25 నవం, 2012

బెజవాడ గోపాలరెడ్డి


                           బెజవాడ గోపాలరెడ్డి




బహుభాషావేత్తగ
 వివిధ సాహిత్య ప్రక్రియల్లో
మహా రచయితగా
లబ్ధ ప్రతిష్టులైన నారాయణాచార్యులవారి వ్యక్తిత్వం విశిష్టమైనది
 విలక్షణమైనది.
అనితర పూర్వములు
అనుపమానములు
అనిర్వచనీయములైన
బహు గ్రంధ కర్తలుగా
సారస్వత సేవ గావించి
ఆంధ్రుల సారస్వత వాఙ్మయ ప్రతిష్టను
దిగంతములకు పరివ్యాప్తమొనరించిన
పరమ ప్రామాణికులైన పండిత శ్రేష్ఠులు పుట్టపర్తి వారు..
సాహిత్యమందేగాక
సంగీత నృత్య నాట్యాది వివిధ కళలందును సిధ్ధ హస్తులు..
అతి బాల్యమునందే
మహాకవిగ పలువురు సాహితీ వేత్తల ప్రశంసలు
అమితముగ చూరగొన్న అశేషశేముషీ దురంధరులు
శ్రీ నారాయణాచార్యులవారు..

బెజవాడ గోపాలరెడ్డి.

గుర్రం  జాషువా


ప్రివ్యూ

శివతాండవమాడెడు 
మీ కవితా శాంభవికి 
నెదురుగా నిల్వరు,
దుష్కవులెవ్వరు,
రాయలోర్వి ప్రవిమల మణిదీప!
పుట్టపర్తి కవీంద్ర..  

-గుర్రం  జాషువా