లంచం ఇవ్వటం పుచ్చుకోవటం ఎక్కడైనా నేరమేనట
మరి అలాంటి నేరం చేసిన వ్యక్తినేం చేయాలి
పుట్టపర్తి వారు ఆ నేరం చేసారు..
ఎందుకో తెలుసా..
ముందు చదవండి ఇది
తరువాత శిక్ష గురించి ఆలోచిద్దాం
అది 1952 వ సంవత్సరం
కాశీలో తులసీ ఘాట్ అనే దగ్గర
తులసీదాసు పాదుకలు ఉన్నాయట
అవి దర్శించాలని పుట్టపర్తి కోరిక
కానీ
అక్కడి పూజారి యెవ్వరినీ ముట్టుకోనివ్వమని చెప్పాడు
తులసికి అపర భక్తుడైన పుట్టపర్తికి
వానిని ఒక్కసారి స్పృశించి కళ్ళకద్దుకోవాలని ఆశ
కాశీ లో తెలియని అశాంతితో తచ్చాడుతున్న పుట్టపర్తి మనసులో
ఒక ఆలోచన
వెంటనే ముఖంలో కొత్త ఉత్సాహం..
అర్ధరాత్రి
తులసీ ఘాట్ .
మందిరంలో పుట్టపర్తి
పళ్ళెంలో తులసీ దాసు పాదుకలతో
పూజారి గర్భగుడిలోంచీ బైటికి బైటికి వచ్చాడు
పరవశించి పోయారు పుట్టపర్తి
తీవ్ర భావావేశంతో కంపిస్తున్న శరీరం
ఆ పాదుకలను మైమరపుతో స్పృశించి వానికి
తన నుదుటిని తాకించారు
కళ్ళకద్దుకున్నారు
కనుల నుంచీ స్రవిస్తున్న భాష్ప ధారలు
తులసి పాదుకలను చేరి ధన్యమయ్యాయి
తొందరించాడు పూజారి ఇక చాలించమని
బలవంతంగా పాదుకలను దూరం పెట్టాడు
చేయి జాపాడు
పుట్టపర్తి జుబ్బా జోబీనుంచీ అయిదు రూపాయలు తీసి
ఆ పూజారి చేతిలో పెట్టారు
పూజారి వాటినందుకొని పాదుకలతో అదృశ్యమయ్యాడు
భారమైన మనసుతో అలానే నిలుచుండిపోయారు పుట్టపర్తి