16 సెప్టెం, 2014

సరస్వతీ సం హారము శ్రీ కూర చిదంబరం గారి అభిమాన నవలా ..?




  


ఒక నాడు కథ నవలా రచయిత 
శ్రీ కూర చిదంబరం గారు ఫోన్ చేసారు..
వారికి పుట్టపర్తి కన్నడం నుంచీ అనువదించిన 
సరస్వతీ సం హా రం ప్రతి కావాలట

ఆయన రచన చేసే తొలి నాళ్ళలో 
ఈ అనువాద నవల విపరీతంగా ఆకర్షించిందట..
తరువాత ఆ ప్రతికై ప్రయత్నిస్తూనే వున్నారు..
ఆయనకిప్పుడు డెభ్భైయ్యేళ్ళు..
 వారి మాటల్లోనే వినండి..
  

'ఎవరీ కూర చిదంబరం'
 నా అల్ప బుధ్ధి ప్రశ్న వేసింది..
వెంటనే గూగుల్ ను వెతికితే..
కూర చిదంబరం గారి వివరాలు దొరికాయి


        
ఆయన రాసిన కథలు అప్పటి లీడింగ్ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, పొలికేక వార పత్రికల్లో వచ్చాయి.
 ఈ ప్రాంతంకు చెందిన సీనియర్లయిన కథా రచయితలు గర్ళకుర్తి సురమౌళి, 
రాములు, 
గూడూరిసీతారాంతోసహా,
డా.మలయశ్రీ, 
తత్వవేత్త బి.ఎస్.రాములు, 
తాడిగిరి పోతరాజులు 
వీరికి సమకాలికులుగా చెప్పవచ్చును. 

అప్పటి సమకాలీన సామాజిక జీవితాన్ని, 
అణగారిన బతుకుల్లోని జీవన పోరాటాల్ని,
 పేదరికాన్ని, 
వారి కడగండ్లను నిశితంగా పరిశీలించి 
కథలుగా మలిచి, 
ఆయన చేసిన రచనలు చూస్తే, 
మునిపల్లె రాజు, 
పెద్దిభట్ల సుబ్బరామయ్య, 
చాగంటి సోమయాజుల కథలు గుర్తుకు వస్తాయి. 

చిదంబరం తన కథారచనను కొనసాగించి వుంటే. ఆయనకు ఎన్నెన్నో పురస్కారాలు దక్కియుండేవి. 
అతి కష్టమైన సిఎ కోర్సు పూర్తి చేసి, 
హైదరాబాద్ లో చార్టర్ అకౌంటెంట్ గా 
బతుకు తెరువుకై జీవితంలో స్థిరపడ్డాక 
ఆయన చాలా కాలం పాటు 
సాహిత్య వ్యాసాంగాల జోలికి వెళ్ళినట్లు కనిపించలేదు. 

వీరు ఆర్థిక వేత్తగా కొనసాగి 
కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ల పై సెమినార్లు చర్చావేదికలు నిర్వహించారు. 
వీరి భాషా శైలిని పరిశీలిస్తే 
ఈయన నిరంతర అధ్యయనం మాత్రం విడవనట్లుగా ప్రస్ఫుటమవుతుంది. 
రచనా వ్యాసాంగాలు కొనసాగించి వుంటే 
ఆయన పుస్తక రచనలు ఎన్నో వచ్చియుండేవి. 


http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may13/pustakaparichyam.html


 మళ్ళీ నేను సరస్వతీ సం హారం లోనికెళ్ళాను..
ఎంతకూ ఈ అనువాద నవలలో యేం వుంది

'కథ చెప్పే వాళ్ళకు ఊకొట్టే వాళ్ళు కావాలి..'
అని పుట్టపర్తి వ్రాసిన వాక్యం జనాల్లోకి ఎంత చొచ్చుకుపోయిందో తెలిస్తే
ఆ కథనం ఎంత విజయం సాధించిందో అర్థమవుతుంది..
 

'పెళ్ళాన్నేం చేస్తావురా బాళప్పా..
గొంతుపిసికి బాయిలో యేస్తాను..'
నవల మొదలూ చివరా వచ్చే వాక్యమిది..
 

ప్రతి సమాజంలో మంచీ చెడూ రెండూ వుంటాయి 
ప్రతిసారి మంచి వ్యక్తిత్వాలు విజయం సాధిస్తాయనే నమ్మకం యేమీ వుండదు.
 

నీచ స్వభావాలే ముందడుగు వేసి విజయాన్ని కైవశం చేసుకోవడమూ కద్దు
ఈ నవలలో గౌరమ్మ బాళప్పలు నీచ పాత్రలు
సాత్విక పాత్రలలో బ్రహ్మానంద శాస్త్రి అచ్చమ్మ సరస్వతి గణపతి అందరూ అసహాయులే
 

బాళరాజు సత్య సంధుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు
పుణ్యాత్ముడు
ఈ ముగింపు వాక్యాలతో 

బాళప్పను పుణ్యాత్మునిగా చిత్రించినా నవల మొత్తం అతని పాత్ర ఎంత దుందుడుకుదో ఎంత అనాగరికమైనదో ఎంత కఠినమైనదో చిత్రించిన వైనం బీచీ అసమాన రచనా శైలికి తార్కాణంగా నిలుస్తుంది..
అలానే పుట్టపర్తి సరళ సుందర అనువాదమూ పూవుకు తావి అబ్బినట్లుగా అమరింది
తెలుగు పలుకుబడులను సమయోచితంగా వాడటం వలన భాష అందగించింది
అంతేకాక రచనలో అప్పటిసాంఘీక చిత్రం కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది..

'హంసరాజ్ రహబ్బర్ '

ఉర్దూభాషలో వ్రాసిన నవలను 
'సంఘర్షణ' పేరుతో తెలుగులో అనువదించారట పుట్టపర్తి
 

ఇందులోని ప్రతిపాత్రా 
బాహ్య జగత్తుతో ఆంతరిక జగత్తుతో పోటీ పడుతుంది
కొన్ని పాత్రలా సంఘర్షణలో నలిగిపో పరిస్థితిలో నరకమనుభవిస్తున్నాయ్
 

మూల రచయిత ధర్మధ్వజఛాయకు లొంగిపోయి కుముద పాత్రను బలవంతంగా చంపేశాడనీ..
ఒకవేళ తానే కనుక వ్రాసివుంటే 

అలా చేసేవాణ్ణి కాదని అనువాదకుడు 
ముందుమాటలో అన్నారు
అంటే అనువాదకుణ్ణి అంతగా కదిలించిన ఇతివృత్తం అనువాదంగా సైతం మరింతగా 

పఠితలకు నచ్చి వుండాలి..
మరి పుట్టపర్తి ఉర్దూ నుంచీ అనువదించిన 

ఈ సంఘర్షణ ఎలా దొరుకుతుందో..