10 డిసెం, 2013

శ్రీనివాస ప్రబంధ రచనకు తిరుమలేశుని ఆనతి



తిరుమలేశుని మూర్తిలో 
ఎక్కడా మరెక్కడా కానరాని కానగలేని 
అద్భుత సౌందర్యతేజో విశేషం కేంద్రీకృతమైవుంది
 అనంత తేజః పుంజమని చెప్పబడే యీ మూర్తిని 
ఒక్కక్షణం చూచినా తనివి తీరదు
గంటల తరబడి చూచినా తనివి తీరదు
 

ఆయనను దర్శించి వచ్చిన భక్తులందరికీ 
ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా దివ్యానుభూతిని ప్రసాదిస్తాడు
కొందరికి ఆలయమంతా తానై
కొందరికి ఆనందంగా  అప్పుడే విచ్చుకున్న మల్లెమొగ్గ చందాన
ఇంకొందరికి 'ఖబడ్దార్' అని హెచ్చరిస్తూ
ఆత్మీయునిగా చేయందిస్తూ మరికొందరికి
 

అది ప్రతి వ్యక్తీ స్వయంగా అనుభవించాలే తప్ప 
చెప్పటానికి వీలుకాదు.
ఇలా భక్తులకే కాదు
నిత్యమూ శ్రీవారి అర్చన నైవేద్యాలలో సన్నిహితంగా పాల్గొనే 

అర్చక స్వాములకు కూడా 
ఆ మూర్తి 
పరమానందాన్ని పరమాద్భుతాన్ని పరమాశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది
ఆభరణాల సమర్పణవేళల్లో
పుష్పాలంకరణ వేళల్లో
స్వామివారి పాదాలు చేతులూ మెత్తగా సుతిమెత్తగా 

స్పర్శకు తగులుతూ
గగుర్పాటును కలిగిస్తుందట..
వారి నిత్యానుభవంలో 

శ్రీ స్వామి విగ్రహం శిలగా తోచనే తోచదట..
పుట్టపర్తి శతజయంతి కార్యక్రమం దూరదర్శన్ లో జరిగినప్పుడు
నరాల రామారెడ్డి కామిశెట్టి శ్రీనివాసులు పొత్తూరి చాలామంది వచ్చారు
అప్పుడు కామిసెట్టి ఒక విషయం చెప్పారు
కానీ దాన్ని ఎలా ప్రజంట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండినాను
ఇంతలో అక్కయ్య హరికొలువు అనే ఒక పుస్తకం ఇచ్చింది
అందులో అంతా తిరుమలేశుని విశేషాలే
 

అందులోని కొన్ని పంక్తులద్వారా 
కామిశెట్టి చెప్పిన విషయాన్ని మీకు చేరవేస్తున్నాను
అది ఇది


ఒకసారి పుట్టపర్తి కామిశెట్టి తదితరులు 
శ్రీనివాసుని సన్నిఢిలో వున్నారు
స్వామికి దగ్గరగా అతిదగ్గరగా..
పుట్టపర్తికి అర్చకులు హారతి చూపిస్తూ ఒకమాటచెప్పారు
అది యేమంటే..
''స్వామివారు మిమ్మల్ని తన గ్రంధాన్ని పూర్తి చేయమని సెలవిచ్చారు..''
అని
అయ్యకు కాస్త చెవులు వినబడవు
''యేమిరా.. యేమంటున్నారు వారు..''
అని కామిశెట్టినడిగారు
ఆయన వివరించారు
అంతే..
పుట్టపర్తి కన్నీరు మున్నీరయ్యారు
అప్పటికి శ్రీనివాస ప్రబంధం సగం పూర్తయి నిలిచిపోయివుంది
పుట్టపర్తి ఆనందాన్ని పట్టలేక పోయారు
అదే ఊపులో తిరిగివచ్చి ప్రబంధాన్ని పూర్తిచేసారు 

ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో 

అన్న కామిశెట్టి ఇచ్చిన సమాచారం తో ..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి