
పాత్రలను ప్రవేశపెట్టటంలో గూడా వాల్మీకి గొప్ప చాతుర్యాన్ని చూపుతాడు..

అయోధ్యలో అలంకరణలు ఆరంభమైనాయి
అవన్నీ ఒక రాత్రిలో జరిగిన పనులు

ఆమె పుట్టింటినుంచీవెంట వచ్చింది
ఆవిడ ఎందుకో బుధ్ధి పుట్టి..
చంద్ర సంకాశమైనప్రాసాదాన్ని అ ధి రో హిం చిం ది ..
అయోధ్యా నగర వీధులన్నీ ధగ ధగ లాడిపోతున్నాయి
హఠాత్తుగా యేమిటీ వేడుక
ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగింది..
కౌసల్య దాసి ..
రాఘవునికి జ రిగేపట్టాభిషేకాన్నిగూర్చిసమాచారాన్నందిస్తుంది
'రేపుపుష్యమీ నక్షత్రంలో..
రాముడు యువరాజౌతాడన్నది'
ఈ మాటతో మంధర హృదయంలో నిప్పుపడ్డది..
వెంటనే సర సరా ప్రాసాదం దిగివచ్చింది..
ఆ సందర్భంలో వాల్మీకి ఒక మాట అంటాడు..'
'విదీర్యమాణా హర్షేణ..'
కౌసల్య దాసి సంతోషంతో పగలబడిపోతున్నదనుట
ఇక్కడ మంధరను గూర్చి
అంతకు ముందు మనకేమీ తెలియదు
శాంత గంభీరమైన మహా సముద్రంలో
హఠాత్తుగా ఒక పెద్ద తిమింగలంలేచినట్లు
మంధర లేచింది..
ఇతర కవి ఎవరైనా అయివుంటే
మంధరను గూర్చిన సోది అంతా మనకు చెప్పి
తర్వాత మంధరను ప్రవేశ పెట్టి వుండేవాడు..''
శ్రీమద్వాల్మీకి ప్రణీత శ్రీమద్రామాయణ ము
అ యోధ్యాకాండము మొదటి సంపుటము
వ్యాఖ్యాత ; ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు
శ్రీమద్రామాయ ణదర్శనము
ముందుమాట పుట్టపర్తి
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి