సాధారణముగా విమర్శకులు పూర్వకవులను 'ధారాశుధ్ధిగలవారని..'
యొకటే గాటిలో గట్టివేయుట కద్దు
కాని ..
వారు వారు సాధించిన ధారాశుధ్ధులలో దేడాలున్నవి
నన్నయ్యగారిది శ్రోత్రపేయమైన ధార..
'దీని తెర గిట్టిదీ' యని నిర్ధారింపరాని సంగీతము..
తిక్కన్నది ఎండాకాలపు వాగు..
నిలిచి.. నిలిచి .. ప్రవహించును..
శ్రీనాధునిది నాద శుధ్ధిపై ప్రత్యేక దృష్టిలేని
వర్షాకాలపు ప్రవాహపు హోరు...
పెద్దన్న గారిది
వీణానిక్వాణములు ఆనుషంగికముగా వెంట రాసాగిన ధార..
రాయలు .. రామకృష్ణుడు
వీరిర్వురిది.. డొంకతిరుగుడు ధార..
ప్రవాహములో నెక్కడ సుడులున్నవో .. తెలియదు..
తలలెత్తిన గుండ్లెక్కడున్నవో యెరుగలేము..
నారదుని మహతినే..
కనకాద్రి కూట గర్జత్కాళికతో బోల్చిన రసికుడు వాడు..
రామరాజ భూషణుడు సాధించినది ..
మాధురీధుర్యమైన తానా మృతముల ధా ర ..
సంగీతములో జెవిగలిగిన సాహిత్యకారుల కీవింగడింపులంత కష్టసాధ్యముగాదు..
'వరాహపురాణము ' పరిచయము నుంచీ..