18 నవం, 2015

ఇది నా మాట

6 కామెంట్‌లు :

  1. అనూరాధగారూ,
    ఆలోచనీయమైన మాటలు గుర్తుచేసారు. అలాంటి అల్పకవుల్లో నా పేరూ వస్తుందేమో. ఐనా, నేను కవినేమిటీ! కాలమే నిర్ణయించాలి. రాముడే దీవించాలి మరి.
    -తాడిగడప శ్యామలరావు

    రిప్లయితొలగించండి
  2. అన్నా .. ఇది ఎప్పుడో 74 సభలో జనాంతికంగా పుట్టపర్తి వారు చెప్పిన మాట.. మీరు చక్కగా రాస్తున్నారు. రామార్పణం చేసిందేదైనా అమరమే. నేను పాట రాకపోయినా పాడుతున్నా కదన్నా. నాకు Thairaid వుంది. గొంతు సరిగా పలకదు. కీచుబోతుంది. మనం రాముని కోసం చేసేటపుడు మంచీ చెడూ ఆయనే చూసుకుంటాడు. ప్రపంచం వైపు చూస్తేనే బాధ. అది పొగడుతుంది తిడుతుంది వెక్కిరిస్తుంది.మీ శ్యామలీయం భాగవతం.. జ్యోతిశ్శాస్త్రం..తెలుగు వ్యాకరణం.. శ్యామలీయం నవకవన వనం అన్నీ చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనూరాధగారూ, ప్రపంచం ఏమంటున్నది అన్న స్పృహ ఉన్నంతకాలమూ అంతే‌గదండీ, పోనివ్వండి, మనకు రాముడే మంటున్నాడన్నది ముఖ్యం. అప్పుడంతా అనందంగా ఉంటుంది. ఈ‌ ప్రపంచం నన్ను మెచ్చాలని ఎన్నడూ వ్రాయటం లేదు. పెద్దల ద్వారా రామాశీర్వాదాలు అందుతున్నాయవి చాలు. ఒక్కొక్కసారి ఒక పద్యం స్ఫురిస్తుంది. బాగుంటుంది కూడా. తీరా బ్లాగులో ఉంచటానికి ఎందుకో మనస్కరించదు చివరి నిముషంలో. రామాఙ్ఞ లేదు అని ఉదాసీనంగా ఉంటాను. అలాంటి పద్యాలను తీరుబడిగా పరిశీలించినపుడు అంతత్లీనంగా కొన్నికొన్ని దోషాలు స్ఫురించటమూ గమనిస్తున్నన్నాను. అంటే రామాఙ్ఞ లేని పద్యం అచ్చుకు రావటం లేదు. అందుకు సంతోషంగా ఉంటోంది. ఈ‌ ప్రపంచం మెప్పు వేరే కావలనుకోనవసరం లేదు కదా!

      తొలగించండి
  3. పుట్టపర్తి వారు కానీ విశ్వనాధ వంటి పెద్దలు వ్రాసిన వానికన్నా చించివేసినవే ఎక్కువట. మన ఆత్మానందం కోసం వ్రాసుకోవటమే కాని ప్రపంచానికి కాదు కదా. అదీగాక మనం ఎట్టిపరిస్తితులలోనూ ప్రపంచాన్ని మనతో ఇన్వాల్వ్ చేయకూడదు. మనం అవ్వకూడదు. మీరు జ్యోతిశ్శాస్త్ర పండితులు గతం భతిష్యత్తు అంతేకాక మన గత జన్మల విషయాలు కూడా దృష్టికి వస్తాయి . కాబట్టి మీవంటి పెద్దలకు చెప్పేటంతటి దాన్ని కాదు నేను.
    ఒకసారి విశ్వనాధవారికి అనకాపల్లిలో సన్మానం చేసి పదివేలు కానుక ఇచ్చారట. అప్పుడే ఒక కవి వేదికపైకి వచ్చి తాను ఒక కావ్యం రాశాననీ ప్రచురించడానికి ధనంలేదని అన్నారట. ఇంత ప్రతిభ ఇక్కడుండగా నన్నెందుకు అక్కడినుంచీ పిలిచారు అంటూ.. తనకు ఇచ్చిన పదివేల రూపాయలనూ ఆయనకిచ్చి అనకాపల్లి బెల్లానికి ప్రసిధ్ధి వారి మనసులు కూడా తియ్యనివే. మీకెంత పెద్దమనసో ఇప్పుడు చూపించుకోండి విరాళాలివ్వండి అంటూ అదే వేదికపై కొంత ధనాన్ని పోగుచేయించి ఆయనకిచ్చి తన శాలువాను ఆయనకు కప్పి వెళ్ళిపోయారట. అందుకే వారి వాక్కుకంత విలువ. మహనీయులెవ్వరైనా ఇలానే ప్రవర్తిస్తారు. కదా

    రిప్లయితొలగించండి
  4. వారి త్యాగ నిరతి కూడా కవిత్వానికి కీర్తిని తెస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకసారి విశ్వనాధవారు సన్మానం అందుకొని ఇంతికి రిక్షాలో తిరిగి వెడుతూ, చలిలో సరైన ఆఛ్చాదనలేక ఇబ్బంది పడుతున్న రిక్షావానిని గమనించి అతడికి తన శాలువా కప్పుకోమని ఇచ్చివేసారట!

      తొలగించండి