21 నవం, 2012

తెలుగు అకాడమీ,హైదరాబాద్ప్రివ్యూ

'ఏమానందము భూమీతలమున 'అంటూ
అనేక వేల సభావేదికలపై నుండి
అపూర్వంగా
ఆపాతమధురంగా
జలపాతంలా
గంభీరంగా
గానం చేసిన గళం
పుంభావ సరస్వతి
సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారిది.
ఆయన గళాన్ని
మళ్ళీ ఈ యుగంలో మనం వినం.
పదునాలుగుభాషలలో పండితుడు.
తాలోత్తాలమైన ప్రతిభా సంపన్నుడు,
శేఖరీభూతమైన శేముషీ దురంధరుడు
అయిన మహాకవిని మళ్ళీ ఏ శకంలోనూ మనం కనం.
ఆయన ఈ శతాబ్దిలో వెలుగొందిన
ఒక మహోజ్వల తేజం.
ఎంతటి పండితులో
అంతటి కవులు.
ఉత్తమ విమర్శకులు
ప్రాచీనాంధ్రకవుల శిల్ప రహస్యాలను చెరిగి రాశి పోసిన
గొప్ప వక్త.
అన్నిటికన్నా
మానవతా విలువలతో
 మహనీయంగా
 జీవితాన్ని గొప్పగా అనుభవించిన భోక్త.

తెలుగు అకాడమీ,హైదరాబాద్.

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి