1 జన, 2013

సూరనాడ్ కుంజన్ పిళ్ళైతిరువాన్ కూరులో 
మళయాళ నిఘంటు నిర్మాణం చేస్తున్నవేళ
ఆ భాషతో మమేకమైఎన్నో మళయాళ నాటికలను తెలుగు లోకి అనువదించారు పుట్టపర్తి
బూర్గుల రామకృష్ణరావు గారి కోరికపై 

విశ్వనాధ వేయిపడగలనూ అక్కడి ప్రజలకు పరిచయం చేసి 
తెలుగు కమ్మదనాన్ని రుచిచూపారు పుట్టపర్తి
అక్కడి సహోద్యోగుల వైఖరి నచ్చక వెళ్ళిపోదామనుకొంటే
అక్కడి యూనివర్సిటీ అధికారి 

సూరనాడ్ కుంజన్ పిళ్ళై
మిమ్మల్ని ఆంధ్ర ప్రజ గుర్తించలేదు
మేము మిమ్మల్ని 

కేంద్ర సాహిత్య అకాడమీకి యూనివర్సిటీ తరుఫున 
పంపుతామని చెప్పారు
ఢిల్లీలో కె ఆర్ కృపలానీ మదన్ మోహన్ మాలవ్యా దినకర్
పంత్ మహదేవి వర్మ వంటి దిగ్గజాలతో 

పరిచయం స్నేహం గాఢమయ్యాయి
శివతాండవ గానాన్ని మైమరచి విన్నారంతా
వారి సాంగత్యంలో వ్రజ అవధీ భాషలు ఆచార్యుల వారికి మరింత దగ్గరయ్యాయి
ప్రాకృత భాషలలో పరిశోధన ఎంతో ఇష్టం గా చేసారు పుట్టపర్తి


వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి