23 మార్చి, 2016

పుట్టపర్తి గైడైతే ఎలా వుంటుంది .. ??





మన మెక్క డైనా  చారిత్రిక స్థలానికి పోదలిస్తే . . 
'రైళ్ళు బస్సుల ఫెసిలిటీ యేమన్నా వుందా '
అని చూస్తాం
తర్వాత రిజర్వేషన్ 
ఆ రోజుకు సర్దుడు కార్యక్రమం చేసుకుని
పిల్లలతో ప్రయాణమౌతాం
రైలు దిగిన వెంటనే మంచి హోటల్ వేట
దిగి .. స్నానం రెస్ట్..

తాము చూడదలచుకున్న ప్రదేశాలకు 



తాము చూడదలుచు కున్న ప్రదేశాలకు 
యేవైనా కార్లు లేక పోతే టూరిస్ట్ శాఖ వారి సదుపాయాలు
అక్కడ కూడా మనం చల్లగా సేద తీరడానికి అడుగడుగునా హోటళ్ళు శీతల పానీయాలు తినుబండారాలు.. అందుబాటులో వుండాలి 

ఒక గైడ్ అక్కడ మనకు తగులుతాడు

ఒక గైడ్ మనకు తగులుతాడు 
నిజమో కాదో కానీ 
ఏదో ఒకటి గబ గబా మనకు చెబుతూనే వుంటాడు
ఇది రాణులు జలక మాడిన స్థలం
ఇది రాజుల గుర్రపు శాల 
మనం సగం వినీ వినకా 
ఎండలో చెమటలు కారుస్తూ.. 
ఎందుకొచ్చామ్రా భగవంతుడా అని అప్పుడప్పుడూ మనసులో పశ్చాత్తాప పడుతూ..
ఆయాత్ర యేదో కానిస్తాం




సా యం త్ర మవుతుంది 
తిరిగి బస ..
తిరుగు ప్రయాణం
దీనివల్ల తెలుసుకున్నదేమైనా వుందా..
యేమో..
మేం అక్కడికి వెళ్ళి వచ్చాం 
అని నలుగురికీ చెప్పడానికి తప్ప
మరిచాను ..
సెల్ ఫోన్ లో తిగిన ఫోటో  ల సమ్రంభం ఎలానూ వుంటుంది
ఇలాగేనా టూర్లకు వెళ్ళేది..

మరి మన పుట్టపర్తి గైడ్ అవతారమెత్తితే ఎలా వుంటుంది



మరి మన పుట్టపర్తి గైడ్ అవతారమెత్తి తే ఎలా వుంటుంది .. ?? 
వహ్వా.. తాజ్ ..
అనాలనిపిస్తుంది కదూ..
కానీ పుట్టపర్తి కొన్ని కండీషన్ లు పెడుతున్నారండోయ్
నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..?
లేక టైం పాసుకు వస్తున్నారా .. ?
ఇది మొదటి ప్రశ్న
ఇందుకు తయారైన వాళ్ళు మాత్రమే సిధ్ధపడాలి..
అయితే ఆ కండీషన్స్ యేమనుకుంటున్నారు..

''పూర్వ విజయనగరమును జూచుటకు 



పూర్వ విజయనగరమును జూచు టకు 
రెండు సాధనములున్నవి
హంపీకేగిన వెంటనే యొకింత విచారించినచో ..
ఊరుజూపించు కూలీలు (గైడ్ లు) కొందరు దొరుకుదురు..
వారిని నమ్ముకొనిన యెడల ..
మన కాళ్ళ శక్తి కొలది యందందు ద్రిప్పి .. 
యది .. ఇది.. యని చెప్పుచు 
ప్రభుత్వములోని Archaelogical Departmentవారు 
వ్రేల గట్టిన సూచక పఠములకు  (బోర్డ్స్) 
కొన్ని చోట్ల అందునట్లు.. 
కొన్ని చోట్ల అందనట్లు ..
మరికొన్ని యెడల వాటికి 
మన యూహలకు నతీతమగునట్లు ..
నాయా కట్టడముల స్థలముల నిరూపించి 
సాయంకాలమునకు బసకు జేర్చుచు 


సాయం కాలమునకు బసకు జేర్చుచు 
రెండు మూడు దినములలో మన పర్యటనమును ముగింతురు..
(మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా 
మన కొండవీటికి రాజసిం హుడొక్కడే రారాజురా..
ఆ రాజు గాధే ఈ రాజు పాట 
నా పేరే రాజు..
అని వాడు పాడుతూ మనల్ని యాత్ర గావిస్తాడు.. )
వారిపై నాధారపడినవారికి విజయనగరమనిన 
గుండ్లు.. రాళ్ళు .. గుళ్ళు..
గోపురములు .. పాడుపడిన ఇండ్లు..
కోతులు .. కొండముచ్చులు...
మంచి పాలు పెరుగు నున్న యొక ప్రదేశమనిపించును..''

ఫాలో అవుతున్నారా..



ఫాలో అవుతున్నారా 
అదీ సంగతి..

ఇక రెండవ సాధనం..



ఇక రెండవ సాధనం 
పై శాఖవారి కొకప్పుడధ్యక్షుడుగ ఉండిన 
లాంగ్ హర్ట్స్ అనే ఆయన వ్రాసిన పుస్తకము..
అది ఆంగ్లేయ భాషలో వుంది .. 
దాని సహాయంతో పూర్వస్తితి కొంత తెలియగలదు..
కానీ మన సంప్రదాయం తెలియక..
అందులోని పెద్దలను విచారించక.. 
తయారుచేసిన పుస్తకము కావటం వలన
పెడదారి పట్టినదని మా అనుభవము..
మేము అక్కడికి పదమూడుసార్లు వెళ్ళి చూశాము.. 
రెండు సాధనాలనూ పరిపూర్ణముగా వాడుకున్నాం
అందలి పెద్దలతో కొన్ని విషయాలను కూడ ముచ్చటించినాము..

అన్నిటికన్న .. 

ఆ పట్టణమును .. 
సామ్రాజ్జమును నేలిన శ్రీదేవరాయవంశసంభూతులగు నానెగొంది సంస్థానాధీశ్వరుల రా జబంధులిర్వురితో 
పై పెద్దలతో వలె  ముచ్చటిం చుటే కాక .. 
 కొంతకాలమాయా విషయములను గూర్చి చర్చించియుంటిమి.. 
అట్లలవడిన పరిజ్ఞానము ననుసరించి 
ఇందలి పర్యటనక్రమమును సమకూర్చియున్నాము.


పూర్వము విజయనగర తైర్థికులు రైల్వే గైడులు చదువుకొని..
దొరలవలె కమలా పురము చేరి 
యందు బంగళాలో బ్రవేశించి..
దానిలో గా పలాయున్న కింకరుని నమ్ముకొనినచో నణుమాత్రము లాభించదు..

అందున్న నాలుగైదురోజులు సుఖముగ గడుచుటకు 

అ ది మంచి మార్గమే కాని
మునుపటి పట్టణ విషయము తెలుసుకొనుటకది సాధనము కాదు..

మరి .. ??

అందలి కుర్చీలతో .. బల్లలతో .. 
నాగరకతా సూచనలతో కొంత రసభంగమగును..
పాడువడిన పట్టణముల జూడనెంచిన వారు .. 
పాడువడ్డ స్థలములలోనే నివాసమేర్పరచుకొని యున్న 
యొక విధమైన భావముకలిగి .. 
యందలి విషయముల సంగ్రహించుటకు వీలైన మనోగతి యొనగూడును..
సరియగు మనో గతి లేనిదే ఎట్టి విషయమును బోధపడదని మేము చెప్పనక్కరలేదు..

అట్లగుట నటువంటి తైర్థికులందరు 

హంపీలో బస నేర్పరచుకొనుటయే మా మతము
అందు బసచేయుట కనువైన తావులుండునా యని..?? సంశయింపనక్కరలేదు..
శ్రీ విరూపాక్ష శ్వామి తన యాలయములో 
గొన్ని వందల మంది సుఖముగ నివసించుటకు
 వసతు ల నొసంగగలడు..

అది బహిరంగముగ నుండుననుకొనువారికి 

దానినానుకొనియున్న మఠములలో గదులు దొరకును..
కాకున్న 
హంపీ బజారులలోని యిండ్లలో నొకదానిలో బ్రవేసింపవచ్చును..
అట్లు కావించినచో.. 
నెటుజూచినను శిధిల నిర్మాణములు 
సర్వదా కంటబడుచుండును.. 
దానితో యాత్ర కనుకూలమైన మనస్థితి యొదవును..

చూచారా..

మనమొక విషయం తెలుసుకోవాలంటే .. 
ముందు మన మనస్థితిని
ఆ విషయాలకు అనుగుణంగా సిధ్ధం చేసుకోవాలి
అని ఆచార్యులవారు ఎంత ఖచ్చితంగా చెబుతున్నారో..
ఈ గైడ్ మనకు వుండడానికి వసతి కూడా చూపుతున్నాడు .. 
ఇంత బాధ ఎవడు పడతాడ నుకుంటే 
ఎవడో పాశ్చాత్యుడు 
మన విజయ నగర వైభవాన్ని గ్రంధస్తం చేసేస్తాడు  మరి ..
బ్రౌన్ దొర తెలుగు భాషా సేవ చేసినట్లు .. 
సిగ్గుగా అనిపిస్తే మాత్రం ముందుకు నడవండి  .. 
ఆ శ్రమ కోర్వలేనివారు 
చక్కగా యే కాశ్మీరుకో ,,కొడై కెనాలుకో వెళ్ళి 
సేద తీరటం మంచిది..
పుట్టపర్తి వారు ఇంకేం చెబుతారో చూద్దాం..

అట్టి వసతి నేర్పరచుకొన్న వెనుక..
నడ్డగోలుగ నెట నుండియో బయలుదేరి..
యెటో తేలుట కన్న
దొలుత న పట్టణ వాతావరణము నతయు నొక విధముగ మనోదర్పణములో ప్రతిబింబించుకొనుట మంచిది..
దాని కత్యనుకూలమగు సధనయొకటి హంపీలో నున్నది..
హంపీ పర్వతమని యిదివరలో జెప్పియుంటిమి..
ఆ పర్వతములన్నిటిలో నత్యుత్తమ్మైనది..
శ్రీ విరూపాక్షస్వామి కెదురుగ నున్నది..
అది మాతంగ పర్వతము..
దాని నెక్కుటకు పడమర యుత్తరమున దక్షిణమున మూడు సోపాన పంక్తులున్నవి..

అన్నిటిలో నతి శిధిలమైనను..

బశ్చిమ సోపానపంక్తియే యనాయాసముగ నెక్కదగినది..

దానిని బట్టి పైకేగినచో శిఖరముపై నొక దేవాలయమున్నది

ఆ యాలయపు డాబాపై కెక్కి నల్గడల జూచినచో
బూర్వ్ పట్టణవరణమంతయు గనులగట్టినట్లు కాన్పించును..

పుట్టపర్తి గైడ్ డ్యూటీ లోకి వెళ్ళిపోయారు

పదండి ..పదండి..
వారితో పాటు  దర్శించి .. 
మంచి అనుభూతులను మన ఖాతాలో వేసుకుందాం..