15 ఫిబ్ర, 2016

ఎందుకయా సాంబశివా..


అది ప్రొద్దుటూరు దగ్గర చీపాడు..
చుట్టూ పొలాలే..
అతి తక్కువ  వర్షపాతం
అందులో పండే ఏవో కొన్ని పంటలు 
ఇదీ రాయలసీమ

ఆ పొలాలలో ఓ గుడిసె
అందులో ఇరవయయిదేళ్ళ పుట్టపర్తి..

మంచి పేరు ప్రతిష్టలు..
పెద్ద పెద్ద వాళ్ళనుంచీ ప్రశంసలు..
వాళ్ళు కూడా పుట్టపర్తి మేధకు అబ్బురపడ్తూనే
ఆయన విచిత్ర వైఖరికి ఆశ్చర్య పడి దూరం వెళ్ళిపోయేవారు..

ఉద్యోగం లేదు..
ఎప్పుడూ పూజలూ జపాలూ భజనలూ
అంతే..
ఇదీ ఆయన జీవితం
ఇంతకూ ఆయన సన్యాసి కాదు.
భార్య ఇద్దరు ఆడపిల్లలు
చదువు లేదు సంధ్య లేదు వాళ్ళకి..
ఆరేళ్ళు పదేళ్ళు
మరి తిండి..
వాళ్ళూ వీళ్ళు దయతలచి ఇస్తే..
వారి గురించి ఆయనకు అసలు యోచనే లేదు..

భార్యా పిల్లలపై బంధం లేదు..
వారి భద్రతపై పట్టింపు లేదు
రేపెలా అనే విచారం లేదు
అసలు అతనికి సంసారమే అక్కరలేదు..

అమ్మమ్మ గొప్ప ధనవంతురాలు 
ఆ కాలంలోనే వడ్డాణం వంటి ఆభరణాలు కలిగినది.
ఆమె అమ్మ స్థితిని చూసి గుండె తరుక్కుపోయేలా ఏడ్చేది.. పాపం

కట్టెలపై వంట..
అమ్మ వంట చేసి ఆ పొలాల్లోని పొదల్లో ఏ చాటునో కూచుని ఏడుస్తు వుండేది..అమ్మ
అక్కయ్యలకు ఆ పరిస్తితులలో భయం
అమ్మ ఒక్కతే వారికి తోడు.
అమ్మా
అమ్మా
అని అరుస్తూ ఏడుస్తూ వారు అమ్మను వెతుక్కునే వారు..
ఆ పరిస్తితులెంత భయానకం..
ఒక గృహస్తు తన గృహస్తు ధర్మాన్ని నిర్వహించాలి..
గృహస్తు ధర్మం లో వుంటూనే సాధన కొనసాగించవచ్చు..
ఒక గృహస్తు మానసిక స్థితి
 సన్యాసి  స్థితిని పోలినప్పుడు..
 అటు సాధువూ కాలేక 
ఇటు గృహస్తూ కాలేక ..
అటు భక్తి వదలలేక ఇటు రక్తిని వదిలించుకోలేక ..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి