2 జూన్, 2016
ఔరా అమ్మకచెల్ల..
లేబుళ్లు:
చిత్రాలు
,
పుట్టపర్తి చమత్కార విన్యాసం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
'స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరమ్' అన్నది అర్జునుడు కదండీ. ఇందులో అనుమానానికి తావులేదు. కృష్ణుడే కదా వృష్ణివంశప్రదీపకుడు! అందుచేత వార్ష్ణేయ అని సంబోధించబడిన వాడు శ్రీకృష్ణుడే అని విస్పష్టం. గీత అంతా శ్రీకృష్ణార్జున సంవాదం అన్నదీ సర్వజనవిదితమేను.
రిప్లయితొలగించండిమీరు చెప్పినది సత్యమే..
రిప్లయితొలగించండిప్రతి జాతి కొక్క సంప్రదాయమున్నది..ఆ సంప్రదాయము ప్రవాహ నిత్యము.. కాలాంతర దేశాంతరములలో గొంత మారవచ్చును.. మెరుగు తరుగులుండవచ్చును..సంప్రదాయమొక మహానదియైనచో మార్పులుపనదులవంటివి.. ఆ మహానదిలో నిన్నటినీరు నేడులేదు.. నేటినీరు రేపుండదు.. కాని పరునది నీరే.. గులకరాలు గాదు పాశ్చాత్యవిద్యతో స్త్రీల భావములో గొన్ని మార్పులు చెలరేగినవి అవియన్నియు మన సంప్రదాయానుబధ్ధములుగావు. పురుషునివలె నకెందుకు స్వేచ్చలేదు..?? అనుభావము వానిలోనొకటి వానివలెనే విశృంఖలముగ దిరుగవలెనని యామె యాశించును. ఇదియంత యారోగ్యప్రదమైనభావముగాదు. కృష్ణుడు గీతలో స్త్రీలుచెడిన జాతినశించుననెను. పురుషులమాట బ్రధానముగా జర్చింపబడలేదు కారణమేమనగా వారి ముకుద్రాడులు స్త్రీలచేతులలో నున్నవని యాతడెరుగును. స్త్రీపురుషులకొక్కటే విధమైన విద్యాప్రణాళిక నిర్ణయించుట మొదటిదోషము. లోకమున స్త్రీపురుషుల గర్తవ్యములే భిన్నములు. చిత్తవృత్తులును భిన్నములే. వానిననుసరించిన కళాదృష్టియును నొకటిగాదు. పురుషులు సాధారణముగా గాంభీర్యప్రియులు. లాలిత్యము వారిక్షణికభావము స్త్రీకి లాలిత్యమే స్వభావము. గాంభీర్యమామె క్షణిక భావము. వారి కొసగు విద్యలలో నీ భిన్నతను గ్రహింపవలెను. ఆ గమనింపకుండుటయే దేశమునకు జేటుదెచ్చినది .. నేటి విద్యాధికురాలైన స్త్రీ సంసారమునకు పనికివచ్చుటలేదు.. ఆమెలో మాతృత్వము పూజ్యము పత్నీభావమెండిపోయినది స్వాతంత్ర్యకాంక్ష తన వికృతస్వరూపముతో నామె యడుగడుగునను బ్రత్యక్షమగుచున్నది. సమాజమున దనకు
గొప్ప స్థానము గావలెననూఅశ మాటికిని కోరికలకు లోబడు చాపల్యమునకు
వాక్కుతో నామె స్వతంత్ర యనును కాని హృదయము పరతంత్రము. ఆమె గృహమును నిర్వహించుకోలేదు పురుషునివలె బయట దిరిగి నిర్విశంకముగా బనిచేయలేదు ఆ రెంటి నడుమ నలిగి యొక నితాంత మనోవేదన ననుభవించుచున్నది..
ఇలా సాగిపోతుంది వ్యాసం. విద్య.. సమానత అన్నీ వున్నా అనేక అమానుషాలకు బలి అయిపోతున్న స్త్రీలను మనం నిత్యం పేపర్లలో టీవీలలో చూస్తున్నాం
ఇక్కడ కృష్ణుడు చెప్పాడా అర్జునుడు చెప్పాడా అన్న ది ప్రధానం కాదేమో.. విషయం చెబుతున్నారు అంతే..
పైన వాక్యం చమత్కరం కోసం ఉపయోగించిందేతప్ప చర్చకోసం కాదు. అర్జునుడు వెలువరించిన అభ్యంతరాలనీ స్త్రీలు దూషితులైతే వర్ణసంకరమవుతుందని అర్జునుని బాధ. కానీ కృష్ణుడు దానిని ఖండించి నెను లేక నా స్వరూపంలో స్థితుడైవున్నమహాపురుషుడు ఆరాధనాక్రమంలో భ్రమను ఉత్పన్నంచేస్తే అప్పుడు వర్ణసంకరమవుతుంది అన్నాడు.
రిప్లయితొలగించండిఅర్జునుడు తాను సామాన్య జ్ఞాత అనుకోలేదు సాధనలో పతి వారూ అలానే అనుకుంటారు.కులధర్మమే సనాతనధర్మమని కులస్త్రీలు దూషితులౌతారు వర్ణసంకరం జరుగుతుంది. కులఘాతకులు అనంతకాలం నరకంలో మిగిలిపోతారు. నేనీ యుధ్ధం చేయను అని అర్జునుని నిర్వేదం.
కులధర్మమే సత్యమైనదైతే అదే స్వర్గానికీ కళ్యాణానికీ సాధనం అయివుండేది.కనీసం అది కీర్తిదాయకం కూడాకాదు.
మీరాను లోకం పిచ్చిదంది.అత్త కులనాశిని అంది. కానీ మీరాను గుర్తుపెట్టుకున్న లోకం ఆమె అత్తను మరిచిపోయింది అదే కృష్ణుడు చెప్పింది.
మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.