21 అక్టో, 2013

సరస్వతీపుత్రుని సాహితీ వ్యక్తిత్వం..http://www.andhrabhoomi.net/node/111552

 

 

శశిశ్రీ వ్రాసిన పుట్టపర్తి మోనోగ్రఫీ పుట్టపర్తి నారయణాచార్య ను కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించింది
దానిపై ద్వానాశాస్త్రి  గారి సమీక్ష ఇది
ఆంధ్ర భూమి . నెట్ లో లభించింది

శశిశ్రీ ఆయన పద్దెనిమిది ఏళ్ళప్పటినుంచీ కాబోలు మా ఇంటికి వచ్చేవాడు
జర్నలిస్ట్ గా కొత్తగా చేరాడు జానుమద్ది హనుమచ్చాస్త్రి వైసీవీ రెడ్డి కేతు విశ్వనాధ రెడ్డి రా.రా. ఎంతో మంది మా ఇంటికి తరుచూ వచ్చేవారు
వారితోపాటూ శశిశ్రీ కూడా
షేక్ హుస్సేన్ కలం పేరు సత్యాగ్ని. నాటకాలలో వేసేవాడట.మా అయ్య పద్యాలు ఎంత అద్భుతంగా పాడతాడంటే. రాజన్న గుర్తొస్తాడు. వై యస్ రాజశేఖర రెడ్డి  తండ్రి రాజారెడ్డి కి పుట్టపర్తి అంటే అమిత గౌరవం
అలాగే వై యస్ కు కూడా
శివతాండవం చక్కగా పాడి రాజశేఖరరెడ్డిని మెప్పించి షేక్ హుస్సేన్ సాహిత్యకారునిగా ఎం ఎల్సీ స్థానాన్ని పొందాడు
పుట్టపర్తి ఒక వటవృక్షం.
దాని ధీరత్వం  సామాన్యం కాదు
ఎప్పుడూ పుట్టపర్తిపై వ్యాసాలు వ్రాయడనికి అందరూ ఉత్సాహం చూపేవారు
దాదాపు అన్ని పత్రికలలోనూ పుట్టపర్తి పై వ్యాసాలు వచ్చేవి
తరుచూ సంభాషణలలో పుట్టపర్తి చెప్పే అనేక విషయాలే యీ మోనోగ్రాఫ్ గా తయారైంది
యువభారతి అధ్వర్యంలో ఆముక్తమాల్యదపై పుట్టపర్తి చేసిన మహోపన్యాసం వినే అదృష్టం ఈ ఉపన్యాసకునికి కలిగింది అని ద్వా.నా.శాస్త్రి గారు   చెప్పుకున్నారు.

  ఇందులో దొర్లిన తప్పులు కుటుంబసభ్యులు చెప్పినా వినిపించుకోనేవారు లేరు
ఆకాశవాణి కోసం యేడువేల కృతులు రాసారట
ఇంటర్మీడియట్ కు పుట్టపర్తి తను వ్రాసిన కావ్యాన్ని తానే పాఠ్యగ్రంధంగా చదివారట
జిల్లెళ్ళమూడి అమ్మ ఇల్లు కొని రిజిష్టర్ చేసిపుట్టపర్తికి ఇచ్చిందట..
ఇంకా యెన్నో..
అవాస్తవాలు

ఇది ఇంక దాదాపు అన్ని భారతీయ భాషలలోనికీ అనువాదమౌతుంది

 

సరస్వతీపుత్రుని సాహితీ వ్యక్తిత్వం..

  • -ద్వా.నా.శాస్ర్తీ
  • 12/10/2013
పుట్టపర్తి నారాయణాచార్య,
(మోనోగ్రాఫ్),
రచయిత: శశిశ్రీ,
వెల: రు.50/-
ప్రతులకు:
కేంద్ర సాహిత్య అకాడమీ,
ఫిరోజ్‌షా రోడ్,
న్యూఢిల్లీ- 110 001

కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న ప్రచురణ కార్యక్రమాలలో ‘‘్భరతీయ సాహిత్య నిర్మాతలు’’ శీర్షిక బహుదా ప్రశంసనీయం. జాతీయతా భావాన్ని పెంపొందించే మంచి పని ఇది. ఆ పరంపరలో శత జయంతి సంవత్సరం సందర్భంగా వెలువడిన మంచి పుస్తకం ‘‘పుట్టపర్తి నారాయణాచార్య’’. దీనిని రచించినవారు శశిశ్రీ. ఈయన మంచి కవి, విశే్లషకుడు. కొంతకాలం సాహిత్య పత్రిక నడిపి చేతులు కాల్చుకున్నవాడు. అయినా అక్షరార్చనను వదలనివాడు. అంతేకాదు పుట్టపర్తివారివద్ద శిష్యరికం చేసినవాడు. కాబట్టి ఈ పుస్తకం రాయడానికి అర్హుడు!
ఆధునిక పద్య, గేయకావ్యాల కవిగా పుట్టపర్తి వారిది అగ్రస్థానం. తను రాసిన పద్యభాగాన్ని తానే పాఠ్యాంశంగా చదివిన సన్నివేశం తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే అపూర్వం. భక్తిసాధనలో సన్యాసిగా మారి ప్రాణత్యాగానికి వెళ్ళిన పుట్టపర్తివారు సరస్వతీపుత్రులుగా ఎలా తిరిగి వచ్చారో తెలిపే సన్నివేశం... ఇటువంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పుట్టపర్తి నారాయణాచార్యులు అనగానే చాలామందికి గుర్తుకువచ్చేది ఆయన రాసిన అద్భుత గేయ కావ్యం, ‘‘శివతాండవం’. సంగీత, సాహిత్య, నాట్యశాస్త్రాల సమ్మేళనమది. పుట్టపర్తివారి నోట శివతాండవం వినటం ఒక అదృష్టంగా భావించేవారు. హిమాలయాల నుండి తిరిగివచ్చిన పిమ్మట ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరస్వామిని దర్శించుకొని తరించి రాసిన కావ్యమిది.
‘‘ఆడెనమ్మా శివుడు
పాడెనమ్మా భవుడు’’
అంటూ సాగే ఈ కావ్యం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
‘‘నేను సుమారు నూటికిపైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యమూ పద్యమూ రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరూ శివతాండవ్ గ్రంథమూ పెనవేసుకుని పోయినవి’’ అన్నారు నారాయణాచార్యులు. నిజమే ఒక్కొక్క కవికి ఒక మహారచన గొప్ప ప్రఖ్యాతిని తీసుకువస్తుంది. శ్రీశ్రీ ఎన్నిరాసినా ‘మహాప్రస్థానం’ గుర్తుకువస్తుంది. శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ శతాధికంగా రాసినా ‘‘బొబ్బిలియుద్ధమే’’ చెప్పుకోవాలి. పుట్టపర్తివారు జనప్రియ రామాయణం, పండరి భాగవతం, మేఘసందేశం (అనువాద గేయకావ్యం), పెనుగొండ లక్ష్మి వంటివి ఎనె్నన్నో రాశారు. మహాభారతంపై విమర్శ గ్రంథాలు రాశారు. 1971లో హైదరాబాద్‌లో యువభారతివారి ఉపన్యాస లహరిలో రాయలవారి ఆముక్తమాల్యదపై వారుచేసిన మహోపన్యాసం ఈ సమీక్షకుడికి వినే అదృష్టం లభించింది.
వనంలో ఉండగా నారాయణాచార్యులవారు ‘‘లీవ్స్ ఇన్ ది విండ్’’ అనే ఆంగ్లకావ్యం రాశారు. దీనిని సుస్రిద్ధకవి హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ మెచ్చుకోవడం గమనార్హం. బూర్గుల రామకృష్ణారావుగార్కి ఈ అయ్యవార్లంటే మక్కువ ఎక్కువ. ఎవరైనా సరే పుట్టపర్తివారి ప్రతిభకు దాసోహం అనవల్సిందే. మలయాళంనుంచి తెలుగులోకి అనువాదాలు చేశారు. విశ్వనాథవారి ‘‘ఏకవీర’’ నవలను మలయాళంలోకి అనువదించారు. ఇది కేరళ విశ్వవిద్యాలయం పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. ఇలా తెలుగువెలుగును ఇతర భాషీయులకి అందించిన మహనీయులు పుట్టపర్తివారు. 75వ ఏట ఉర్దూ నేర్చుకోవటం గొప్ప విశేషం. కడప ఆకాశవాణికోసం ఏడువేల కృతులు రచించారు. వీరి సుప్రభాతాలు, కృతులు, సూక్తిముక్తావళలు ఆకాలంలో ఆకాశవాణికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పుట్టపర్తివారి ధారణాశక్తి అమోఘం, అద్భుతం. మిల్టన్ ‘‘పారడైజ్‌లాస్ట్’’, మనుచరిత్ర వసుచరిత్ర, తులసీదాస్ రామచరిత మానస్... అన్నీ ఆయనకి కంఠపాఠమే. సంప్రదాయ సాహిత్యానికి ఆయనొక దీపధారి.

వ్రజ భాష