్ళను పనస పళ్ళను పొట్టపగిలేలా తింటూ 
తృప్తిగా కాలక్షేపం చేసేవారం మేమందరం ..

మా బావగారికి సాహిత్య వాసన లేవీ లేకపోయినా 
మంచి మనసుండేది
ఇప్పుడు ఆయనా లేరనుకోండి
జీర్ణ కోశం కాన్సరుతో పోయారు
దేవుడు మంచివాళ్ళను తొందరగా తీసుకు పోతాడు అనిపిస్తుంది

అన్నట్ట్లు 
మా బావగారు Western way లో జాతకాలు చెప్పేవారు
ఆయనతో మా అయ్య 
తన జాతకం ఎన్నిసార్లు చెప్పించుకున్నారో 

యీ జడ కాష్ఠము నేడిపించి నీ సంతము దీర్చుకో..




20 జూన్, 2013

పుట్టపర్తి మంత్రశిష్యుని "శ్రీ గురు చరితామృతం"









పుట్టపర్తి మంత్ర శిష్యుడు రఘూత్తమ రావు
ఆయనెంత సద్గురువో
ఈయనంత అంతే వాసి 
ఎందరో శిష్యులు ఉన్నా
ఆశ్రమ జీవనంలో
శ్మశాన వాసంలో తోడుగా నిలిచినా 
జీవితం చివరివరకూ
పుట్టపర్తిని వీడని వాడు
జ్యోతిశ్శాస్త్రం చక్కగా ఎరిగినవాడు
ఆయన తన గురువుపై
శ్రీ గురు చరితామృతం వ్రాసాడు
ఇది 
పుట్టపర్తి ప్రత్యేక సంచికలో ముద్రింప బడింది


పండరీ భాగవతం లోని 
పుండరీక చరిత్ర 
భాగవతంలోని మరెన్నో కధలు చెప్పుకుంటూ 
ఆ గురు శిష్యులు భక్తి పారవశ్యంలో 
కన్నీరు కార్చేవారు 
ఇద్దరికీ అంతటి హృదయ సామీప్యత..








19 జూన్, 2013

మరువ బోకుము నా సఖీ .. మరచిపొమ్ము..


పోతన శ్రీనాధుల చుట్టరికం మాటేమిటి..?


శ్రీనాధుడు 15వ శతాబ్దమున జీవించినాడు. 

వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని

ఆస్ధాన కవి. 

విద్యాధికారి. 

ఈ కాలమందు 

ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.

ఈయన పోతన కు సమకాలీనుడు. 

పోతనకు బంధువని, 

పోతన రచించిన 

శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి 

అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే 

కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి 

కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా 

వాటి విశ్వసనీయత పై 

పలు సందేహాలు, 

వివాదాలు ఉన్నాయి.

డిండిమభట్టు అనే పండితుని 

వాగ్యుధ్ధంలో ఓడించి 

అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. 

ఈతనికి కవిసార్వభౌముడను 

బిరుదము ఉంది .

చారిత్రకునిగా పేరున్న పుట్టపర్తి 
పోతన శ్రీనాధుల చుట్టరికాన్ని 
అంగీకరించారని అనుకోవాలా ..?

శ్రీనాధుడు మహా భోగి 
తన కృతులను రాజులకు అంకితమిచ్చి 
తద్వారా లభించిన సొమ్ముతో 
జీవితాన్ని హాయిగా అనుభవించిన వాడు 

మరి పోతన 
తనకు సంప్రాప్తించిన దారిద్ర్యాన్ని కూడా 
తృప్తిగా అంగీకరించి రామ భక్తి నే నమ్ముకున్న 
పరమ భక్తుడు 

ఇద్దరి మనస్తత్వాలలో 
హస్తి మశ కాంతర భేదం 

    ఈ  కథ  పుట్టపర్తి వ్రాసిన 
రాయల నీతి కథలు లోనిది 
సేకరణ శ్రీ రామావఝ్హ్ఝుల శ్రీశైలం 
ప్రచురణ సమయం 1955















17 జూన్, 2013


కవిత్వానికి 


శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి 


అద్వితీయ స్థానాన్ని పొందిన కవి 


శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. 


భాషలో, 


భావంలో 


దృక్పథ ప్రకటనలో 


కవి కుండాల్సిన నైతిక ధైర్యం 


ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. 


కవి 


సామాజిక, 


సాంస్కృతిక నాయకుడై 


జాతిని నడపాలని భావించిన 


శేషేంద్ర కవిసేన పేరుతో 


ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. 


సాహిత్య రంగంలో శేషేంద్ర 


ఎప్పుడూ ఒక సంచలనమే. 


సొరాబు నుంచి 


ఆయన ఆధునిక మహాభారతం దాకా 


గరీబు వెంట నడిచారు. 


ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు 


తెలుగులో అరుదుగా కనిపిస్తారు.



“ప్రసిద్ద దాక్షిణాత్య ఆధునిక కవులు” 


కూర్పు : కడియాల రామ్ మోహన్ రాయ్ 


పుస్తకం వెనుక  ముద్రించిన  అక్షర సత్యాలివి 


ప్రచురణమాలికలో మూడవదిగా 


ద్రావిడ విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని 


వెలువరించింది .


అటువంటి శేషేంద్ర శర్మ పుట్టపర్తిని గూర్చి 


ఏమంటారో చూడండి 






15 జూన్, 2013

పుట్టపర్తి శతజయంతి ఉత్సవాలసందర్భంగా దూరదర్శన్ కార్యక్రమం

పుట్టపర్తి శతజయంతి ఉత్సవాలసందర్భంగా దూరదర్శన్ కార్యక్రమం


7 జూన్, 2013

వ్యాస సౌరభము






సేకరణ రామావఝ్ఝుల శ్రీశైలం గారు

''వ్యాస సౌరభము''
7 వ ఫారము పి యు సి బి ఎస్ సి విద్యార్థులకు
 పుట్టపర్తి వ్రాసిన  వ్యాసాలు ఇవి
ముద్రణ 1964
అంటే నేను రెండేండ్ల పిల్లను
మున్నుడిలో
దీనిని పుట్టపర్తి చెబుతుండగా 
గోనుకొండ వేంకటసుబ్బయ్య అనే వ్యక్తి వ్రాసారని తెలుస్తుంది
వ్రాయుట అలవాటు తప్పి పోవటానికి కారణము వయస్సు
రెండవకారణము 
మనస్సులో దినదినమును సెలవేయుచున్న విరక్తి
అప్పుడప్పుడు 
నా శిష్యులు మిత్రులు 
నా మనసు ను భౌతికముల వైపు ఈడ్తురు 
కీర్తి ధనము 
వీని విలాసములు క్షణ కాలము నా కండ్ల యెదుట మెరయును
ఇది నా దౌర్బల్యమే..
దీనిని పోగొట్టమని భగవంతుని ప్రార్థించుటకంటెను 
మరేమి చేయలేను
అంటారు..


యీ వ్యాసాలలో విద్యార్థులకు విషయం చెబుతూ
 తన జీవిత సంఘటనలనూ 
పుట్టపర్తి అక్కడక్కడా జ్ఞాపకం చేసుకొంటారు.

ధనము గురించి ..
బయటి ఊళ్ళలో తిరిగినప్పుడు 
ధనము విలువ బాగా తెలియును
చేతనున్న దానిని విరివిగా ఖర్చు పెట్టినచో 
సమయమునకు లేక దేబిరించవలసి వచ్చును కదా..
అంటారు..
కానీ చివరి వరకూ ధనము విలువ తెలియకనే 
అంతా భగవంతుని మీద వదిలి 
వాడే చూసుకుంటాడు అంటూ గడిపారు
వాడు చూసుకున్నాడో లేదో మరి


















4 జూన్, 2013

సీమ కవులకు న్యాయం జరిగిందా? - బిక్కి కృష్ణ





''సీమ కవులకు న్యాయం జరిగిందా ..?''

అని సోమవారం ఆంధ్ర భూమిలో ఆర్టికల్ వచ్చింది

ఇప్పుడిలా తలుచుకోవడం వలన ఒరిగేదేమీ లేకపోయినా

పుట్టపర్తిని జనం ఆరాధిస్తున్న వైనం

 ఇచ్చిన స్థానం అన్ని అవార్డుల కంటే గొప్పవి 


                        సీమ కవులకు న్యాయం జరిగిందా?

  •                   - బిక్కి కృష్ణ, 9912738815
  •  
  • 03/06/2013

రాయలు పెనుగొండలో గగనమహల్ కేంద్రంగా అష్టదిగ్గజ కవులను ఎంతగానో ప్రోత్సహించారు. 
పెద్దన మనుచరిత్రలోని హిమాలయ పర్వత వర్ణన.. 
భట్టుమూర్తి వసుచరిత్రలోని కోలాహల పర్వతం (పెనుగొండ), 
శుక్తిమణి (చిత్రావతి) నదులు ఈ ప్రాంతంలోనివే అంటారు. 

ఇలాంటి ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రాంతాన్ని 

చిన్న వయసులోనే ‘పెనుగొండ’ లక్ష్మికావ్యంగా 

చిత్రించి.. 

సరస్వతీపుత్రునిగా పేరుపొందిన పుట్టపర్తికి 

జ్ఞానపీఠం దక్కక పోవడం దురన్యాయమే.. 

ఆనాడే కాదు ఈనాడు కూడా.. 
బాలల సాహిత్యం ‘అక్షర సైన్యం’లాంటి అభ్యుదయ కవిత్వం రాసి
 ‘కవి కాకి’గా పేరుపొందిన గొప్ప కవి కోగిర జైసీతారాంకు
 కనీసం బాలల అకాడమీ అవార్డు అయినా ప్రభుత్వంగాని.. 
సాహితీ సంస్థలు గాని ప్రకటించకపోవడం శోచనీయం.

‘క్షామము లెన్ని వచ్చిన రసజ్ఞత ఇంచుక చావలేదు రాయలసీమలో’
అన్నారు నండూరి రామకృష్ణమాచార్యులు.
 ఈ రసజ్ఞత కవులదే! 
వారి సాహిత్య కృషి అనితర సాధ్యమైంది. 

ఒక పుట్టపర్తి,

 ఒక విద్వాన్ విశ్వం, 

ఒక పప్పూరు రామాచార్యులు, 

రాళ్లపల్లి కల్లూరు అహోబలరావు.. 

ఇలా ఎందరెందరో సాహితీ కృషీవలురు. 

ఇక విమర్శ పుట్టింది సీమగడ్డలోనే. 
కట్టమంచి రామలింగారెడ్డి 
‘కవిత్వ తత్వ విచారం’ చాలా ముందుగానే వచ్చింది. 
రాళ్లపల్లి వేమన ఉపన్యాసాలు, 
రా.రా. విమర్శలు, కట్టమంచి, రా.రాల విమర్శ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 

ఎందరెందరో (ఇవి కొందరి పేర్లు మాత్రమే) సాహితీ కృషీవలులు
 సీమ సాంఘిక, భౌగోళిక, ప్రజల జీవన పార్శ్వాలను, 
కరువు, ఫ్యాక్షనిజం తదితర అంశాలపై కథలు, కవితలు, కావ్య విమర్శలు, 
ప్రాచీన ఆధునిక సాహిత్య సంప్రదాయ రచనలు చేసి లబ్దప్రతిష్ఠులయ్యారు. 

అయితే సీమలో పుట్టడం వల్లనో,
 వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలచేతనో.. 
సీమ రచయితలు, కవులు, కథకులు, సాహితీ విమర్శకులకు తగిన గుర్తింపు రాకపోగా... 
జ్ఞానపీఠం లాంటి అవార్డులకు, 
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులకు (ఒకరో ఇద్దరో తప్ప)
 అనంతపురం కరువుజిల్లా వారికి.. 
అసలే లేవు. రావు.
 కారణాలు ఆ ప్రాంతపు అసమర్థులైన రాజకీయ నాయకులు.. 
సాహిత్య విలువలు తెలియని పాలకులు.. 

తెలంగాణ.. కోస్తా ప్రాంతాల మాదిరి పోరాట పటిమ, ఐక్యత లేదు. 
కాకాలు, బాకాలు ఊదే సంస్కృతికి భిన్నంగా.. 
ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వాలు, 
కరువును బాగా అనుభవించిన నేపధ్యంలో.. కోరికలు తక్కువగా ఉండటం.. 

ఇలా ఎన్నో కారణాలచేత సీమ కవులకు, రచయితలకు, విమర్శకులకు 
రావలసిన కీర్తిగాని, ‘పదవులుగాని, అవార్డులుగాని దక్కలేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. 

ఇప్పటికి తెలుగువారికి రెండు జ్ఞానపీఠ అవార్డులు వస్తే.. 
అవి సీమేతర ప్రాంత కవులకు మాత్రమే వచ్చాయి. 
ఇది సీమకవులకు జరిగిన ద్రోహం కాదని ఎవరైనా అనగలరా? 
పోనీ అర్హులు లేరా? 

పదునాలుగు భాషల్లో పాండిత్యం సంపాదించి, 
శివ తాండవం జనప్రియ రామాయణం, పెనుగొండ లక్ష్మీలాంటి కావ్యాలు, 
అనువాదాలు.. విమర్శలు.. రాసిన పుట్టపర్తి నారాయణాచార్యుల సాహితీ కృషికి 
ఎన్ని జ్ఞానపీఠాలు ఇస్తే సరిపోతుంది? 

ఆ రోజుల్లోనే వందకు పైగా కావ్యాలు, విమర్శలు.. 
ఇలా అనేక గ్రంథాలు రాసిన ఆ నిత్య సాహితీ కృషీవలునికి 
జరిగిన అన్యాయం తలుచుకుంటే.. 
ఒళ్ళు మండిపోతుంది. 

కేవలం కరువు సీమలో పుట్టడం వల్లనే.. 
ఆ కృషి బుగ్గిపాలయిందా? 
నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, వెదుకల్లు సదాశివన్ లాంటి రాజకీయ ఉద్దండులు కూడా 
సీమ కవులకు అండగా నిలవకపోవడం, న్యాయం చేయకపోవడం దారుణం. 

పెనుగొండలో గగనమహల్ కేంద్రంగా అష్టదిగ్గజ కవులను కృష్ణదేవరాయలు ఎంతగానో ప్రోత్సహించారు. 
పెద్దన మనుచరిత్రలోని హిమాలయ పర్వత వర్ణన.. 
భట్టుమూర్తి వసుచరిత్రలోని కోలాహల పర్వతం (పెనుగొండ), 
శుక్తిమణి (చిత్రావతి) నదులు ఈ ప్రాంతంలోనివే అంటారు. 

ఇలాంటి ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రాంతాన్ని
 చిన్న వయసులోనే ‘పెనుగొండ’ లక్ష్మికావ్యంగా చిత్రించి.. 
సరస్వతీపుత్రునిగా పేరుపొందిన పుట్టపర్తికి 
జ్ఞానపీఠం దక్కకపోవడం దురన్యాయమే..

ఆనాడే కాదు ఈనాడు కూడా..
బాలల సాహిత్యం ‘అక్షర సైన్యం’లాంటి అభ్యుదయ కవిత్వం రాసి ‘కవి కాకి’గా పేరుపొందిన గొప్ప కవి 
కోగిర జై సీతారాంకు కనీసం బాలల అకాడమీ అవార్డు అయినా ప్రభుత్వంగాని.. 
సాహితీ సంస్థలు గాని ప్రకటించకపోవడం శోచనీయం. 

అటు కర్నాటకలో ఇప్పటికి 12 మంది కవులకు కథా రచయితలకు జ్ఞానపీఠ అవార్డులు దక్కాయంటే..
 అక్కడ సాహితీ సృజనకారులకు ఎంతటి ప్రోత్సాహం లభిస్తుందో.. 
ఇట్టే మనం ఊహించవచ్చు. 

దౌర్భాగ్యం.. ఏమిటంటే.. 
అదే కర్నాటక సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా రచయితలకు కవులకు.. 
పెనుగొండలో (రాయల విడిది) పనిచేసిన కవులకు 
ఎలాంటి అవార్డులు (స్థాయికి తగిన) దక్కకపోవడం విడ్డూరం. 

సీమ రచయితల్లో బాగా నష్టపోయిన గొప్ప రచయిత పులికంటి కృష్ణారెడ్డి.
 సీమ చిన్నోడిగా గుర్తింపు పొంది 
సీమ కథల మాండలికాలను.. 
జానపద గేయాల (అమ్మి పాటలను) మాధుర్యాలను

 చిత్తూరు నుంచి చికాగో వరకు రుచి చూపించిన ఆ మహాకథకున్ని 
అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాని.. ఇటు పేరొందిన సాహితీ సంస్థలు గాని
 గుర్తించి.. గౌరవించకపోవడం శోచనీయం. 

ఆయన రాసిన దళిత కథలు దళిత వాదం పుట్టకముందే వచ్చాయి.
 నండూరి ఎంకి పాటలకు ఏమాత్రం తీసిపోనివి పులికంటి అమ్మిగేయాలు. 
ఆయన కేవలం సీమ ప్రాంతం వాసి కావడంవల్లనే..
న్యాయం జరగలేదన్నది నూటికి నూరు శాతం నిజం. 

సాహిత్యపు పిచ్చితో రైల్వేలో మంచి ఉద్యోగం కూడా వదులుకున్న పులికంటి 
సాహితీ సేవలను తలచుకుంటే.. 
ఎంతో బాధ కలుగుతుంది. 

చివరకు ఆయనే తన పేరిట అవార్డులు ప్రకటిస్తూ.. 
సాహితీ సేవ చేశారు. 
కన్నడంలో ఎంతోమంది కథారచయితలకు జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారు.
సీమలో సింగమనేని, 
డా.శాంతినారాయణ, 
బండి నారాయణస్వామి లాంటి వారికి కనీసం అకాడమీ అవార్డులు కూడా రాలేదు. 

సీమ కథకు దిశానిర్దేశం చేసిన సింగమనేని 
సీమ రైతులపై ఎన్నో కథలు రాశారు. 
పల్లేరు ముళ్ళు పేరుతో శాంతి నారాయణ అద్భుత కథా సంకలనం విడుదల చేశారు.
 బండి నారాయణస్వామి.. తెల్లదెయ్యం, వానరాలె లాంటి ఒక్కో కథకు.. ఒక్కో అవార్డు ఇవ్వవచ్చు. 

సీమ కరువును అనుభవించి,
 కడుపులు మండి.. 
గుండెలు రగిలి... పొగిలి.. 
కథలు.. కవితలు రాసిన సీమ కవులకన్నా
 ఏ ఆఫ్రికన్ కవి గొప్పవాడో.. 
ఏ అమెరికన్ రచయిత గొప్పవాడో.. 
దమ్మున్న సాహిత్యకారుడెవరైనా చెప్పగలడా?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే అవార్డు పుస్తకాల్లో.. 
ఇంతకన్నా సత్తా ఉన్నా.. పుస్తకాలేమిటో.. 
వాటి గొప్పతనమేమిటో.. చెప్పగలరా?

కర్నాటక సరిహద్దులోనే 
హళెకన్నడ.. హొసగన్నతి- సంస్కృతులను.. 
భాషా మాండలికాలను..
 ప్రజల జీవన విధానాలను చిత్రించిన కన్నడ రచయితలకు.

 కర్నాటక సరిహద్దు రచయితలకు పెద్ద తేడా ఏమిటో
 ఏ యూనివర్సిటీ పరిశోధకులైనా నిగ్గు తేల్చగలరా
?