19 నవం, 2012

మా నాయన మీ నాయన యేనాడో గురువు శిష్యులీ బంధముతో                                   


నేనీ మధ్య 
డా. రేవూరి అనంత పద్మనాభరావు గారు 
కడప ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ (రిఠైర్డ్)

కొమండూరి శేషాద్రి గారు 
ప్రముఖ వయొలినిస్ట్

ఇంకా
పుట్టపర్తి వారి జనప్రియ రామాయణం పై పరిశోధన చేసిన శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్లతో
సంభాషించాను
అందరూ చక్కని విశేషాలు చెప్పారు
అద్భుతమైన అనుభవాలను ముచ్చటించారు
మంచి ఆదరాన్ని చూపారు

ఆనాళ్ళలో పుట్టపర్తి వారి
జనప్రియ రామాయణాన్ని 
నాటి కలెక్టర్ సంజీవరెడ్డి గారు
ముద్రించడానికి సహాయమందించి
పుట్టపర్తి వారి షష్టిపూర్తి మహోత్సవాన్ని
కనులపండువగా 
ప్రముఖులందరితో కలిసి జరిగేలా చూసారు.

కారణం
సంజీవ రెడ్డి గారి తండ్రిగారయిన   
శ్రీ పైడి లక్ష్మయ్య గారు
పుట్టపర్తి వారి తండ్రిగారయిన 
పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారి దగ్గర
శిష్యరికం చేసారట..

ఆనాటి అభిమానంతో
గురుపుత్రులనే ప్రేమతో
లక్ష్మయ్య గారి కొడుకైన సంజీవరెడ్డిగారితో
పుట్టపర్తి వారికి తగిన సహాయ మందేలా చూసారు

సంజీవ రెడ్డిగారుకూడా 
తన తండ్రి గారి మాటను మన్నించి
పుట్టపర్తి వారి యెడల ఎంతో గౌరవ మర్యాదలను చూపటం సంతోషకరమైన విషయం 

సంజీవ రెడ్డి గారినీ ఇంటర్వ్యూ చేద్దామని
వారి నంబరుకు ఒకసారి కాంటాక్ట్ చేసాను
నిద్రపోతున్నారు నాలుగ్గంటలకు చేయమని వారి మనుమరాలు కాబోలు చెప్పారు
నాలుగ్గంటలకు నేను మరిచే పోయాను


ఇంటిపని బ్లాగు పని పూజ వీనితో
కొంత మరుపుకు పడ్డ ఆ విషయం 
మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొనే లోగా
ఒక పిడుగు లాంటి వార్త

విజయదశమినాడు పూజ చేసుకుంటూ
పేపరులో పోసిన పూలను పళ్ళెంలోకి వంపుకుంటూండగా
సంజీవ రెడ్డి గారి ఫోటో పేపరులో కనిపించింది.


సంజీవ రెడ్డి గారు దివంగతులై అయిదురోజులయింది
నాకు కలిగిన షాక్ కు అంతులేదు

జగమంతా శూన్యమైనట్లు అనిపించింది
జనప్రియ రామాయణం పీఠికలో పుట్టపర్తి వారు
ఆ తండ్రీ కొడుకులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ
వ్రాసినవీ పద్యాలు 
మీరూ చదవండి..ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమ శేఖ
రంబైన యభయ హస్తంబు మాది..
ఒకనాడు గీర్దేవతా కమ్ర కంకణ
స్వనమైన మాధురీ ప్రతిభ మాది..
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుధ్ధికే
చదువు నేర్పినది వంశమ్ము మాది..
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెంగొండ మాది..

గీ. తల్లిదండ్రుల మేధ విద్యానిషద్య

    పాండితీ శోభ పదునాల్గు భాషలందు
    బ్రదుకునకు బడిపంతులు, భాగ్యములకు 
    చీడవట్టిన రాయలసీమ మాది

మ. ఒక నీలాంబుద మేడు కొండలకు పై నుద్యత్కృపావర్షణో

త్సుకమై యున్నది తద్దయా వికసి తాస్తోక క్రియాశీలినై
సకలామోది యశోభిపరిత శ్చారిత్రమై,జీవితం
బకలంకం బగు నాయువై నెగుడుమన్నా కృష్ణరాయాభిధా..!!

మ. గురుపుత్రుండనుటొక్క బాంధవమె నీకున్నాకు తల్లేశమీ

కరణిన్ నేటి వసంతమై పిక కుహూకారంబుగా మఛ్చిరో 
పరిపుష్టాక్త కిరీటమున్ నిలిపెనప్పా పైడి లక్ష్మయ్య నీ
సరసంబైన హృదంతరమునకు శశ్వద్భక్తి చెల్లించెదన్..!

మ. అధికారుల్ గలరెందరో ముఖరగర్వాయత్తు లీ కాలమం

దధిరోహింతురు గద్దె డుల్లెదరు సమ్యగ్యోగ్యతా గౌరవా
స్పద చిత్తంబున విచ్చికొంటి నను పో సంజీవరెడ్డి ..!సదా
భ్యుదయంబుల్ గుసుమించి జీవనము నిన్నోమున్ పురాపుణ్యమై!


కం. మా నాయన మీ నాయన

      యేనాడో గురువు శిష్యులీ బంధముతో
      నీ నిండు మనసునిచ్చితి 
      నేనెఱి  బోద్రోసికొందు నీ యీ ఋణమున్..:!

మ. రస సామ్రాజ్య ముదార రామకథ నీ ప్రత్య   ప్రయత్నంబుకై

వలమై తెంగున నేలలన్ దిరుగు భాస్వద్విద్వదాస్థాన కీ
ర్తి సమున్మేషము, పేర్ల వంశపు శివారెడ్డీ!భవచ్చిత్త వీ
ధి సుమించె న్నొకనాటి రెడ్డికుల నీతి త్యాగ విస్మేరముల్..!

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి