నువ్వంటే నాకెందుకో ఇంత 'ఇదీ'
నువ్వంటే నాకేమిటో అదే 'ఇదీ'
అని ఒక కథా నాయిక నాయకులు
యుగళ గీతం పాడుకున్నారు
ఇదీ.. ఇదీ..
ఆ 'ఇది' అంటే యేమిటో
ఇద్దరి మనసులకూ తెలిసినా
ఆ 'యిది'ని మాటల్లో చెప్పాలంటే వాళ్ళకీ
ఒకలాంటి 'యిది' కాబోలు
'యిది' మీ వంశపారంపర్యంగా వచ్చిందయ్యా
ఆపరేషన్ చేస్తే పోతుంది
అమ్మయ్య ..
అదేదో మా తాతయ్యకి చేసెయ్యండి
ఈజవాబులోని ఆ 'యిది' ఓ జబ్బు
ఇలా 'అదీ ..యిదు'లతో మనము ఏదేదో చెప్పేస్తుంటాం
మరి కావ్యాలు రాసే కవులూ తోచని చెప్పలేని భావాలను 'అదీ.. యిదు'లతో పూరిస్తారా..
పోతనామాత్యులు ఆ 'యిది'ని
' మంచి' అనే మాటతో సర్దేస్తారట..
'అదె'విటో చూద్దామా..
మనము మాటలాడునపుడు
ఒక్కొక్కసారి
ఇది చాల 'యిది' గానున్నదందుము.
అక్కడేదో భావస్ఫోరకమైన మాట
మనకు తట్టుటలేదు.
ఆ కొరతను 'యిది' యను సర్వనామము పూరింపవలెనని మన యాశ
ఇట్టి 'యిదు'లతో పూరించుకొనవలసిన చోటులు తిక్కనామాత్యులలో చాల వచ్చును.
ఆ యలవాటు
అప్పుడప్పుడు పోతన్నకు కూడ నున్నది. భావములలోని 'నత్తి'నాయన
'మంచి' యను పదముతో పూరించుకొనుచుండును .
పాల సముద్రమున బుట్టిన లక్ష్మీదేవికి
దేవతలేవేవో యుడుగరలిచ్చిరి
ఆ నడుమ
భారతీదేవి యొక మంచి తారహార మొసగెనట. (అ.స్క.271)
ఈ తారహారములోని మంచితనమేమో
వివరంచుట కతనికి మాటలురాలేదు గాబోలు
ఈ 'మంచి 'మరియొకసారి వచ్చును.
యశోదకు కొడుకు పుట్టినాడని గోపికలకు దెలిసినది. అపుడు వారందరు 'మంచి' పదార్థములు
కొనుచు వచ్చినారట
కం. "కంచుకములు దలచుట్లును
గాంచన భూషాంబరంబులు కడుమెరయగ నే తెంచిరి గోపకులందరు
'మంచి' పదార్థములు గొనుచు మాధవునకున్"
ఇక్కడ 'మంచి'తనము గూడ
పోతన్నకు సంభవించిన మాటలలోని నత్తియే.

కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి