1 ఆగ, 2015

'టుంఠణ '

thotakura plant కోసం చిత్ర ఫలితం



నా చిన్ననాటి ముచ్చట..
ఎలాగు నేను ముద్దుల మూటని..
అబ్బ ఆమాట అనుకుంటే ఎంత పులకింతో..
పుట్టపర్తి నారాయణా చార్యులు

 కనకమ్మల ముద్దు ల మూటవ్వలంటే సామాన్యమా..చెప్పండి..
 

ఆ విషయానికి వస్తా..
మా ఇంటికి ఎవరు మొదటి సారి వచ్చినా 

పర్మనెంట్ అయిపోతారు..
మా అయ్య పేరు ప్రతిష్టా.. మా ఇంటికి వచ్చే పెద్ద పెద్ద వ్యక్తులూ..
ఎప్పుడూ సభలూ.. సన్మానాలు..
భాగవత పురాణం..
ఇల్లు ఎప్పుడు భక్తులు శిష్యులు.. ఇరుగు పొరుగు వారితో కిట కిట లాడుతూ వుండేది..
ఇంకో పక్క మా అమ్మ పూజలు పట్టాభిషేకాలు కీర్తనలు..
మా అయ్యను అమ్మ అనుసరించే విధానమూ..
అన్నీ కలగలిపి.
అది అరాధనో .. ఆవేశమో.. భక్తో.. వారికే తెలియదు..


మూల మూలకూ అలా కూచుని వుండేవాళ్ళు..
మంటల్లో దూకమని అదేశించినా 

సిధ్ధంగా వుండేవాళ్ళు పుట్టపర్తి శిష్యులు 
అని ప్రొద్దుటూరు సుబ్బయ్య గారు రాసారు కదా..
అలానే..


అప్పుడు విమలమ్మ అని ఒక ఫామిలీ.. 

మా ఇంటికి కొద్ది దూరంలో.

ఆమె కూ భక్తి 

వాళ్ళ  కొడుకు .. అప్పట్లో మానసిక పూజ యేమిటో చెప్పమని..
సందేహాలు అడుగు తుండేవాడు..
 

ఆ విమలమ్మ కన్నడ ఆమె..
ఆమె 'టుంఠణ' అని ఒక వంటకం చేసేది..
పేరు చిత్రంగా వుంది కదూ..
అయ్య అమ్మకు చెబితే 

అమ్మ ఆ వంట ఒకటి రెండు సార్లు చేసింది..
'టుంఠణ 'అని ఇంట్లో అందరూ నవ్వుకున్నాం..
 

ఆ టుంఠణ చేసే విధానం ఎట్టిదనిన
తోట కూర సన్నగా తరిగి 

రెండు పచ్చిమిరపకాయలతో తిరగవాత వేసి
మూత పెట్టవలెను..
పది నిమిషములలో కూర సిధ్ధం..
చల్లారిన తరువాత.. 

చిక్కటి మజ్జిగలో కలిపేయాలి అంతే..
మేం ఉల్లిపాయ వెల్లుల్లి తినం..
కావలసిన వాళ్ళు చేర్చుకోవచ్చు..
Face bookలో అందరూ వంటకాల కోసం ప్రత్యేకంగా రాస్తున్నారుకదా..
అందుకే సరదాగా..

 ఉప్పు వేసుకోవటం  మర్చిపోయ్యేరు ..