15 మార్చి, 2016

కృ ష్ణ గీతం

అది తుంగభద్రా తీరం..
అందులోకి స్నానమాచరించడానికి వెళుతున్నారు పరమాచార్య.
పుట్టపర్తి తో విశేషమైన అనుబంధం..
ఆత్మీయతా 
అక్కడికి వల వల ఏడుస్తూ వచ్చిందో స్త్రీ..
స్వామి వారి పాదాలపై పడింది
స్వమీ చెప్పండి
మా అమ్మ కెందుకిలా జరిగింది..
తుంగభద్రానదిలో నీళ్ళు మౌనంగా కదిలాయి

స్వామి యేమీ మాట్లాడలేదు
మౌనంగా తలేత్తి ఆకాశంవంక చూస్తూ
రెండుచేతులూ చూపించారు
మా అమ్మ కాన్సర్ తో భయంకరంగా చనిపోయిన రోజులు అవి..

శరణాగతి అంటే ఏమిటి
గజేంద్ర మోక్షం లో ఏనుగు మొసలితో పోరాడి పోరాడీలసిపోయి
ఎలా రక్షింపబడటం అనుకుని
ఇటువంటివాడైతే తనని కాపాడగలడని

ఎవ్వనిచే జనించు.. జగమెవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వనియందు డిందు .. పరమేశ్వరుడెవ్వడనాది మధ్య లయుడెవ్వడు
సర్వముదానెయైన వాడెవ్వడువాని నాత్మభవు.. నీశ్వరు
నే శరణంబు వేడెదన్..
అని ప్రార్థించింది

ఈ మొసలి నుంచీ కాపాడు అనికదా దాని ఆంతర్యం..
కానీ దానికి లభించింది కరినుంచీ ప్రాణాలుకాదు
ఏశ్వరునిలో లీనమైపోవడం

ఆయనలో ఐక్యమైతే ఎలా వుంటుందో దానికి తెలియదు
బతికితే హాయిగా మళ్ళీ తన భార్యలతో అడవిలో
శృంగారంలో మునిగిపోతుంది

పరమాత్మ దానినెందుకు అనుగ్రహించాడు
పూజలలో మునిగిపోయి కొందరు
లౌకికంలో మునిగిపోయి ఇంకొందరు
ఉన్నారే
వారినెవరినైనా ఉధ్ధరించవచ్చుకదా..
ఇలా పిలిస్తే నాకు వినబడుతుంది అని
ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ కావచ్చు

చావు తప్పదని తెలిసిన క్షణంలో
అంతవరకు తాను బ్రదికిన బ్రతుకు గుర్తుకురాదు..
సంభవిమ్హబోయే మరణం ఎంత భయానకమో
తరువాత తానేగతినొందుతాడో..
అన్నదే మనసు నావహిస్తుంది

వెనకనిలబడిన బంధు సమూహంకోసం
తన విలువైన సమయం ఎలా వృధా చేసుకొన్నదీతలచి విచారించటం తప్ప చేయగలిగిందేమీ లేదు..'

వామనుడై వచ్చి
పరమ భక్తుడైన బలి నుంచీ కేవలం మూడడుగులు కోరి
ఎవ్వని గరుణింప నిశ్చయించితిని.. వాని యఖిల విత్తంబునే నపహరింతు
వింధ్యావళికిచ్చిన సమాధానం
అంటే రాటు దేలుస్తాడన్నమాట..

పాల సముద్రంలో పడుకుంటాడంటారు..
తానున్నచోట పాలు వెల్లువలా వుండేటట్లు కృప చేస్తాడంటారు..
ఆవుల పాలు పితికాడంటారు.. 
పాలు వెన్న నెయ్యి దొంగిలించాడంటారు
ఇన్ని పాలు నైవేద్యం పెడితే పొంగిపోతాడంటారు
అటువంటివాడి కథ చెప్పినవాడికీ
విన్నవాడికీపాదములు పట్టినవాడికీ
తల్లిపాలు దొరక్కుండా చేశాడని లీలాశుకుడన్నాడు
అంటే
ఇక తల్లిపాలు తాగ నవసరంలేదనీ

ఇక పుట్టడనీ అర్థం..