11 డిసెం, 2015

తరం .. తరం .. నిరంతరం


ఇది శివతాండవం ..9వ తరగతి పాఠం 
పిల్లలకు అర్థమయ్యేలా వివరించిన దండె రామ్మూర్తి గారికి కృతజ్ఞతలు.. 

8 డిసెం, 2015

వాణిశ్రీ vs సురేకాంతం




ఒకసారి మా అయ్యతో 

సినిమా నిర్మాత ఎం.ఎస్. రెడ్డి 


కూతురు పెండ్లికి పోయాం మద్రాసులో .. 

నేను చిన్నదాన్ని పదో పన్నెండో వయసు.. 

వాణిశ్రీ అంటే బోల్డంత ఇష్టం.. 


దీనికి చదువుకంటే యే సినిమా యాక్టరు


 యెవరో అన్నీ అడ్రసుతో సహా చెబుతుందిరా.. 

అనేవారు మా అయ్య నవ్వుతూ.. నేను వాణిశ్రీ ని 


చూస్తానని మారాం చేశాను.. మా అయ్యకు ఇష్టం 


లేకపోయినా ఇంతలో వాణిశ్రీ వచ్చింది ఆమె చుట్టూ


 ఒకటే గుంపు.. ఆమెను కలవలేదు.. 

చివరికి సూర్యకాంతం ఎదురు వచ్చింది 

రెండుచేతులూ జోడిస్తూ

 నమస్తే పుట్టపర్తి నారాయణాచార్లు గారూ అంది నోరారా 


నవ్వుతూ..

నమస్కారమమ్మా .. ఇదిగో ఇది నా బిడ్డ అన్నారు 

అయ్య యేం మాట్లాడాలో తెలీక.
.
అంతే .. 


ఆమె నన్ను గుండెలకు గట్టిగా హత్తుకుని

 బాగున్నావా.. అంది.. ప్రేమగా.
.
తర్వాత మా అయ్య యెవరికి చెప్పారో యేమో ..


వాణిశ్రీ ఫోటోలు చాలా పోస్ట్ లో వచ్చాయి..


6 డిసెం, 2015

నవలాభిరామం

నవలాభిరామం 

28 నవం, 2015

హృదయమె సంకెల యౌ నా ..??


న గురోరధికం ..


న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః 
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః
గురువును మించిన తత్త్వం లేదుగురువును మించిన తపం లేదుగురువును మించిన జ్ఞానమూ లేదుఅట్టి గురుదేవులకు నమస్కారము.

శంకరాచార్యులవద్ద పద్మపాదాచార్యులనే శిష్యుడు
గురువు మాటే వేదవాక్కు
గురువే దైవం
తోటి శిష్యులకు అసూయ..

వారికి కనువిప్పు కలిగించాలని 
శంకరాచార్యులవారనుకున్నారు.

ఒకసారి సనందుని రమ్మని కబురంపారు
నదికటువైపునుంచీ..
ఇటువేపున ఉన్న శిష్యుడు పరుగు పరుగున వెళ్ళాడు.
నడుమ ఉరకలేస్తున్న నదిపైన
డాటడం ఎలా అన్న ప్రశ్న లేదు..
వేస్తున్న ప్రతి అడుగు కిందనుంచీ 
ఒక పద్మం వికసించింది..
ఆ పద్మాలపై నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇతర శిష్యులకు తమకు అతనికి ఉన్న భేదం చక్కగా 

గోచరమైంది..

ఇలా గురు చరితలు మనకనేకం . . 
మన మనసులో ముద్ర వేసిన వానిని మనం 
అప్పుడప్పుడూ వాడుతుంటాం .. 

ఒకసారి కేతు విశ్వనాధ రెడ్డి గారూ
శశిశ్రీ గారూ ఇద్దరూ ఒక దేవాలయం వెళ్ళారు..
అక్కడి పూజారి 
శశిశ్రీ ని గోత్రం చెప్పమని అడిగారట..
శశిశ్రీ తడుముకోకుండా భారద్వాజసగోత్రం అన్నాడట..
ఆశ్చర్యపోయిన కేతు గారు..
శశిశ్రీ నీవు ముస్లిం వి కదా 
మరి నీ గోత్రం భారద్వాజస అన్నావెందుకు 
అని అడిగారు
నేను పుట్టపర్తి నారాయణా చార్యుల శిష్యుడిని 
నా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులదే గోత్రమైతే 
నాదీ అదే గోత్రం 
అని చిరునవ్వుతో జవాబిచ్చారట శశిశ్రీ..
ఈ  విషయం 
కడప ఇన్ఫో లో త్రివిక్రమ్ గారు ప్రస్థావిం చారు
వాస్తవానికి పుట్టపర్తిది షటమర్షణ గోత్రం.
కానీ గురువు గోత్రమే తన గోత్రం అంటం చక్కగా వుంది
దానిద్వారా  గురువుతో ఎంత 
 మానసిక బంధం ఏర్పరుచుకున్నారో తెలుస్తుంది.
ఆ బంధం గురువే వేస్తాడో లేక 
 ఆయన తపోబలమే శిష్యుడిని కట్టిపడేస్తుందో.. 
శిష్యుడే తన భక్తితో గురువును పొందుతాడో..
అదంతా అలౌకిక ప్రపంచం 
కానీ గురువుగా ఒకరిపై గురి కుదరటం
 అందరికీ సాధ్యం కాదు 
దానికి కూడా ప్రాప్తం ఉండాలి 
దానిలో ప్రయాణం అతి దుర్గమం
బయలుదేరి వెళ్ళినవారు 
తమ అనుభవాలను మనతో పంచుకోరు..
కావాలంటే నీవూ వచ్చి చూడు అంటారు..
అంత అతిలోకమైన భావ ప్రాప్తి పొందిన తరువాత 

ప్రపంచం వేపుచూస్తారా..

20 నవం, 2015

కర్మఫలం




అయ్యా నీవు పూర్వజన్మలో ఎవరు
అని అడిగాను ఒకరోజు
అప్పటికి మా అమ్మ పోయింది .. 
అయ్యా  నిర్లిప్తతలో ఉన్నారు .. ఒక విధం గా .. 
నన్ను నిదానంగా చూశారు అయ్య
నా వంటి మూర్ఖురాలికి ..
అజ్ఞానికి ..
చెప్పాలనిపించిందో..  
అప్రయత్నంగా చెప్పారో .. మరి.. 

'అళియ రామరాయలు' అన్నారు 
ఆ జవాబుకు నా  రియాక్షన్ ఏమీ లేదు ..  
మా ఇంట్లో గత జన్మలు పునర్జన్మలు.. 
కర్మ లు బంధాలు .. 
ముక్తి మార్గాలు 
అన్నీ కామన్ వర్డ్స్ .. 
ఆ ప్రశ్న ఎంత బరువైందో .. 
జవాబు ఎంత విలువైనదో .. 
దాని అర్థమేమో నాకు తెలియదు అప్పుడు
అది నిజమా కాదా అన్న ఆలోచనా లేదు
అడిగాను ..చెప్పారు అంతే..

మల్లాది గారి జన్మ కర్మ చదువుతున్నాను.. 
అది నిజంగా ఒక కష్టమైన సబ్జెక్ట్ .. 

నిజమే కదా 
ఒక ఆవు పూజలందు కుంటుంది 
ఒక ఆవు చీత్కారాలకు గురి అవుతుంది 

ఒక పూవు నేలపై 
ఒక పూవు పూజకై 

ఏమిటీ వింత .. 
ఒకరికి మేడలూ .. ఒకరికి పేవ్ మెంట్లు . 

పాపాత్ముడు సుఖాలలో .. 
మంచివాడు  నిట్టూర్పులలో .. 

వారి వారి పూర్వజన్మ పాపకర్మ వల్లనే వారికా జీవితం 
అందరూ దీనికి త్వరగా కనెక్ట్ అవుతారు
పుట్టినప్పటినుంచీ మన మెండ్ సెట్ అలా తయారు చేసారు మనవాళ్ళు

దీనికి నాస్తికు దీన్ని అంగీకరించడానికి చస్తే ఒప్పుకోరు
అంతా మీ భ్రమ అంటారు
కనపడని శక్తిని..
అది తమమీద చేసే పెత్తనాన్ని ఒప్పుకోవటం
వారి మితిమీరిన అజ్ఞానానికి అహంకారానికి ప్రతీక.

నాస్తిక భౌతికవాదులు అంటే శాస్త్రవేత్తలు
వీరికి ప్రతిదానికి ఋజువులూ నిరూపణలూ కావాలి
అందరికీ ఒకే మెదడు పెట్టినా 
కొందరే మేధావులుగా తయారవుతున్నారన్న 
కొన్ని ప్రశ్నలకు వీరు జవాబేం చెబుతారో కానీ
వీరు నిరూపణలు కోరే కొద్దీ..
అందుకు సవాలు విసిరే మరో పది ప్రశ్నలు 
వెన్నడుతూనే వుంటాయి..
ఇవి అసుర లక్షణాలని గీత లో కృష్ణుని ఉవాచ

కర్మ సిద్ధాంతం ప్రకా రం .. 
గోడకి కొట్టిన బంతిలా మనం చేసిన కర్మ 
మనవేపు వేగంగా వస్తుంది
కర్మలు మనం చేసే ఫోన్ కాల్స్ వంటివి
భగవంతుని రికార్డు ల్లో ఎప్పటికప్పుడు 
అవి నమోదైపోతూనే వుంటాయి

తగిన సమయంలో 
తగిన శరీరం ఇచ్చి 
మనన్ని మన కర్మ ఫలాన్ని అనుభవించేలా చేసే వాడు  ఆ దైవం .. 
కర్మ ఫల ప్రదాత.

కర్మ ఫలాన్ని యోగులైనా అయోగు లైనా 
అనుభవింపక తప్పదు. 
ఇదే ఎన్నోసార్లు చెప్పేవారు పుట్టపర్తి 
ఈ కర్మ ప్రస్థానం  లో 
మా అయ్యా నేను ఏ మలుపులో కలుసుకున్నామో 

ఏ మలుపులో విడి పోయమో .. 
నాకు తెలియదు కాని 
ఈ కలయిక ఎప్పటికీ అద్భుతమే నాకు ..