28 జన, 2015

కనులు విప్పని యోగి


  
''కనులు విప్పని ఈ యోగి కంఠమందు
చిలుక సాలను తులసి పేరులను గూర్చి
ప్రతిదినము పూజ  లొ నరించు ప్రకృతి లక్ష్మి
యేమొ ఆ చిట్టితల్లి కే నోము కలదొ..??''
''పెనుగొండలక్ష్మి''
 

పై పద్యమున  'కనులు విప్పని యోగి '
 అనుట వలన ..
యోగ నిద్రా పరవశుడైన నారాయణ మూర్తి స్వరూపము స్ఫురించుచున్నది..
 

అట్టి యోగి కంఠము న ప్రకృతి లక్ష్మి 
'చిలుక వరుసలు'
 అను తులసిమాలతో
అర్చించుచున్నదట..
 

అనగా 
జీవుల నుధ్ధరించుటకై మాతృమూర్తియైన లక్ష్మీదేవి..
భగవంతునికి పురుషకారము చేయుచున్నదను 

శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యమిచట సూచింపబడుచున్నది..
 

'ఆ చిట్టి తల్లికే నోము కలదో '
అనుటవలన గోదా శ్రీ రంగనాధుల కథనము గూడ స్ఫురించుచున్నది..
 

కనులు విప్పిన యోగి శ్రీ రంగనాధుడు..
శేషతల్పము కాల స్వరూపము.
ఆ కాల స్వరూఅము నధిష్టించిన పరమాత్మ శ్రీ రంగనాధుడు..
ఆ రంగనాధుని భర్తగా వరించి తులసిమాలలు సమర్పించినది గోదాదేవి..
ఆమె ఈ విధముగా జీవులకు మార్గదర్శకమైనది..
 

అందులకే  'చిలుకసాలు ' 
అను పదబంధము జీవ పరంపరను వ్యక్తము చేయుచున్నదని ఊహించుట
 

''ఎల్లే ఇళఙ్కిళయే ఇన్న మురుఙ్గు దియో..''
 

అనెడి తిరుప్పావై పాశురమున
 గోపికను చిలుకగా సంబోధించుట యున్నది..
ఈ సంప్రదాయ ప్రభావమే..
పుట్టపర్తి భక్తి కవిత్వమున కాలంబనము..
 

డా.వఝ్ఝల రంగాచారి
శివతాండవము పై పరిశోధన చేసారు.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి