10 జులై, 2012

పుట్టపర్తి వారి వ్యక్తిత్వం



                      
                          పుట్టపర్తి వారి వ్యక్తిత్వం
 

12.3.89 ఆంధ్రజ్యోతిలో వచ్చిన 
పుట్టపర్తి వారి అభిప్రాయాలతో 
నేను నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తున్నాను. 
ఆయన నిజాయితీ గల కవి. 
అపారమైన పాండిత్యాన్ని 
పాలల్లో పంచదారవలె 
కవిత్వంలో లీనం చేసుకొన్న మహావ్యక్తి ..
ఆయన వ్యక్తిత్వానికి ..
ఈ క్రింది సన్నివేశం ఉదాహరణ.
నాలుగు దశాబ్దాలనాటిమాట. 
నేను అధ్యక్షత వహించిన ఒక సభలో 
వారు ప్రసంగించారు. 

ఆ సభ 
సా హిత్య మండలి కాస్మో పాలిటన్ క్లబ్ 
కలిసి ఏర్పాటు చేసిన సభ 
అప్పుడు ఆ రెండు సంస్థలకూ 
నేను అధ్యక్షునిగా వున్నాను. 
నా ఇరుప్రక్కల 
నండూరి సుబ్బారావు గారు ..పుట్టపర్తి వారు..
 ఆసీ నులై వున్నారు. 
పుట్టపర్తి వారు ఆవేశంతో మాట్లాడుతూ
 "ఈ రోజుల్లో 
నాలుగు గేయాలు రాసిన ప్రతివాడూ 
కవిగా చెలామణీ అవుతున్నాడు " 
అన్నారు. 
కాని 
అది సుబ్బారావు గారిని ఉద్దేశించి 
అన్నమాట కాదు. 
ఆయనన్నా ..
యెంకి పాటలన్నా..
వారికి చాలా గౌరవం. 

అయితే ..
ఆ మాట సుబ్బారావు గారికి గుచ్చుకుంది .
ఆయన ముఖం ఎర్రబడిపోయింది. 
ఆయన కోపోద్రిక్తులైనారు. 
అవును..
నేను ఏవో నాలుగు గేయాలు వ్రాసిన
 పనికిమాలిన వాణ్ణి 
అన్నారు తరువాత మాట్లాడుతూ. 
పుట్టపర్తి వారు చాలా నొచ్చుకున్నారు. 
అధ్యక్షుని తుది పలుకుల్లో 
ఎలాగో సర్దుబాటు చేసాను 
తాత్కాలికంగా..
 మరునాటి ఉదయం..
పుట్టపర్తి వారు మా ఇంటికి వచ్చారు 
కంభమ్మెట్టు వారితో కలిసి 
"నన్ను నండూరి సుబ్బారావు గారి ఇంటికి తీసుకెళ్ళండి "అన్నారు 
తీసుకెళ్ళాను. 

ఆ దృశ్యం 
ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్టు వుంటుంది. 
వారు ఎంతో వినమృలై శిరస్సు వంచి 
నండూరి వారికి నమస్కరించి 
తికరణ శుధ్ధిగా క్షమాపణ కోరుకున్నారు. 
చాలా సేపటికి వారి కోపం శమించి 
ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. 
మా కళ్ళలో ఆనంద భాష్పాలు నిండాయి. 
ఎం  కి పాటలను ఎంతగానో ప్రశంసించి ..
ఒకటి రెండు పాటలు పాడి వినిపించారు.
 
పుట్టపర్తి వారి సిన్సెరిటీకి.. 
హ్యుమిలిటీకి..
 ఇంతకన్న ఏమి ఉదాహరణ కావాలి..?
విద్యా వినయ సంపన్నే 
అన్న గీతా వాక్యం నాకు జ్ఞాపకం చేసింది. 
చేదుగా ప్రారంభమై ..
తీయగా ముగిసిన ..
రసవంతమైన ఆ సన్నివేశం.
 
డాక్టర్ శంకర శ్రీరామారావు ,ఏలూరు.
20.3.89 ఆంధ్రజ్యోతి దినపత్రిక