ఈ రోజు మా అయ్య వెళ్ళి పోయిన దినం..
సమయం రాత్రి మూడు ..
మంచం చుట్టూ శిష్యులు ..
దశమ స్కంధం పుట్టపర్తి నోట పొంగింది
మరణ వేదమై ..
......
....
అదే రోజు ..
ఏకాదశి పుణ్య తిథి ..
తెల్లవారి ..
గబ గబా స్నానం చేసి..
కలశం పెట్టి సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టాను ..
జీవితంలో సత్యనారాయణ వ్రతం వదలద్దు..
అమ్మ మాటలు..
అయ్యా నాకేమైనా చెప్పు..
నీకేం చెప్పేది..
సత్యనారాయణ వ్రతాలు వదలకుండా చేసుకో..
ఒక టెంకాయ ..
గ్లాసులో నీళ్ళు..
రెండు దీపాలు..
అంతే..
ఏమీలేకపోతే..నీళ్ళైనా నైవేద్యం పెట్టు ..అమ్మ
మనసంతా బాధగా వుంది..
కళ్ళు వర్షిస్తున్నాయి..
విగ్రహం పైఅరచేతిని వుంచి ..
స్వామీ..సర్వ జగన్నాథా..
పూజ ముగిసే వరకు ప్రీతిభావనతో వుండవయ్యా..
ప్రాణప్రతిష్ఠ..
.......
......
హాస్పిటల్లో..
అందరూ మగత కౌగిట్లో జోగుతున్నవేళ..
ఒక గురువు..
తన ఆఖరి ప్రయాణానికి సామాను సర్దుకుంటున్నాడు..
లోతైనకళ్ళు..
వణుకుతున్న గొంతుక..
కృష్ణ తత్వాన్ని ప్రవహింపజేస్తోంది ..
వినిపించని వేణువు శ్రద్ధగా వింటున్న
ఆ శిష్యుల గుండెల్లో మోగుతోంది...
బ్రతికిఉన్నంతకాలం ..
ఒక దివ్య తేజస్సు ఆ శరీరంలో వుంది కాబట్టి
ఆ అవయవాలు ఇప్పటికీ
ఆ తేజస్సును వ్యక్తం చేస్తున్నాయ్..
శరీరం భగవంతుడు కాదు..
కృష్ణుడనగానే నెమలి పింఛం వేణువు..
ఇవి కాదు,,
కృష్ణుడు ఆత్మ స్వరూపుడు..
కృష్ణుడంటే ఆత్మ స్పృహ
ఆత్మ భక్తి..
హఠాత్తుగా ఆయన శ్రీనివాసా..
అంటూ గుండె పట్టుకుని వొరిగి పోయాడు..
శిష్యులు
అయ్యా..
స్వామీ..
గొల్లుమన్నారు..
అక్కడ నిర్యాణం ..
ఇక్కడ ప్రాణ ప్రతిష్ట ..
దేవునిలో లీన మవడమంటే ఇదేనా.. ??