9 నవం, 2014

వినోద పరిశ్రమలు





కేవలం ఒత్తిడి నుంచీ దూరం చేసేవి కాదు
ఒక్కోప్పుడు జీవితాన్ని వెలిగించేవి హాబీలు
చేసే వుద్యోగం నుంచీ కాక తమ హాబీలవలన పేరు ప్రఖ్యాతులనందిన వ్యక్తులున్నారు..
ప్రముఖులైన వారు కూడా
తమ సంతోషాన్నీ విషాదాన్నీ హాబీలతో పంచుకుంటారు


మంచు విష్ణు అనే సినీ నటుడికి 

రక రకాల చాకులు సేకరించడం హాబీ అట
ఒకసారి విదేశంలోని ఏర్పోర్టులో చెకింగ్ వారు అనుమానించి అతన్ని రక రకాలుగా ప్రశ్నించారు
అవి మారణాయుధాల కిందకి వస్తాయి

సంజాయిషీ ఇచ్చుకొని బయటపడేసరికి 
తల ప్రాణం తోకకు వచ్చిందట..
ఇలాంటివి విన్నప్పుడు 

ఎటు పోతోంది యువత అనిపిస్తుంది..

నాలుగు రోజులు సెలవులు వచ్చాయంటే చాలు! మనసును దోచే సుందర ప్రదేశాలనో, 
అద్భుత కట్టడాలనో, 
పురాతన భవనాలనో చూడాలనుకోవడం సహజం.

అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు
మరీ ఇంత తరచుగా కాకపోయినా 
కనీసం ఏడాదికో మారు పర్యటనకు 
ప్రణాళిక సిద్ధం చేసుకునేవారూ వుంటారు. 

వీరంతా సంతోషాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని 
అందించే ప్రదేశాలను చూడ్డానికే 
నూటికి నూరు శాతం ప్రాధాన్యతనిస్తారు. 

అయితే ఇంగ్లండ్‌కు చెందిన మెకాబ్రె మార్క్‌... 
వీరికి పూర్తి భిన్నమైన అభిరుచిగలవాడు. 

సాధారణ మానవులు 
జీవితంలో కనీసం ఒక్కసారి కూడా 
కాలు మోపడానికి... 
సందర్శించడానికి ఇష్టపడని 
శ్మశానాలను, సమాధులను 
సందర్శించడమంటే అతగాడికి 
అంతులేని ఆసక్తి.

చరిత్రలో పేర్గాంచిన వారి సమాధులను చూడడం ద్వారా నేను జ్ఞానం సంపాదిస్తున్నాను. 
నా దృష్టిలో ...
ఒక్కో సమాధి ఒక్కో మ్యూజియం లాంటిది. 

అది ప్రముఖుల గురించిన 
విలువైన, అరుదైన సమాచారాన్ని 
మనకు అందిస్తుంటుంది. 
ఈ పద్ధతిలో నన్ను నేను చైతన్యవంతుణ్ణి చేసుకుంటుంటాను.'' అంటాడు మార్క్‌
లోకో భిన్న రుచిః

ఇక్కడ పుట్టపర్తి వారు వినోద పరిశ్రమలు 
అనే వ్యాసం వ్రాసారు పిల్లలకోసం
అందులో వారు చెప్పిన విషయాలు పిల్లలకు మాత్రమే కాదు 
పెద్దలకూఎంతో ఆసక్తి దాయకం

విన్ స్టల్ చర్చిల్ చిత్రలేఖనం సాధన  చేసాడట 

కొక్కిరి గీతలుగా ఆరంభమైన అతని సాధన చిక్కనై ప్రకృతిని ప్రేమించేంత వరకూ వెళ్ళింది

 అంత పట్టుదల కలవాడు కనుకే 

రెండో ప్రపంచ యుధ్ధ కాలంలో 

సాధించేదాకా సాధన మానకండి 

ప్రయత్నం వదలకండి

 సైనికులను ఉత్తేజితులను చేసేవాడట..


ఆయనే కాదు యే గొప్ప వాడైనా అలానే చేస్తాడు

అలా ప్రయత్నించాడు కాబట్టే 

గొప్పవాడయ్యాడు

మొదట్లో తను గీసిన ఒంకర టింకర గీతలను చూసి 

యెవరైనా నవ్వితే చలించివుంటే 

అతని సాధన ముందుకు సాగేదా...


రాయలకు చదరంగమాడటం సరదా..

బొడ్డు చెర్ల తిమ్మన అతని సమ ఉజ్జీ..

తిమ్మన అంటే రాయలకు అమిత అభిమానం..

అతనికొక అగ్రహారమే ఇచ్చేశాడట రాయలు
అంతేకదా రాజులు తలుచుకుంటే దెబ్బలకు సారీ అగ్రహారాలకు కొదువా..

పుట్టపర్తి వ్యాసాలలో వారి జీవితానుభవాలు
వ్యక్తులు అప్పుడప్పుడూ దర్శనమిస్తారు.
తిరుమల కొండపై దశావతారాలను ముగ్గులు తీర్చే స్త్రీ మొదలు..
జ్యోతిషం తో ఖండాంతర ఖ్యాతి పొందిన 
తహశీల్దారు వరకూ ఎందరో ..
సంగీతం  గాత్రం సాధించలేక పోయానే
అన్న బాధతో
పక్క వాయిద్యాలపై చేయి వేశాను

ఫి డేలు కొంత గోకి వదిలాను ..
వీణ సాధనమూ చేసాను ..
మృదంగం కొట్టినాను..
అడపా దడపా ..
మేళం పీక కూడా నోట్లో పెట్టుకున్నట్లు జ్ఞాపకం
ఏమైతే యేం..
వచ్చే జన్మలో నైనా
మంచి సంగీతజ్ఞుడు కావలెనని నా ఆశ..

నేను ఊరికే ఉండే సమయం అంటూ ఎప్పుడూ వుండదు..
ఎప్పుడూ పరిశ్రమే నా ఊపిరి..
ఇవన్నీ ఎవరికీ చెప్పాలి..??
చెపితే వింటాడా .. ??
అన్న ప్రశ్నలు నాకు పట్టవు..
నేను తెలుసుకొవలె..
నా జీవ సంస్కారం అభివృధ్ధి కావలె అన్నదే నా ఆశ..
అంటారు తన గురించి పుట్టపర్తి..



నిశ్శబ్ద దృశ్యం