7 అక్టో, 2011


    మహాయోగి అరవిందులు గొప్ప విద్యావేత్త. 

భారత జాతీయోద్యమంలో పాల్గొన్న 

స్వాతంత్య్ర సమర నేత. 

క్రమంగారాజకీయాలనుంచినిష్క్రమించి తత్త్వానే్వషకులై పాండిచేరిలో 

తమదైన రీతిలో ఆశ్రమం నెలకొల్పారు.

  ‘నా జన్మదినంనాడే నా మాతృ దేశానికి స్వరాజ్యం లభించడంనాకుభగవంతుడందచేసిన జన్మదినకానుక’ అన్నారు అరవిందులు.

అరవిందులు మానవుడినుంచి దివ్యమానవుడు 

వెలువడవలసినఅవసరముందని,ప్రపంచ మానవులంతా శాంతి సామరస్యాలతో విలసిల్లగలరని విశ్వసించిన మహాద్రష్ట. 

భారతదేశంనుంచి విశ్వమానవాళికి 

వినూత్న సందేశమందజేశారు.

  శ్రీరామకృష్ణ పరమహంసలకు దైవదత్తమైన 


శిష్యుడుగాఅవతరించాడు స్వామి వివేకానంద. 


ఆవిధంగానే శ్రీఅరవిందయోగి ఆశించిన వసుధైక 


కుటుంబ సృష్టికోసం జన్మించిన మహా యోగిని శ్రీమాత.

  శ్రీమాత 1878 ఫిబ్రవరి 21వ తేదీన పారిస్‌లో జన్మించారు. 

తల్లిదండ్రులుఆమెకు‘మిర్రాఆల్ఫాసా’అని 

నామకరణంచేసారు.

 బాల్యంలోనేఅంతర్ముఖీనురాలుగా వుండేది. 

బాలికగాఆమెఆటపాటలలోపాల్గొనకుండా

 ఏదో ఆలోచనలో వుండేది. 

క్రమంగాఆమెకుఅంతరంగానుభూతులు కలుగుతుండేవి. 

ఆకలితో,రోగాలతో మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఆమె సన్నిధి చేరి ఉపశమనం పొందేవారు.

 ఎందరో మహనీయులు 


ఆమెకు కలలో కన్పించేవారు. 


వారిలో


ఒకరిపట్ల ఆమెకు భక్తి కలిగింది.

 

1914 మార్చి 29వ తేదీన భర్త, తత్త్వవేత్త అయిన 

పాల్ రిచర్డ్‌తోపాటు పాండిచేరిలో 

శ్రీ అరవిందులను దర్శించింది. 

 

తనకు కలలో కన్పించిన మహానుభావుడితడే 

అని నిశ్చయించుకొన్నది. 

తాను నిర్మించదలచుకొన్న ప్రపంచానే్న 

అరవిందులు కూడా నిర్మించాలని ఆశిస్తున్నట్లు 

ఆమె గుర్తించింది. 

 

ఆయన సన్నిధిలోనే వుండాలని 

నిశ్చయించుకొన్నది.

ఆ తర్వాత 

ఒక సంవత్సరం పాండిచేరిలోనే 

అరవిందుల సన్నిధిలో వుండి, 

ప్రథమ ప్రపంచ యుద్ధ కారణంగా 

భర్తతో కలసి పారిస్ వెళ్లింది. 

 

1916లో జపాన్‌లో పర్యటించింది. 

అక్కడ రవీంద్ర కవిని కలుసుకొన్నది. 

ఆమె అసాధారణ ప్రజ్ఞను గమనించిన రవీంద్రులు భారతదేశానికి వచ్చి తాను ప్రారంభించిన ‘శాంతినికేతన్’ సంస్థను నిర్వహించమని కోరారు. 

 

రవీంద్రుల ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి భారతదేశం చేరి శ్రీ అరవిందుల సన్నిధిలో చేరింది.

 

అరవిందాశ్రమంలో

 1920 ఏప్రిల్ 24న శ్రీ అరవిందులనుకలుసుకొన్నది. 

 

ఒకనాడు భయంకరమైన తుపానువల్ల 

ఆమె వుంటున్న వసతి గృహం కూలిపోయింది.

 శ్రీఅరవిందులుంటున్నబంగళాలోనేస్థిరంగా వుండిపోయింది.

1926 నవంబర్ 24న అరవిందులు 

తమ తపస్సులో ఒక ప్రధాన ఘట్టం చేరారు.

 

 శ్రీకృష్ణుని దివ్య శక్తి వారితో ఏకమైంది. 

ఆరోజునే సిద్ధిదినమంటారు. 

ఆ సిద్ధినిచేరుకొని పరిణామక్రమంలో 

మానవజీవితాన్ని దివ్య జీవితంగా మార్చడంకోసం, అవసరమైన అతి మానస అవతరణకోసం 

అరవిందులు ఏకాంతవాసంలోకి వెళ్లారు. 

యోగ నిమగ్నులైన అరవిందులు 

 

కొన్ని ముఖ్యమైన దినములనాడే 

శిష్యులకుదర్శనమిచ్చేవారు. 

ఆశ్రమ నిర్వహణ బాధ్యతను 

యోగిని మిర్రా మాతాజీ స్వీకరించింది. 

 

అరవిందుల యోగశక్తి 

శ్రీమాతలో సాక్షాత్కరించింది. 

 

తమ నివాసమును 

శ్రీ అరవిందాశ్రమంగారూపొందించింది.

 అరవిందులు, విశ్వామిత్రుని వంటి వాడన్నారు 

 

పుట్టపర్తి నారాయణాచార్యులు. 

 

విశ్వామిత్రుడు త్రిపాన గాయత్రిని సృష్టించినట్లే 

 

అరవిందులు భాగవత జీవన విధానమును 

 

నిర్ణయించిరి. 

 

డార్విన్ పరిణామవాదాన్ని తీసుకొని 

 

అరవిందులు అలౌకిక మొనర్చారన్నారు. 

 

వైయక్తిక ముక్తిని నిరసించి 

 

జగత్తునే దివ్యముగ మార్చుటకు యత్నించిన 

 

విప్లవ యోగీశ్వరుడు అరవిందులు 

 

అన్నారు పుట్టపర్తివారు.


ఈ దివ్య జీవితం ఉనికిలోనికి వచ్చినప్పుడే వసుధైక 

 

కుటుంబం అవతరిస్తుంది అన్నారు 

 

మహాయోగిని మాతాజీ. 

 

నేడు అరవిందాశ్రమంలో అన్ని మతాలవారు 

 

అన్ని దేశాలవారు, 

 

విభిన్న భాషా సంస్కృతులకు చెందినవారు 

 

శాంతిసామరస్యాలతో నియమబద్ధంగా జీవిస్తున్నారు. 

 

వ్యక్తిఅవసరాలనుఆశ్రమమేచూచుకొంటున్నది. 

 

వసుధైక కుటుంబం అరవిందుల ఆశయం. 

 

అరవిందుల సంకల్పాన్ని 

 

సాకారం చేసిన శ్రీమాత 

 

తన 95వ ఏట 17 నవంబర్ 1973లో 

 

తమ పార్ధివ శరీరం వదలి 

 

పరలోకం ప్రవేశించారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోతిరుపతి, హైదరాబాద్ ప్రొద్దుటూరు, 

 

తెనాలి వంటి పట్టణాలలో 

 

అరవింద విద్యాలయాలు వెలిశాయి.

Share:

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి