వాయువుకు శరీరం వుండదు
అది సమస్త శరీరాలలోకి వెళ్ళి పాలన చేస్తుంది.
రామాయణంలో ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి ఒకమాట చెప్పాడు
వాయు అశరీరః శరీరేషు వాయుశ్చరతి పాలయన్
శివమహాపురాణం లోని విశేషమది
ఎత్తరా కాలూ ..కొట్టరా దెబ్బ
అంటూ కుక్కల సర్కస్ ఆడిస్తూ అరుస్తున్నాడోపిల్లాడు
ఒక్కో మాటలో వాడి సంస్కారం పెల్లుబు కు తోంది
ఊర్లోని కుక్కలన్నిటినీ
వాటి మెడలకు తాళ్ళు కట్టి తీసుకోచ్చి
పెనుగొండ కొండమీద
వాటితో సర్కస్ చేయిస్తాడా కుర్రాడు
వాడు కొట్టే దెబ్బలకు
కుయ్యో అని మొత్తుకొనే ఆ కుక్కలూ
మధ్య మధ్య ఆ కుర్రాడి మాటలూ
పక్కనే ఉన్న శంకర్రవ్ లాయర్ కు
తలనొప్పిగా తయారయ్యాయి
ఆయన చెప్పే మాట క్లయింట్లకు వినపడదు
క్లయింట్లు చెప్పేది ఆయనకు వినపడదు
పిల్లాడిన్నో సార్లు చెప్పాడు
అదిలించాడు బెదిరించాడు
వాళ్ళ నాయనకు చెప్పాడు
ఊహూ...
లాభం లేదు
ఆయనకేమో భార్యా వియోగం
వీడిదిఅలుపెరుగని అల్లరి
అడ్డూ ఆపూ లేకుండా పోతోంది
ఇలాక్కాదని ఆలోచించి
మంచి మాటలతో వాణి తెలివిని పొగడి
నీకు మంచి వ్యక్తిని పరిచయం చేస్తాను రా..
అని ఒకరోజు ఆ ఇంటికి తీసుకొచ్చాడు
ఆమె రిటైర్డ్ సబ్ కలెక్టర్ భార్య
వాళ్ళాయనిక్కడే పోయాడు
తానూ యీ మట్టిలో కలిసిపోవాలన్నది ఆమె కాంక్ష
ఆ కుర్రాణ్ణి పరిచయం చేసాడు
కుర్రాడు మంచి తెలివైన వాడు
వాణికి రానిదేదీ లేదు
కానీ తల్లి లేదు
అంటూ ఆమె కేసి చూసాడు శంకర్రావ్
ఆమెకు యూరోపియన్ తెలుగు వచ్చు కొద్దిగా.
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వుంది
మన భారతీయ స్త్రీలైతే
వయసు పైబడగానే గుళ్ళూ గోపురాలూ ఉపవాసాలు
కానీ ఆమె ఆంగ్లేయురాలు
క్రిస్టియన్
వాళ్ళు మనలా గంటల తరబడి పారాయణాలు అవీ చేయరు
ఓ పదినిమిషాలు' ఓ ప్రభువా' అని
ఓ కొవ్వొతి వెలిగించి ప్రార్థించి
మళ్ళీ ఆ కొవ్వొత్తిని వారే ఆర్పేసి
దేవుడి వెనకాలే దాస్తారు
తాము చేసిన పాపాలు ప్రభువుకు చెప్పేస్తే నిశ్చింత
'దేవుడికి చెప్పేశాం కదా ' అని కొత్త పాపాలుచెయకూడదు.
అది పశ్చాత్తాపం కావాలి
ఈ రోజు ఈ పాపం చేసాను
ఆ పాపం చేసాను
ఇక్కడ పట్టుకొచ్చాను..అక్కడ కొట్టుకొచ్చానూ
వాడిని ముంచాను
నన్ను క్షమించు అంటూ వుంటే
దేవుడు చెవులు మూసుకుంటాడు
శంకర్రావ్ మాటల కొలమానంతో ఆ పిల్లాణ్ణి తూచప్రయత్నించిం దామె
ఆమెకు
తల్లి లేని చురుకైన ఆ బాలునిపై వాత్సల్యం కలిగింది
అబ్బే కుదురు లేదు
ఏం అల్లరిరా నాయనా
కానీ జీవితాన్ని మధించిన అనుభవం
పోగొట్టుకున్న వాటి విలువ గ్రహించింది కనుకే
ఆ పుట్టపర్తి నామే చేరువ చేసుకో గలిగింది
ఇద్దరికీ స్నేహం కుదిరింది ..
చనువు పెరిగింది
అప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలు మొదలయ్యాయి
ఆమె ద్వారా ఇంగ్లీషు సాహిత్యం గురించి విన్నాడువాడు
షేక్స్పియర్ మిల్టన్ బైరన్ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేసింది ఆమె
నాకు షేక్స్పియర్ నాటకాలు చెప్పండి అన్నాడు
అయితే నీవూ మనుచరిత్రను నాకు పాఠం చెప్పు అంది
అలా
ఒకరికి ఒకరు గురువూ శిష్యుడూ కూడా అయ్యారు
ఆమె డెభైయ్యేళ్ళ పిట్
వాడు పన్నెండేళ్ళ పుట్టపర్తి
ఆ బాల మేధావి గురు దక్షిణగా ఏం సమర్పించుకున్నడోతెలుసా
ప్రతి రో జూ ఆమె బట్టలుతకటం
అప్పటికే
పంచ కావ్యాలూ భారత భాగవతరామాయణా లూ సంగీత నాట్యాలూ వాణికి వేళ్ళ అంచున వున్నాయి
కానీ
ఇద్దరిలో ఒంటరితనం ..వేదన
ఒకరికి తల్లిలేదు
మరొకరికి భర్త లేడు
ఆమెకు తానేం కోల్పోయిందో తెలుసు
కానీ వాడికి పాపం తనకేం లేదో కూడా తెలియదు
ఒకరి జీవితం కువ కువల తొలి వేకువ
వేరొకరిది మసకబారిన ఆశల కొస
ఒకరకంగా
ఉదయ సాయం సంధ్యల సమ్మేళనం ఆకలయిక
ఆ ఇద్దరినీ
ఎల్లలు లేని సాహిత్యం అక్కున చేర్చుకుంది
సాహిత్యం అంటే హృదయం
హృదయం నవరసాల మిశ్రమం
నవరసాల సృష్టియే సాహిత్యం
చెప్పింది చెప్పినట్లు గ్రహించే పిల్లాణ్ణి చూసి పొంగిపోయింది పిట్
ఆనాటి పిల్లాణ్ణి చూసిన పిట్ కు
మన తెలుగు సాహిత్యగంగలో అంతగానూ మునకలు వేయాలని తహ తహ బయలుదేరింది
గురువుగా వాణి త్రివిక్రమ స్వరూపం చూసి తన్మయురాలైపోయింది ఆమె
అదేవిటీ పిల్లాడు
గురువుగానూ మైమరపిస్తాడు
శిష్యుణిగానూ పొంగిపోయేలా చేస్తాడు
అని నివ్వెర పోయింది
తాను చూస్తున్నది
రేపు ఒక మహా వటవృక్షంగా విరాడ్రూపం పొందే
ఒక అంకురమని
ఆమె గ్రహించేవుంటుంది
ఇలాంటి విస్మయాన్నే యశోద
కృష్ణయ్య నోరు తెరిచి చూపించిన రోజున పొందింది
దాన్నే భక్తి అంటారనీ
దాని పేరైదైనా గోపికలకు కృష్ణయ్య యందు కలిగినభావమిలాంటిదే ననీ
ఈ ఆత్మార్పణాభావ తీవ్రతలోనే వామనునికి మూడడుగులు బలి ధారపో సాడనీ ఆమె గ్రహించే వుంటుంది | ||||||||||
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి