పుట్టపర్తి విజ్ఞాన సంపన్నులు ..
అనేక భాషలు నేర్చా రు ..
అనేక పుస్తకాలూ వ్రాసారు ..
అంతేకాదు
ఎంత రాసారో అంతకు వంద వంతులు చదివారు ..
ఆకాలంలో కేవలం పుస్తకాలు కొనటా నికే
మద్రాసు వెళ్లేవార ట ..
బస్సులో పుస్తకం చదువుతూ చదువుతూ
జేబులో డబ్బు ఏ దొంగ తీసినా తెలియనంత మమేకమై
పోయేంత పుస్తక ప్రియులు ..
మా అమ్మ ఒక బనియన్ కుట్టింది .
ముందు జేబు వుండేలా ..
దాన్ని దొంగల బనియను అనేవాళ్ళం ..
NTR గార్డెన్స్ లో బుక్ ఫెయిర్ జరుగుతూంది.
మా అయ్య పుస్తకాలు అక్కడ వెలిసాయి.
చాలా మంది సందర్శిస్తున్నారు.
భావాలు పంచుకుంటున్నారు.
ఈ సందర్భంగా
కడప జిల్లా రచయితల సంఘం సమావేశాల్లో అధ్యక్షోపన్యాసం ఇస్తూ.. పుట్టపర్తి ఇచ్చిన సందేశం.
ఈనాడు హైదరాబాద్ లో
బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంలో
ఆనాటి వారి భావాలను పొందుపరుస్తున్నాను.
ఆశ్చర్యమేమంటే ..
ఆనాటి వారి భావాలు ఈనాటికీ వర్తిస్తుండటం..
అంతేకాదు..
ఈనాటికీ అవి అత్యంతావశ్యమకమై వుండటం
ఎందుకంటే పరిస్థితులు
ఆనాటికంటె ఈనాడు సాంఘీకంగా రాజకీయంగా
దిగజారి ఉన్నాయి కాబట్టి..
చదవండి..
''ఆంగ్లము నుండి మనము ఇంకను అనేక పుస్తకము లను భాషాంతీకరించుకోవలసి వున్నది.
ఇప్పటికిని కాల్డ్ వెల్ రచనలు కుడా పూర్తిగా తెలుగులోకి రాలేదు.
ఏ విజ్ఞానము కావలసియున్నను
మనము ఇంగ్లీషులోనికి పోవలసినదే..
హిందీ యభివృధ్ధి కూడనంతంతయే యున్నది.
మన దేశంలో అనేక భాషలున్నవి.
మనకు దగ్గరగానున్న భాషలు ఒక్కదానినైనను నేర్చుకొనుటమంచిది.
అప్పుడీ భాషా భేషజములెన్నియో తగ్గును.
''నీవు చెప్పిన సలహాలన్నియు బాగుగనే యున్నవి.
ఈ పనులు చేయుటకు ధనమెక్కడనుంచి వచ్చును ? ''
ప్రశ్న బాగుగనే ఉన్నది..
ఉత్తరము గూడ సులభమే.
ప్రభుత్వమునకు తక్కిన పనులకు ధనమెక్కడినుంచి వచ్చునో ఇదియును అక్కడనుండియే రావలయును. ఉన్నధనమంతయు దీనికే దోచిపెట్టమని
నేను చెప్పుటలేదు.
పెట్టగూడదు గూడ.
కాని ఇదియు కూడ చేయవలసిన పనియేయని ప్రభుత్వము యొక్క దివ్య చిత్తమునకు వచ్చిన చాలును. ఎలక్షన్లకు కోట్ల కొలది వెచ్చించి
ప్రజలకు ఎన్ని దురభ్యాసములు నేర్పుచున్నారో మీరెరుగనిది కాదు.
ఈ సందర్భములో రాజకీయవాదులకు
ఒక చిన్న సలహా..
వారు విందురో విన రో.. నాకు తెలియదు..
కాని మనము చెప్పవలెను గదా..
వారు కొంత చదువుకొనిన బాగుగా నుండునని
నా విన్నపము.
కళాకారులను మనుష్యులుగా గుర్తింపవలెనని నా విన్నపము. కాలమున నిలుచునవి రాజకీయములు కావు. విజ్ఞానమే..! కళలే.. !
పూర్వమిట్లుండలేదు.
ఆనాడు రాజులూ రౌతులూ
తమకున్నంతలో కళలనెంతయో పోషించినారు. రెడ్డిరాజులు సాహిత్యాదులకు చేసినసేవ సామాన్యమైనది కాదు.
ప్రభుత్వమే గాదు ప్రజలు గూడ
విజ్ఞాన విషయమై తమ ధనమును
కొంత ఖర్చు పెట్టవలసియున్నది.
వెర్రి వేడుకలకు .. త్రాగుడు మొదలగు దురభ్యాసములకు లెక్కలేనంత ఖర్చు పెట్టెదరు.
సాహిత్యజ్ఞునకు కళాకారునకు ఒక బొట్టునివ్వరు.
పూర్వమెన్ని విద్యలనో ప్రజలు పోషించినారు.
తోలు బొమ్మలవాండ్లు, పగటివేషగాండ్లు.
బుడు బుడక్కలవాండ్లు, బయలు నాటకం వారు నట్టుకాండ్రు, వీరందరూ ప్రజాభిమానులపై బ్రతికినవారు.
పొరుగున నున్న రష్యా..
ఏ చిన్న కళనైనను చావనివ్వక రక్షించుకొనుచున్నది. ఆయా కళలలో పరిశోధనా భాగములే యేర్పరచినారు. మనకా దృష్టిలేదు.
ఇది నేను ప్రజలకు ప్రభుత్వమునకు కూడ ఇచ్చు సలహా మహాజనులారా ..
ఇవి నాకున్న భావములు ..
వానిని మీముందుంచినాను.
ఆ భావములు మీకు సరిపోకపోవచ్చు.
మీరు వివేకవంతులు
ఆలోచించుకొనగలిగినవారు ..
నాకు మీరే ప్రమాణము.. ''
నోట్ల వెర్రిలో జనం
రిప్లయితొలగించండిఓట్ల వెర్రిలో రాజకీయులు
కళలకు ఆదరణ ఎక్కడ?
ఇప్పటికిని కాల్డ్ వెల్ రచనలు కుడా పూర్తిగా తెలుగులోకి రాలేదు.-పుచ్చకాయ రచనలు. అనువాదం అంత అవసరమా.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు తమ అభిరుచికి తగిన పుచ్చకాయ రచనలు వెతుక్కోండి. ఇంతకూ తమరు అజ్ఞాతంలో ఉండి వ్యాఖ్యలు చేయడం అవసరమా..
రిప్లయితొలగించండిరాబర్ట్ కాల్డ్వెల్ మే 7, 1814 సంవత్సరంలో స్కాటిష్ కుటుంబంలో జన్మించాడు. గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన తర్వాత వివిధ భాషల మధ్య పోలికలు ఆశ్చర్యాన్ని కలుగజేసేవి. 24 సంవత్సరాల వయసున్న కాల్డ్వెల్ లండన్ మిషనరీ సొసైటీ క్రింద మద్రాసు జనవరి 8, 1838 సంవత్సరంలో చేరాడు.
రిప్లయితొలగించండికాల్డ్వెల్ 1844 లో ఎలిజా మౌల్ట్ (1822-99) ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడుగురు పిల్లలు. ఎలిజా ప్రసిద్ధిచెందిన తిరువనంతపురం మిషనరీ రివరెండ్ చార్లెస్ మౌల్ట్ (1791-1858) కుమార్తె. ఈమె నలభై సంవత్సరాల పైగా భారతీయ మహిళల విద్య సాధికారత మీద పనిచేశారు.[1] తమిళ భాషను క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత ఇతర ద్రవిడ భాషలను శాస్త్రీయంగా పరిశోధించడం మొదలుపెట్టాడు.
రానర్ట్ కాల్డ్వెల్ దక్షిణ భారతీయ భాషలైన తమిళం, తెలుగు, కన్నడం మరియు మళయాలం ఒక ప్రత్యేకమైన భాషా కుంటుంబానికి చెందినవని ప్రతిపాదించాడు. వీటిని ద్రవిడ భాషలు అని పిలిచాడు. ఈ భాషల ప్రాచీనత మరియు లిటరేచర్ చరిత్ర ఆధారంగా వీటిని సంస్కృతం మరియు ఇండో-ఆర్యన్ భాషల నుండి వేరుచేయాలని భావించాడు.[2] ఈ భాషలు మాట్లాడేవారి పూర్వీకులు భారతదేశం లోకి ఉత్తర పశ్చిమ వైపు ఉండి వచ్చి ఉంటారని కూడా ప్రతిపాదించాడు. థామస్ ట్రాట్ మాన్ ఇతని పుస్తకం గురించి ఈ విధంగా వ్రాసాడు
"Caldwell showed the full extent of the Dravidian family, and demonstrated the relations among the languages in a richness of detail that has made it a classic work, still in print. The real significance of what Caldwell accomplished was not the first conception of the Dravidian family, but the consolidation of the proof."
శ్యామలీయం గారూ .. వాళ్ళు కేవలం రాజకీయమే చేస్తున్నారండీ.. పాలన కాదు..ప్రభుత్వ పాత్ర ప్రతిపక్షాన్ని అణచటం ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయటం అంతే ప్రజల గురించి వాళ్ళెప్పుడో మరిచిపోయారు. ఇక కళలెక్కడ..
రిప్లయితొలగించండి