11 అక్టో, 2014
పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి భావ లహరి
8 అక్టో, 2014
లోపల వెల్గు వెల్గులకు..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
మృదుల మానసమెంతటి బాధ సేయురా..!!
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
6 అక్టో, 2014
సిరి కల నాడు ..
దానం..
ఒక్కొక్కరు ఒక్కో నియమం పెట్టుకుంటారు
కొందరు గోవులను సేవిస్తూ .. గోదానాలు చేస్తుంటారు
కొందరు
బీదలకు పుస్తకాలు పంచిపెట్టి చదివిస్తూ విద్యాదానమే గొప్పదని అంటారు..
దానధర్మాలు చేస్తూ తృప్తి పొందుతుంటారు ఇంకొంతమంది..
రోగగ్రస్తులకు ఉచితంగా వైద్యం చేయిస్తూ..
ఇదే మంచిదని అనేవాళ్ళూ ఉంటారు..
తమ శరీరావయవాలను తమ తదనంతరం
ఇతరులకు అమర్చాలని కోరేవాళ్ళు కొంతమంది..
మంచిదే చూపునూ శ్వాసనూ ఇతరులకు ప్రసాదిస్తే మెచ్చనివారెవ్వరు..
ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు
దాన గుణం ఎక్కువట.
వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ
153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో
శ్రీలంక ,ఐర్లాండ్, కెనడా, గయానా,
సియర్రా లియానె వాసుల్లో
దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది
- వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
- బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
- శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
- కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
- ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు
దానం చేసే వ్యక్తి
దానం స్వీకరించే వ్యక్తి
దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా
అని ఆలోచించి
లేదా రుజువు చేసుకొని
అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే
అతనికి దానం ఇవ్వాలి.
దానం స్వీకరించే వ్యక్తి
దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి
అతనికి దానం ఇచ్చినట్లయితే
అటువంటి దానంను అపాత్రదానం అంటారు.
''అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.''
వేమన కూడా అన్నదానం గొప్పదన్నాడు
నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి,
ఇక్కట్ల నుండి బయటపడడానికి
చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం
అని చెప్తారు పండితులు.
పోతనకూ మంచి కుటుంబము
తృప్తి కరమైన జీవితమూ ఉన్నాయట
హాయిగా తానూ జీవిస్తూ దానధర్మాలు చెస్తూ పోతన తరించే వాడని పుట్టపర్తి అంటారు ..
అందుకే పోతన రచనలోను అట్టి సందర్భాలను ఎంతో
సానుభూతితో వర్ణిస్తాడని చెబుతారు వారు..
రంతి దేవుడు నిట్రుపవాసం తో తపస్సు చేసాడు
నలభై ఎనిమిది రోజుల తరువాత
అన్నం తిందామని అనుకున్నాడు
ఒక బ్రాహ్మడు వచ్చాడు
తన భోజనంలో సగమిచ్చాడు
మళ్ళీ తిందామనుకొనేంతలో ఎవరో శూద్రుడు ..
మిగిలిన అన్నంలో ఒక భాగం ఇచ్చాడు
నోటముద్ద పెట్టబోయేంతలో
కుక్కల గుంపుతో మరొకడు అన్నమడగడం..
విసుక్కోకుండా..
ఆకాస్తా ఇచ్చేయటం..
సన్నయములాడి సాగనంపటం
వచ్చిన వాడు ఇంద్రుడో.. శివుడో ఎవరికి తెలుసు..
మిగిలినవి నీళ్ళు
అవైనా గుక్కెడు నోట్లో పోసుకుందామనుకుంటే..
ఒక చండాలుడు దప్పి దప్పి అంటూ అగపడ్డాడు..
ఈ మాటలు విన్న రాజు హృదయం
దయారసముతో పొంగినదట..
వాళ్ళకెంత ఓర్పు ఎంత నిదానమో కదా..
ఒక రోజు పూజ చేసి
రెండుదాకా ఖాళీ కడుపుతో వుండి
కాస్త అన్నమో టిఫెనో నోట్లో వేసుకుందామనుకొనేసరికి యెవరో వచ్చి అది నాకిచ్చెయ్ అంటే
మనమంత శాంతంగా
ప్లేటులో పెట్టుకున్న పదార్థాన్ని ఇచ్చేయగలమా..
వెంటనే కోపం వస్తుంది..
కానీ అటువంటి సమయం లోనూ సంయమనం పాటించడమే నిజమైన భక్తి
తపస్సు కాదంటారా..
విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి
కామ క్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయసాగాడు
కుంభకం ఉపయోగించి శ్వాస తీసుకోవడమూ నిలిపేశాడు
ఎన్ని సంవత్సరాలూ..
వెయ్యి ..
శరీరం పుల్లలా ఎండిపోయింది..
శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం
ఒకరోజింత అన్నం తిందామని కూర్చునేంతలో
ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి బిక్ష అడుగుతాడు
మౌనంగా ఆ అన్నాన్ని ఇచ్చేసి
మళ్ళీ తపస్సులో మునిగిపోతాడు విశ్వామిత్రుడు..
అందుకే ..
తపస్సంటే కేవలం ముక్కుమూసుకుని
మంత్రాన్ని జపించటం కాదు
కామ క్రోధ లోభ మోహాలను జయించటం..
అందులో దేవతలు పెట్టే పరీక్షలు నెగ్గటం ఒక తంతు..
వాళ్ళ ఆమోద ముద్ర పొందాక
వాళ్ళు రెకమెండ్ చేస్తే..
యే శివుడో బ్రహ్మో వచ్చి..
లేవవయ్యా నీవు మహర్షి వైనావు ..
ఋషి వైనావు అని
ఒక మెడల్ ను మెడలో వేసి వెళతారు..
అది నిలుపుకుంటూ
తదుపరి గ్రేడ్లకు అప్పియర్ కావడమే తపస్సు
పదండి పుట్టపర్తి రంతిదేవుని కలుసుకుందాం..
చక్కని గృహస్తున కుండవలసిన గుణములన్నియు నాతనికున్నవి అతిధి పూజ
ఆ మహాకవికి ప్రాణముతో సమానము
అయాదరమునకు పోతన్న దృష్టిలో నీయాజాతిలేదు.. భగవంతుడు విశ్వాత్ముడన్న సత్యము
ఆతని నరనరమునను జీర్ణించినది..
అన్ని దానములకంటెను
అన్నదాన మాతనికి చాల ప్రియమైనది..
నిజమే
ధనములిచ్చి యతిధిని దృప్తి పరచుట యసాధ్యము.
అన్నము బెట్టి యెట్టివానినైనను దృప్తిపడినాననిపించవచ్చును
అందుకే యట్టి ఘట్టములు వచ్చినపుడు
పోతన్న యెంతయో సాహుభూతితో వర్ణించును.
రాజ వంశోత్తములైన రంతిదేవుడు
తపస్సు జేయుచుండెను.
ఆతడు నలువది యెనిమిది దినములు నిట్రుపవాసమొనర్చినాడు.
మరుదినమున గొంత యన్నము దిన సంకల్పించెను..
తొలుత వొక బ్రాహ్మణుడు వచ్చి యాచించినాడు
కలిగిన యన్నములో రంతిదేవుడు సగమాతనికిచ్చెను..
మరియొక శూద్రుడు వచ్చినాడు
ఆ రాజు మిగిలిన యన్నములో నొక భాగమిచ్చెను
ఇంతలో వేరొ క్కడు కుక్కల గుంపుతో గూడవచ్చి యన్నమడిగెను
రంతిదేవుడణుమాత్రమైనను విసిగి కొన్నవాడుగాడు
అన్నశేషమిచ్చి.. సన్నయము లాడిపంపెనట..
అంతతో పరీక్ష దీరిపోలేదు..
మంచినీళ్ళు మిగిలినవి..
వానినైనా ద్రావుదమని రంతిదేవుడు తయారయ్యెను
ఇంతలో నొక ఛండాలుడు సాక్షాత్కరించినాడు
వాడనెను..
కం. హీనుడ చండాలుడను
మానవ కులనాధ..దప్పిమానదు, నవలన్
బోనేర, నీకు జిక్కిన
పానీయము నాకు బోసి బ్రతికింపగదే..
ఈ మాటలు విన్న రాజు హృదయము
దయా రసముతో బొంగిపోయినది..
అతడెంతో యాదరముతో ..
ఉ. అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి ద్రావుమన్న రా
వన్న,శరీరదారులకు నాపద వచ్చిన వారి యాపదల్
క్రన్నన మాన్పి వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదే ? నాకు దిక్కు పురుషోత్తము డొక్కడే సుమ్ము పుల్కసా !(న.స్క.647)
అని పలికి
మ. బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమై యున్నచో
నలయండేమియు వీని హృజ్జ్వరము నాయాసంబు ఖేదంబు నా
జల దానంబున నేడు మానుననుచు సర్వేశ్వరాధీనుడై
జలమున్ బోసెను రంతిదేవుడు దయన్ చండాల పాత్రంబునన్..
ఈ సన్నివేశము నింత మధురముగా పోతన్న వర్ణించుటకు గారణము ఆ గుణముపై నాతనికికి గొప్ప సానుభూతి యుండుటయే..
లేబుళ్లు:
వ్యాసాలు
5 అక్టో, 2014
హిందీలో శివతాండవం
పుట్టపర్తి శివతాండవాన్ని శ్రీ చావలి సూర్యనారాయణ మూర్తి గారు అనువదించారు
సాహిత్య అకాడమీ ప్రచురించింది
సమర్పణ పుట్టపర్తి అనూరాధ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం
సాహిత్య అకాడమీ ప్రచురించింది
సమర్పణ పుట్టపర్తి అనూరాధ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం
లేబుళ్లు:
వ్యాసాలు
4 అక్టో, 2014
పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన నేర్పు..
''పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన నేర్పు..
రామభద్రుని శయ్యలో ఒయ్యారం..''
రచన : సరస్వతీ పుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు
ఒచ్తోబెర్-నవంబరు ,1954 పరిశోధన లో ప్రచురితం..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం
రామభద్రుని శయ్యలో ఒయ్యారం..''
రచన : సరస్వతీ పుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు
ఒచ్తోబెర్-నవంబరు ,1954 పరిశోధన లో ప్రచురితం..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం
లేబుళ్లు:
వ్యాసాలు
29 సెప్టెం, 2014
మర్మము పరులకు దెలుపకు..
ఒక అత్త వూరెళుతూ కోడలికి
కొన్ని విధులప్పగించింది..
వాటిలో
ప్రతిరోజూ నైవేద్యం కృష్ణునికి పెట్టటం కూడా ఒకటి
వీటిల్లో యేది మర్చిపోయినా నీకు బడితె పూజ తప్పదని బెదిరించింది కూడా
ఆ కోడలికి విచారం పట్టుకుంది..
మిగిలిన పనులెలాగైనా చేయగలదు..
కా నీ కృష్ణునితో తినిపించటమెలాగూ..
అత్తేమో చండశాసనురాలు
మొదటిరోజు నైవేద్యం దేవుని ముందు పెట్టి
''ఇదిగో మా అత్త నాకు కొన్ని పనులు చెప్పింది
వాటిలో నీకు నైవేద్యం పెట్టటం కూడా ఒకటి
మరి నైవేద్యం తెచ్చాను తిను'' అంది..
ఊహూ ..విగ్రహంలో చలనం లేదు
ఓహో ..యేవైనా స్తోత్రాలు పద్యాలూ చదివితే తింటాడేమో అనుకుంది..
హారతిచ్చింది గంటవాయించింది.. రాడే..
'యేమిటీయన మొండి పట్టు 'అనుకుంది.
''ఇదిగో కృష్ణయ్యా..
మా అత్త లేదనీ..
కోడల్ని నేను పెడుతున్నాననీ ..
రావటానికి ఇష్టపడటంలేదేమో..
ఎలాగోలా సర్దుకోవయ్యా.. నాలుగురోజులాగు.. అత్తవస్తుంది
నీ బాధ్యత అప్పుడామెదే....
ఈ నాల్రోజులూ కాస్త బుధ్ధిగా వచ్చి తిను ..
నా బంగారు కొండవు కదూ..''
అని బతిమలాడింది..
అబ్బబ్బబ్బ.. రాడే..
ఒకరోజు..
రెండ్రోజులు..
కోడలికి భయం పెరిగింది ..
అత్త వచ్చి 'కృష్ణుడు తినటం లేద'ని తెలుసుకుంటుందేమో అని..
అంతే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది..
లోపలికెళ్ళింది..పెద్ద కర్రొకటి పట్టుకొని
రెండు దెబ్బలు నేలపై కొట్టి..
''ఏయ్ కృష్ణా ..
రెండురోజులైంది నీవు తిని ..
తెలిస్తే మా అత్త నన్ను చంపేస్తుంది
నిన్నా మొన్నా బతిమాలాను
ఇక అవేవీ వుండవు
మర్యాదగా వచ్చి తింటావా..
నాలుగు తగిలించమంటావా..''
అంటూ గుడ్లెర్రజేసి విగ్రహం వంక చూసిందంతే..
విగ్రహం గజ గజ లాడింది..
వెంటనే దాంట్లోంచీ చిన్ని కృష్ణుడు వచ్చాడు..
వాడి అందం చూసి కర్ర దూరం పడేసి..
ఆ కోడలు కబుర్లు చెబుతూ
కృష్ణునికి పదార్థం తినిపించింది..
తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాడు..
'అమ్మయ్య 'అనుకుంది కోడలు పిల్ల
ఇలా నాల్రోజులు గడిచాయి..
అత్త వూరినుంచీ దిగి నాల్రోజులూ
జరిగింది విని తెల్లబోయింది..
ఆ తరువాత ఆమె కోడలి అదృష్టానికి ఆమెకు పొంగులు ఆగలేదు ..
మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కి కూడా
బెదిరించడాలు. ఆక్షేపించడాలూ వుంటాయా..
అది వారు ఆయనతో పెంచుకొనే చనువుని బట్టి వుంటుంది..
పుండరీకుడు చూడండీ..
తండ్రి పాదాలు వత్తుతున్నాడు
కృష్ణుడు కుటీరం వెలుపలినుంచీ
''పుండరీకా..
నేను కృష్ణుణ్ణి వచ్చాను ..
ఒకసారి రా ..''
అంటే ..
''వుండవయ్యా.. నేనిప్పుడు చాలా బిజీ
మా తండ్రి పాదాలు పడుతున్నాను..
కాస్సేపు వైట్ చేయ్యి
అక్కడ ఒక ఇటిక వుంది..
దానిపై నిలబడి వుండు ..''అన్నాడు
ఆవిడుంది ఆ శబరి..
రామునికి ఎంగిలి పండ్లు తినిపించింది..
పైగా దోరవేవో కాయలేవో చూశానంటుంది కూడా..
ఆ రాముడు పరమ ప్రీతితో తిన్నాడు..
యేమంటాం చెప్పండి..
రామదాసు రామునికి నగలు చేయించాడు..
ఆ ముస్లిం రాజు పట్టుకుని జైల్లో వేశాడు..
వున్న శిక్షలన్నీ వరసగా వేయించేస్తున్నాడు
నగలు పెట్టుకొని ఊరేగిన రాముడు వచ్చి
''తానీషా తొందర పడకూ
ఈ రామదాసు నాకే ఆ డబ్బు ఖర్చు పెట్టాడు..
అతన్ని వదిలెయ్ ప్లీస్ ''అని చెప్పొద్దూ..
చల్లగా తప్పించుకున్నాడు..
రామదాసుకు ఒళ్ళు మండిపోయింది..
''ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రా..''
అంటూ గొల్లుమన్నాడు.. తర్వాత రామలక్ష్మణులిద్దరూ రామదాసు బాకీ తీర్చేశారనుకోండీ..
ఇలాంటి సందర్భం పుట్టపర్తి వారు చెబుతున్నారు..
ఇది భాగవతోపన్యాసములు లోది..
సమర్థ రామదాసస్వామి పండరి పొయ్యాడు
విఠలుణ్ణి చూశాడు..
ఆయనే మో నడుముపై చేతులుపెట్టుకుని నిలబడున్నాడు
దేశమంతా అధర్మ భుయి ష్టంగా వున్నప్పుడు..
నడుముపై చేతులేసి హొయలుగా ఆ నిలబడ్డమేంటి.. అనుకున్నాట్ట సమర్థ
వెంటనే చాపపాణియై దర్శనమిచ్చాడట విఠలుడు
పాపం దేవుని కష్టాలు దేవునివి..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
వ్యాసాలు
26 సెప్టెం, 2014
హేతువాదము తీవ్ర ధ్యానముతో పరిపుష్టమైనప్పుడు..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)




