26 డిసెం, 2011



అది P.Tఉష బంగారు పతకాలు 
 సాధించిన సంవత్సరం..
 హైదరాబద్ TV లో ఢిల్లీ నే తొంభై శాతం వచ్చేది..
ఓ రెండు గంటలేమో
హైదరాబాదు DD1 ప్రసారాలు వచ్చేవి 
అవికూడా పాడీ పంటా ..చెతా చెదారం లాంటివే..
ఒలంపిక్స్ ప్రముఖంగా ప్రసారమయ్యేవి..
అయ్య ఆసక్తిగా చూసేవారు..

 ఒరేనీ..పరిగెత్తి .. పరిగెత్తి బంగారు పతకాలు తెచ్చిందే.. 

నేనూ చిన్నప్పటి నుంచీ పరిగెత్తడమన్నా..ప్రాక్టీసు చేసింటే బాగుండు..

అది దొంగతనమైనా సరే నీవే నంబర్ 1 గా వుండాలి అనే వారు.
అనేవారు అయ్య సరదాగా..

అమ్మ కడుపుకాలా అనేది అచ్చమైన రాయలసీమ నుడికారం..
అయ్య ఊతపదం..

అయ్య నోటివెంట అది ఎంత చమక్కుగా ఉంటుందో అయ్య నెరిగిన వారికి బాగా తెలుసు..

ఉపన్యాసాల లలో  తుకారామునికీ ..సూరదాసుకూ.. మధ్య మధ్య ఆ పరమాత్మకూ ఈ విధంగా వడ్డింపులు జరిగేవి..

అయ్య ఆ మాట అనగానే సభికులు పగలబడి నవ్వేవారు..

పద్మశ్రీ వచ్చిన సందర్భంలో ఎవరో అభినందిస్తే ..

ఏం పద్మశ్రీ లేవయ్యా.. 

బస్సులో ముందు సీటు కూడ దొరకదు దీనితో..
అన్నారట పొత్తూరు వారు తమ సంపాదకీయంలో కాబోలు చమత్కారంగా వ్రాసారు..

పుట్టపర్తి నారాయణాచార్యుల అభిమాన గాయకుడు ..భీంసేన్ జోషి--పుట్టపర్తి అనూరాధభీంసెన్ జోషి





భారతరత్న..భీంసెన్ జోషి గారి పాటలు అయ్య మైమరచి వినేవారు..



ఆయన రూపును చూచినప్పుడల్లా..
 అయ్య గుర్తుకు వచ్చి..
మనసు వికలమవుతుంది..
మీరూ వినండి.. 

http://musicmazaa.com/kannada/devotionalsongs/album/Bhimsen+Joshi.html#playThis