కానీ సంపాదించని వాడైనా కోట్లు గడించే వాడైనా
ఏవేవో లోపాలు పెళ్ళాలకు కనిపిస్తాయ్
చీరలు కొనిపెట్టలేదని పేదవాడిపెళ్ళాం ఏడిస్తే
కట్టిన చీర గురించీ తన అందం గురించీ కాంప్లిమెంట్ ఇవ్వలేదని ఈవిడేడుస్తుంటుంది
వాడికి పనిలేదు
వీడికి టైం లేదు..
అన్నీ అమర్చే పెళ్ళామైనా తప్పులకోసం భూతద్దం పట్టుకుంటాడు ఒక మగడు
అసలు గొడవ పడని ఆలుమగలు వుండరేమో
మా ఇంట్లో గొడవలకు రాముడు కృష్ణుడు కారణం అవుతుంటారు
అమ్మకు రామాయణం
అయ్యకు భాగవతం
చూశారా ఆలుమగల మధ్య అవతారపురుషుల లీలలు
ఇంట్లో అన్నీ చూసుకుని అందరి అవసరాలు తీర్చి
అయ్య రాతకోత లలో ఒక చేయి వేసి
అమ్మ పారాయణం కూడా చేసుకుంటే
కోపం ముక్కుమీద నాట్యమాడే అయ్యకు
అమ్మ పై మాట మాటకూ కోపం..
మా అయ్య కోపం తాటాకు మంట అయితే ..
అమ్మఎప్పుడూ శాంతంగా చిరునవ్వుతో వుండేది ..
ఇలా ఒకసారి యేదో విషయానికి
అయ్య కోపంతో
'వాడు కాదే రాముడు .. వీడు .. '
అని బిగ్గరగా అరుస్తూ.. విసురుగా బయటికి వెళ్ళి
అప్పుడే వీధిలో బిక్షం అడుక్కుంటూ వచ్చి
మా ఇంటి ముందు నిలబడిన ఒక బిచ్చగాడిని భుజం పట్టి తీసుకొచ్చి ..
ఇంట్లో పీటవేసి వెండి తట్టలో దేవుని కోసంచేసిన ప్రసాదాన్ని
ఇతర పదార్థాలను వేసి తినిపించి శాంతించారు..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి