
బుధ్ధుని కధ ..
మనకందరికీ తెలుసు ..
చిన్నతనం నుంచీ
శోకమూ మరణమూ ఉంటాయని తెలియని
ఒక మనిషి ..
ఒక్కసారి వాటిని చూడగానే
విచలితుడౌతాడు..
వీనిని దాటడమెలాగన్న ప్రశ్న
అతనిని వేధిస్తుంది.
ఒకనాడు
ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు..
ఒక మహాసత్యాన్ని కనుగొనే ఆర్తితో..
అలా మూడుదశాబ్దాల
సుదీర్ఘ అన్వేషణ ఫలితంగా
బోధివృక్షంక్రింద
ఆయనకు జ్ఞానోదయం కలిగింది.
అప్పుడతనిని బుధ్ధుడన్నారు.
తరువాత
సారనాధ్ లోని హరిణవనం లో
తన అయిదుగురు సహచరులకు
తాను పొందిన జ్ఞానాన్ని ఉపదేశి చాడు
చివరికి 80వ ఏట
క్రీస్తు పూర్వం 483లో
కుసీనగర్ అనే ప్రాంతంలో మరణించాడు.
ఈ సంఘటననే బౌద్ధ పరిభాషలో
‘మహా పరినిర్వాణ’గా వ్యవహరిస్తారు.
బుద్ధుని జీవితానికి సంబంధించి
అయిదు ప్రధాన ఘట్టాలను బౌద్ధులు పంచకళ్యాణులుగా భావిస్తారు.
అవి..
1. బుద్ధుడి జననం
2. మహాభినిష్ర్కమణం
3. సంబోధి (బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం)
4. ధర్మచక్ర ప్రవర్తన
5. మహా పరినిర్వాణం
ధర్మానంద కోశాంబిగారు
పాలీ భాషలో రచించిన
బుధ్ధ దేవుని చరితమును
అయ్య తెలుగుకు అనువదించినారు.
ఎడ్విన్ అర్నోల్డ్ మహాశయుడు
లైట్ ఆఫ్ ఏషియా అని వ్రాసారు
అందులో బుధ్ధుని చరిత్ర వర్ణింపబడింది
అందులో
బుధ్ధుని వాస్తవ జీవిత ఘట్టములందు
వాస్తవము కన్న వర్ణన లెక్కువ
దాని ప్రభావము ప్రాక్పశ్చిమ దేశాలలోని
మేధావులపై అమోఘంగా పడింది.
అర్నోల్డ్ కు చెరిగిపోని కీర్తి దక్కింది.
కపిలవస్తు నగరంలోబుధ్ధుని జననం
అది ఇప్పుడు 
భారత నేపాల్ దేశాలు సంధించే చోటులో వుంది. 
ఇప్పటికి 
రెండువేల అయిదు నూర్ల సంవత్సరాల కిందట.. 
శుధ్ధోధన మహారాజుకు 
గౌతమ బుధ్ధుడు జన్మించాడు. 
ఆయన పుట్టటంతోటే తల్లి మరణించింది. 
అప్పుడు శిశువుకు 'సర్వార్థసిధ్ధీ '
అని పేరు పెట్టబడింది. 
సర్వార్థద్సిధ్ధికి వివాహమై 
ఒక కొడుకు పుట్టినా 
ప్రపంచంలో దుఃఖముందని తెలియదు. 
అలా పెంచారన్నమాట ..!!
ఒకనాడు 
తండ్రి అనుమతితో 
నగర సంచారానికి వెళతాడు. 
దీన..దళిత.. రోగగ్రస్థులు ..
ఎవరున్నూ ఆయన కంటపడకుండా 
శుధ్ధోధనుడు జాగ్రత్తగా ఏర్పాటుచేసాడు. 
కానీ ఒక ముసలీ ..
ఒక రోగగ్రస్తుడూ ..
ఒక శవాన్ని మోసుకుపోతున్న శవవాహకులూ ఆయన కంట పడనేపడినారు. 
కాలాంతరంలో నానా నగరాలలో ప్రజలు బాధపడతారనిన్నీ.. 
ముసలితనం వస్తుందనిన్నీ ..
మరణము తప్పదనిన్నీ.. 
సూక్ష్మబుధ్ధి గల సర్వార్థసిధ్ధికి అర్థమయింది. 
ఆయన మనసు కరిగిపోయింది. 
ప్రరంచంలో ఉండే దుఃఖాలకు కారణం ఏమిటి ..?
వాని నివారణోపాయం ఏమిటి ..?
ఇదే చింత పట్టుకుంది. 
 
ఒకానొక రాత్రి ..
భార్యను శిశువునూ విడిచి
 తత్వాన్వేషణలో బయటపడినాడు. 
అప్పుడాయన వయసు 
ఇరవైతొమ్మిది సంవత్సరాలు. 
ఎందరినో ఆశ్రయించినాడు. 
ఎంతో తపస్సు చేసినాడు. 
దేహము ఎముకల గూడయింది. 
అల్లాగా సుమారు మూడు పదుల వర్షములు గడిచినవి. 
ఒకనాడు 
ఒక బోధివృక్షము కింద కూర్చున్నప్పుడు 
హఠాత్తుగా ఆయనకు స్పూర్తి కలిగింది. 
బోధను బడసినదానివలన 
ఆ నాటినుండి అతను బుధ్ధుడైనాడు. 
తాను గ్రహించిన జ్ఞానమును 
ఇతరులకు ఉపదేశిస్తూ దేశయాత్ర సాగించాడు. ముఖ్యంగా ..
మగధ రాజ్జంలో ఆయన సంచారం చేసారు. 
ఇంతకూ ..
బుధ్ధుడు చెప్పేదేమిటి..??
"ఈ జగత్తును సృష్టించినదెవరు..? 
ఆయన ఎలాంటివాడు..?
అన్న ఆలోచనలతో కాలం వ్యర్థం చేసుకోవద్దు ..
ఒక ఇంటికి నిప్పంటుకున్నప్పుడు.. 
దానిని తక్షణం ఆర్పేయాలి..! 
కాని ..
దీనికెవడు నిప్పంటించినాడు..? 
దేనితో అంటించినాడు ..?
ఆ నిప్పు ఎట్లా రాజుకుంది..? 
అన్న విచారము వ్యర్థము..!! 
కాదా ప్రపంచమంతా దుఃఖము వ్యాపించివుంది. 
ఆ దుఃఖ నివారణోపాయము ఆలోచించవలెకాని 
అది ఏవిధముగా ఏర్పడిందని 
ముందు వెనుకలు ఆలోచిస్తూ కూర్చోవడం ప్రయోజనకారి కాదు. 
సర్వదుఃఖాలకు మూల కారణం ఆశ. 
దానిని మూల మట్టముగా తొలగించుకోవలె
 సత్యమూ అహింసా శుచిత్వమూ 
మొదలైన గుణములు అలవాటు చేసుకోవలె . 
శీలము అనర్ఘమైన వస్తువు. 
దానిని అలవాటుచేసుకున్నప్పుడు 
దుఃఖము మన దగ్గరకు రానేరాదు. 
ఈ జగత్తు క్షణికమైనది. 
నశ్వరము. 
కేవల వేదములను అనుసరిస్తూ 
యజ్ఞయాగాదులకై పశుహింస చేయరాదు."
 
స్థూలంగా బుధ్ధుడు చేసిన బోధ ఇదే. 
ప్రపంచంలో ప్రతి పదార్థమూ 
క్షణ క్షణానికీ మారుతూ వుంటుంది. 
నిలకడ అనేది ప్రపంచంలో దేనికిన్నీ లేని అవస్థ
 దీనికి క్షణిక వాదమని పేరు. 
 
బుద్ధుని  కాలములో 
బ్రాహ్మణులు జ్ఞాన తపస్సుని వదలి 
అర్థరహితమైన 
కర్మ నిష్ట యందాసక్తులయి ఉండిరి. 
ఉపనిషత్తులు చెప్పిన
 జ్ఞాన మార్గమును వారు నిరాదరించినారు. యజ్ఞయాగాదులలో చేయబడు హింసను 
బుధ్ధుడు తీవ్రముగా ఖండించెను. 
అతనికి పునర్జన్మ యందు 
తీవ్ర విశ్వాసము కలదు.
శాంతిని బడయుటకు 
ఆశావినాశమొక్కటే మార్గము. 
మానవుడు శీలనిష్టుడు కా వ  లె ను. 
దుఃఖవినాశమునకు సత్యాహింసలే మార్గములు. 
సమస్త దుఃఖములనుండి నివృత్తియే మోక్షము.
 దీనికే నిర్వాణమనిపేరు.
బౌధ్ధులతో జాతి మత వివక్షత లేదు 
అశోకుడు హర్షవర్ధనుడూ 
ఆ బోల నంగీకరించినారు. 
లంక ..చీనా ..జపాన్ ..అఫ్గనిస్తాన్ ..
మొదలైన దేశములలో
 ఆ మతము విస్తారముగా వ్యాపించినది. 
క్రైస్తవమతమునకు 
ఇదియే ప్రేరకమంటారు.
క్రీస్తు తన బాల్యములో
క్రీస్తు తన బాల్యములో
బౌధ్ధ క్షేత్రాలలో నివసించినట్లు 
ఒక వాదముంది. 
ఆ కాలంలో 
బౌధ్ధ మత విజృంభణతో 
బ్రాహ్మణమతము 
దాదాపు లుప్తమయ్యేంత పరిస్తితి  ఏర్పడింది. 
సుమారు పదునొకండవ శతాబ్దము వరకూ 
అది విఛ్చిన్నంగా సాగింది. 
బౌధ్ధం తరువాత
 ' హీనయాన '
 'మహాయాన ము'లుగా చీలింది. 
మాధ్యమికు లున్నూ కొందరున్నారు. 
 
ఆ కాలంలోనే 'మహావీరుడనే ' ఆయన విదేహరాజాంతఃపురంలో జన్మించినాడు. 
ఆ మతములో 
ప్రసిధ్ధులయిన గురువులకు 
'తీర్థంకరులనీ పేరు. 
మహావీరుడు జైనమతము యొక్క 
ఆద్యప్రవర్తకుడు కాదు. 
అతడు ఇరువది నాలుగవ తీర్థంకరుడు. 
ఆయనకు ముందు ప్రసిధ్ధుడైన తీర్థంకరుడు పార్శ్వనాధుడు. 
ఆయన మహావీరుని కన్న 
రెండు శతాబ్దములు ముందటివాడు. 
బౌధ్ధ జైనులు 
వేదాలను ప్రమాణంగా అంగీకరించరు. 
దాదాపు బ్రహ్మ పదార్థమును కూడా అంతే
 స్థూలంగా జైన సిధ్ధాంతము ఈ క్రిందిది... 
 
" జీవుడు నిత్యుడు. 
వాడు కర్మకు లోబడి జ్ఞాన మును మరచి 
పశుడౌతాడు. 
ఆ లోబడడానికే సంసారమని పేరు. 
అహింసా 
సత్యమూ 
అస్తేయము 
బ్రహ్మచర్యము 
అపరిగ్రహము  
వీనికి పంచతంత్రములని పేరు. 
వీని ద్వారా జీవుడు 
కర్మ ధ్వంసమొనర్చుకొనును. 
కర్మ నుంచి తప్ప్పించుకుని 
వివేకమును పొందటమే మోక్షము. 
 
బౌధ్ధానికి దొరికినంత ప్రోత్సాహము
 జైనానికి చిక్కలేదు. 
 అయినా 
బీహారు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ మతము. 
భారత డేశముయొక్క 
పశ్చిమ దక్షిణ దిగ్భాగములను ఆక్రమించింది. 
జైనులలో రెండు శాఖలున్నాయి
జైనులలో రెండు శాఖలున్నాయి
శ్వేతాంబరులు. 
దిగంబరులు. 
దిగంబర జైనులు 
దక్షిణ భారతము 
రాజస్థాన్ యొక్క పూర్వభాగము. 
పంజాబులలో ఉన్నారు. 
శ్వేతాంబరులు 
గుజరాతు పశ్చిమ రాజస్థానము 
మధ్య ప్రదేశములలో విశేషము. 
జైనులు కన్నడములోనూ 
తమిళములోనూ
 సంస్కృతములోనూ
 గొప్ప రచనలు చేసినవారు. 
బౌధ్ధుల గ్రంధములు పాళీ భాషలోనూ 
జైన గ్రంధములు అర్థమాగధిలోనూ 
ఎక్కువగా ఉన్నాయి. 
ప్రాకృత భాషలలో 
జైనులు విశేషంగా కృషి చేసినారు. 
కన్నడములో 
మొదట భారతము వ్రాసిన పంపడు జైనుడే. 
ఆయన రచనా విధానము 
ఔచిత్యమునకు ప్రాణం పోసింది. 
పైశాచీ భాషలో కూడా 
వారి గ్రంధములున్నాయి. 
ఆ ప్రతిభ అమోఘమయినదిగా తోస్తుంది. 
శ్రావణ బెళగొళలో ..
చాముండరాయుడు సిధ్ధిని పొందుటకై 
చంద్ర ద్రో ణ పర్వతములలో నిలిచినాడు. 
ప్రపంచములో అత్యద్భుత సృష్టి అయిన 'గోమఠేశ్వరమూర్తీ స్థాపనకు కారణ భూతుడతడే.
 
ఆ తరువాత ..
వైదిక మతాభిమానులయిన బ్రాహ్మణులు
కనులు తెరిచినారు. 
అవైదికులైన బౌధ్ధ జైనులను 
వారు వాదములలో ఓడించి.. 
తమ మతమును పునః ప్రతిష్టించుకున్నారు..! 
కానీ ..
ఈ దేశమందింకనూ.. 
ప్రసిధ్ధులైన జైనులుండనే ఉన్నారు. 
బౌధ్ధం మాత్రం..
దేశాన్ని విడిచి వలసపోయింది. 
ఆంద్ర సచిత్ర వార పత్రిక
14.7.1982
ఆంద్ర సచిత్ర వార పత్రిక
14.7.1982
