
ఈ ''మహరాష్ట్ర వాఙ్మయ ప్రభావము''లో
ఎన్నెన్ని విషయాలో..
ప్రాకృత భాషాభేదములలో మహరాష్ట్రి ఒకటి..
నేటి మరాఠీ కి
ఆ మహరాష్ట్రి ప్రాకృతమే మూలభాష..
హాల చక్రవర్తి ప్రాకృత గాధలను సేకరించి
వానికొక రూపమిచ్చాడు..
అంతే గాదు ..
తాను కూడా స్వయంగా కొన్ని గాధలను వ్రాసాడు
ఆంధ్రుడైన హాలుడు
నేటి మరాఠీకి మూలభాషయైన
మహరాష్ట్రి యనబడే
ప్రాకృత భాషా భేద రూప భాషలో రచనలు చేసాడు
ఈ విధముగా
మరాఠీ భాషకు పురుడు తీర్చిన ఘనత
మన తెలుగు వారిదేనట..
కొంతలో కొంత..
పాండురంగడక్కడ చాలా ప్రభ గలిగిన దేవుడు..
విద్యానగర ప్రభువైన కృష్ణదేవరాయని
ఆ పాండురంగడు ఆకట్టుకొనెనట.
విఠలాలయమునకు పునాది వేయుటే
ఇందుకు సాక్ష్యమట..
కృష్ణదేవరాయనికి పాండురంగనిపై కన్నుపడుటకు
ఆనాటి ద్వైత భక్తులు కారణమట..
విద్యానగరమునకున్న ఈ అభిమానము ''పాండురంగమహాత్యమై''నదట..
పుట్టపర్తి గద్య రచనా శైలి..
చమత్కారాలు..
విరుపులూ..
వ్యంగ్యాలు..
చారిత్రకునిగా పుట్టపర్తికి ఎందుకు పెద్దపీటవేస్తారో అర్థమైంది..
ఒక తపస్సంపన్నుని దృష్టితో కూడ చరిత్రను చూచి
సమర్థ రామదాస స్వామి వంటి వారిని గురించి చెబుతూ..
'తనకు తగిన రాజు ఎవ్వడని ..?'
కాశి నుంచీ కన్యాకుమారి వరకూ చుట్టినాడట
''అప్పటికి విజయనగర వంశస్తుడైన
అళియరామరాయలు బ్రతికి వుండినా
వారికి ఈ రామరాయలపై ఎందుకు చూపు పడలేదో
బహుశః
ఆతపస్వి దృష్టికి విద్యానగరము కాలసర్ప దష్టమైపోవునని ముందే తోచెనేమో చెప్పలేము ''
అంటారు పుట్టపర్తి
మీరూ చదవండి..
ఇందులో ఏకవీరా దేవి ప్రస్తావన వుంది..
ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని
ధులియా పట్టణం సమీపంలోని
పంజహర్ నదీ తీరంలో వెలసివుంది.
ఈ దేవత కేవలం మహారాష్ట్ర వాసులకే కాకుండా
మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తుల మనస్సుల్లో కొలువైవుంది.
![]() |
ఏకవీరా దేవి |
ఆదిశక్తి ఏకవీర దేవి పరశురాముని తల్లిగా అందరికి సుపరిచితం.
ఏకవీర, రేణుకా దేవిలు ప్రతిరూపమే ఆదిమాయ పార్వతీ దేవి.
ఆమె అనేక దయ్యాలను సంహరించినట్టు పురాణాలు చెపుతున్నాయి.
పౌరుషానికి ప్రతిరూపంగా పేరొందిన పరశురాముని తల్లిగాను,
జమదగ్ని భార్య అని పురాణాలు చెపుతున్నాయి.
రేణుకాదేవికి మరో పేరే ఏకవీరా దేవి.

