30 నవం, 2012

అరుణాచలం





ఒకసారి  పుట్టపర్తి వారు RVR వల్లంపాటి తదితరులు

అరుణాచలం వెళ్ళారు
అక్కడ ప్రఖ్యాత చలం గారు అప్పటికే స్థిర నివాసం ఏర్పరచుకొని వున్నారు.
వారి కి  ఆచార్యుల వారు
జనప్రియ రామాయణం వినిపించారు
పుట్టపర్తి వారితో కలిసి..
చాలా ప్రయాణాలు చేశాను.
వారూ, నేనూ కలిసి రమణాశ్రమం వెళ్ళాం.
చలం గారిని చూశాం.
ఆ కలయిక
ఇద్దరికీ నచ్చలేదని నా అనుమానం.
“జనప్రియ రామాయణం” లోని
రామజనన ఘట్టాన్ని వారు
చలం గారికి చదివి వినిపించారు.
ఇక్కడ ఒక్కమాట..
రామ జనన ఘట్టం అత్యద్భుతంగా వుంటుంది..
కానీ..
“ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు”
అన్నారు చలం గారు.
“ఏం చేద్దాం ఎవడి స్థాయి వాడిది”
అన్నారు పుట్టపర్తి వారు.
 అంటూ తన అనుభవాన్ని చెప్పుకున్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు.

ఆనాటి వారి అనుభవాన్ని RVR గారి నోట విందాం

1981 లో మాస్కో రాదుగ ప్రచురణాలయంలో అనుదాదకునిగా చేరి 
1991లో జూన్ దాకా పదేళ్ళు పనిచేసారు. 
మాస్కూ రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. 
400 లకు పైగా సోవియట్ 
డాక్యుమెంటరీ ఫిల్మ్ లకి వాయిస్ ఇచ్చారు