22 ఏప్రి, 2012

పుట్టపర్తి వారు మహా జ్ఞాని ఆర్తుడు భక్తుడు..అక్కిరాజు రమాపతిరావు -పుట్టపర్తి అనూరాధ



తెలుగు సాహిత్యం లో ..
ఇరవయ్యో శతాబ్దిలో ..
అత్యంత ప్రతిభావంతులైన..
ఇంకా కొన్ని తరాలు చెప్పుకోదగ్గ గొప్పరచయితలు అయిదారుగురిని ఎంపిక చేయాలంటే..
అందుకు ఎవరు పూనుకున్నా..
పుట్టపర్తి వారు వుండడం అనివార్యం..
 
పది మంది సమూహంలో పోల్చుకోదగిన 
ప్రతిభ ఆయనది..
చిన్న కోనేరులకూ..
తటాకాలకూ..
సరస్సులు కూ ..
మహానదికీ ఎంత అంతరం వుంటుందో ..
తక్కిన రచయితలకూ ఆయనకూ ..
అంతటి భేదం వుంటుంది..
 
మర్రి చెట్టుకూ ..తక్కిన వృక్షాలకూ..
ఎంతటి ఎంత వ్యత్యాసం వుంటుందో ..
ప్రౌఢిలో ..విస్తీర్ణతలో ..
అంతటివ్యత్యాసం..
ఆయనకూ ..ఇతరులకూ ..వుంటుంది.
అక్కి రాజు రమాపతి రావు గారు ..
20.9.2010 లో వ్రాసిన వ్యాసమిది..


అక్కిరాజు రమాపతి రవు గారు. .
మంజుశ్రీ గా ప్రసిధ్ధులు.
సృజనాత్మక రచనలతోపాటూ 
పరిశోధనా రచనలు 
జీవిత చరిత్రలూ 
సంపాదక వ్యాసాలు 
సాహితీ విమర్శలూ 
మొదలైన అరవై పుస్తకాలు రచించారు.
 
వీరు 
పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర లోని 
దీక్ష, 
పురాతన ప్రకరణాలను 
2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.

"తెలుగులో స్వీయచరిత్రలూ ఆత్మకథలూ ఎన్నో వచ్చాయి కానీ ఇంత ఆత్మ నివేదన ప్రణవంగా ఏ రచనా రాలేదు అనడం సాహసం కాదేమో"

 హంపీ నుంచీ హరప్పా దాకా 
తిరుమల రామచంద్ర గారి పుస్తకానికి 
సంపాదకత్వాన్ని వహించిన 
అక్కిరాజు రమాపతిరావ్ గారు 
అన్నారంటే 
ఆయన పరిశీలన ఎంత నిశితంగా 
హృదయపూర్వకంగా వుంటుందో 
మనకు తెలిసి మనం 
ఆయనతో యేకీభవించక తప్పదు

 
భాగవతం నవమస్కంధంలో 
105 గద్య పద్యాలతో పోతన రచించిన 
శ్రీరామ చరిత్రకు 
 డా. అక్కిరాజు రమాపతిరావు గారి సార్థ తాత్పర్య సహితము తాత్పర్య సహిత వ్యాఖ్యను సులభశైలిలో వ్రాసారు.
 గ్రంధానికి కె.వి.భీమారావు గారి చిత్రాలు వన్నె తెచ్చాయి. 
ప్రతి తెలుగింట తప్పక ఉండవలసిన పుస్తకమిది.

అటువంటి అక్కిరాజు గారు అయ్యను విశ్లేషించిన వైనం చూడండి..













2 కామెంట్‌లు :

  1. పాఠ్యే గేయే చ మధురం - ప్రమాణైస్త్రిభిరన్వితమ్ |
    జాతిభిః సప్తభిర్బద్ధం - తంత్రీలయసమన్వితమ్ ||

    ఈ రామాయణం చక్కగా పఠించడానికి, మధురంగా గానం చేయడానికి అనువైనది. త్ర్యస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణాలతో అలరారేది, సరిగమపదని సప్తస్వరాలతో కూర్చినది, వీణాది తంత్రీవాద్యాలపై, మృదంగాది లయవాద్యాలతో పలికించడానికి అనువైనది.

    (బాలకాండ 4 - 8)

    రిప్లయితొలగించండి
  2. భగవత్కథ వివేవాడికి సహజంగా ఆర్తి వుండాలి .
    భవత్కథ విని జీవితాన్ని మార్చుకుందాం అనుకున్న వాణికి భగవత్కథ ఇతరులకోసం కాదు.
    అయ్యో ఇన్ని కోట్ల జన్మలెత్తామే ఇంకెన్ని జన్మలెత్తాలో ..
    అనే వివేచన లేని వాణిముందు చెవిటివానిముదు శంఖమే..

    శంకర భగవత్పాదులు
    ఏ జన్మ అయితే నాకెందుకు స్వామీ
    ఏదయినా
    సప్త ధాతువులతో
    చర్మము
    రక్తము
    మాంసము
    కొవ్వు
    అస్థి
    మేధ
    అనే ఏదు పదార్థములతో చేయబడిందే
    పంచభూతముల వికారమే
    ఏ శరీరమని నేనడగను
    నేను కోరుకొనే దేవిటో తెలుసా నీ పాదములయందు భక్తిని ప్రసాదించు..

    ఒకే పరబ్రహ్మం సృష్టి చేసే టప్పుడు బ్రహ్మగా వుంటుంది.
    స్థితి చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా
    లయం చేసే టప్పుడు పరమేశ్వరునిగా వుంటుంది.
    ఒకే పరబ్రహ్మం మూడుగా వుంటుంది కనుక
    అపారమైన శివారాధన చేసిన ఫలితం చేత
    మహేశ్వరానుగ్రంతో విష్ణుకథ చెప్పేటటువంటి అదృష్టాన్ని వాల్మీకి పొందాడు.
    విష్ణుకథ చెప్పడానికి ఉపదేశం చేసిన వారెవరు..
    బ్రహ్మగారు
    వాల్మీకి ఎవరి అనుగ్రహం పొందాడు త్రిమూర్తుల అనుగ్రహాన్ని
    చేసినది మహేశ్వరారాధన పొందినది బ్రహ్మగారి అనుగ్రహం చెప్పినది విష్ణుకథ.

    రిప్లయితొలగించండి