
సాహితీ స్రష్ట పుట్టపర్తి
పుట్టపర్తి నారాయణచార్యులు అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో 1914 సం|| మార్చి 28వ తేదీన శ్రీనివాసాచార్యులు, కొండమ్మ దంపతులకు జన్మించారు. పెనుగొండలో మూడవఫారము వరకు విద్యనభ్యసించి, ఆ తరువాత తిరుపతి సంస్కృత కళాశాలలో, తర్కవ్యాకరణాలంకారములు అభ్యసించారు. తన 12వ యేటనే, పెనుగొండ-విజయనగర సామ్రాజ్య వైభవాన్ని వర్ణిస్తూ'' పెనుగొండలకిë'' కావ్యాన్ని రచించారు.
మూడు దశాబ్దాలపాటు రాయలసీమలోని కడప, ప్రొద్దుటూరు హైస్కూళ్ళలోను, అనంత పురం కళాశాలలోనూ- ఆంధ్ర పండితులుగా పనిచేశారు. కేరళ విశ్వవిద్యాలయం వారిచే ఆహ్వానింపబడి, తిరువాన్కూరు విశ్వవిద్యా లయంలో 'ఎటిమలాజికల్ డిక్షనరీ'లో నాలుగేం డ్లు భాషా పరిశోధకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ వారి గ్రంథాలయం, న్యూఢిల్లీ లో లైబ్రేరియన్‌గా ఒక సంవత్సరం పాటు పనిచేసే సదవకాశం వారికి లభించింది. కన్నడ విజ్ఞాన సర్వస్వకార్యస్థానంలో కొంతకాలం పనిచేశారు.
పుట్టపర్తి రచించిన గ్రంథాలు నూట ఇరవైకి పైగా ఉన్నవి. వారి పద్యకావ్యాలలో పెనుగొండ లకీë, షాజీ, సిపాయి పితూరీ, సాక్షాత్కారం, పాద్యం, గాంధీజీ మహా ప్రస్థానం, పేర్కొన దగినవి. గద్యకావ్యములలో- ప్రబంధ నాయకులు, రామకృష్ణుని రచనా వైఖరి, తెలుగు తీరులు, మహాభాగవతోపన్యాసములు, విజయ నగర సామాజిక చరిత్ర, మహాభారత విమర్శ నము, వ్యాసవాల్మీకం, ప్రాకృత వ్యాసములు, ఆంధ్ర మహాకవులు మున్నగునవి పేర్కొనదగినవి. గేయకావ్యములలో అగ్నివీణ, పురోగ మనము, మేఘదూతము, శివతాండవం, పేర్కొనదగినవి.
అనువాదకులుగా కూడా పుట్టపర్తివారు కడు ప్రసిద్ధులు. వాల్మీకి రామాయణాన్ని 'రామకథ' యను పేరుతో-తెనుగు వచనముగా ప్రచురిం చారు. వ్యాస సంస్కృత భాగవతం- దశమస్కం ధాన్ని- ఆంగ్లంలోకి అనువదించారు విశ్వనాధ వారి 'ఏకవీర నవలను మళయాళంలో నికి అనువదించారు. మరాఠీ నుండి, 'స్వర్ణ పత్రము లు'- 'భగవాన్ బుద్ధ'- ఆంధ్రీకరణ కాబడిన కొన్నిగ్రంథాలు. కన్నడము నుండి 'సరస్వతీ సంహారం' వంటి నవలలనెన్నింటినో ఆంధ్రీకరిం చారు. హిందీలో ప్రసిద్ధమైన 'కబీరు వచనావళి'ని కేంద్ర సాహిత్య అకాడెమి వారి కోరికపై అను వదించారు. శ్రీ అరవిందుల ఆంగ్ల గ్రంథములను కొన్నింటిని ఆంధ్రీకరించారు.
ఆంగ్లంలో వారు ప్రచురించిన 'కవితా సంపుటి' ఁూవaఙవర ×అ ుష్ట్రవ ఔఱఅసఁకి- శ్రీ హరీంద్రనాధ చటోపాధ్యాయ పీఠిక వ్రాసి ప్రశంసించారు. ఃనవతీశీః అన్న ఆంగ్ల నాటకం వారికి మంచి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. 'శివతాండవము' పుట్టపర్తి సాహితీ సర్వస్వమని చెప్పవచ్చును. సంగీత సాహిత్య నాట్యాసంకేతము లు సమపాళంగా మేళవించబడ్డ అమర ప్రయాగ ఆ కావ్యం. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి గేయకృతి ఇంకొకటి లేనంత హాయిగా పాడారు. శ్రీ పుట్టపర్తివారిని ఉత్తమదేశికునిగా గుర్తించి 1968లో రాష్ట్రపతి అవార్డు పొందారు. 1972 సం|| పద్మశ్రీ బిరుదము ఆయనను వలచి వచ్చినది. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ వారు, వారికి డాక్టరేట్ బిరుదు అందజేశారు. గజారోహణ, కనకాభిషేక, గౌరవాలు అనేకం వారు పొందారు. వీరి వైదుష్యమును, కవిత్వమును స్వయముగా గమనించిన శ్రీ స్వామి శివానంద సరస్వతులవారు 'సరస్వతీపుత్ర'- బిరుదమును ఆశీఃపురస్సరముగా అనుగ్రహించినారు. అదియే ఆనాటి నుండి వారికి అన్వర్ధ నామధేయమైనది. పుట్టపర్తి గారి సతీమణి కనకమ్మ గారు సంస్కృతాంధ్ర పండితురాలు. గొప్ప కవయిత్రి. పుట్టపర్తివారి సంస్కృతా రచనలలో శివకర్ణా మృతం పేర్కొనదగినది. పుట్టపర్తి వారి నాలుగవ కుమార్తె డా|| పుట్టపర్తి నాగపద్మిని గారు 'శివకర్ణా మృతం' కావ్యాన్ని ఆచార్య శ్రీ లక్ష్మణమూర్తి గారి ఆంధ్రానువాదంతో ప్రచురించి ఆంధ్రుల ప్రశంసలు చూరగొన్నారు. ఇంకా 'మల్లిఖార్జున సుప్రభాతం' 'త్యాగరాజ సుప్రభాతం' సంస్కృత రచనల్లో పేర్కొనదగినవి.ఇటీవల డా|| పుట్టపర్తి నాగపద్మిని గారు రచించిన 'భాషాపరశేషభోగి'- ''పుట్టపర్తి''- అన్న పుట్టపర్తి వారి జీవిత- సాహిత్యాల సమీక్షను- హైదరాబాద్‌లోని సి.పి.బ్రౌన్ అకాడమీ వారు ప్రచురించారు.ఆధునికాంధ్ర సాహిత్యాకాశంలో పుట్టపర్తివారు ఒక ధృవతార. శతాధిక రచయిత, మహాకవి. ఆరుద్రగారన్నట్లు ''రాయలసీమలోని రాళ్ళను చీల్చుకొని వచ్చిన మహాసాహితీ వటవృక్షం'', వారు. ఆ మాటలు అక్షరాలా నిజం!!
- రామవఝల శ్రీశైలం
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి