30 అక్టో, 2013

పుట్టపర్తి బాల్యం



‹''ఓయమ్మ నీ కుమారుడు. మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా. పోయెద మెక్కడి కైనను. మాయన్నల సురభులాన మంజులవాణీ.. (పోతనామాత్యుడు..) 

భాగవతంలో ప్రతి ఒక్కటీ అద్భుతమే..
కృష్ణుని బాల్య క్రీడలు
ఎప్పుడు తలుచుకున్నా 

చక్కని చిరునవ్వు ప్రతివారిముఖంపై నాట్యం చేస్తుంది..
 

 పాలూ పెరుగూ వదలడు
వెన్న కోసం పిల్లలందరితో దొంగతనాలు చేస్తాడు
కోడలి మూతికి వెన్నపూసి 

అత్తాకోడళ్ళ తగవుకు కారణ మౌతాడు..
అమ్మా  
నీ కొడుకు అల్లరి భరించలేకుండా వున్నాం 
పాలూ పెరుగూ బతకనియ్యటం లేదు..
ఇది ఇలాగే కొనసాగితే 

మేం మా పిల్లాపాపలతో ఎక్కడికైనా వెళ్ళిపోతాం
అని మొరపెట్టుకున్నారు గొల్లభామలు   . 
 
దశావతారాలలో శ్రీకృష్ణావతారానికి 
ఎంతో ప్రాధాన్యత వుంది. 
కృష్ణుడి బాల్య క్రీడల నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకూ 
ప్రతి ఘట్టం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది.
 జగన్నాటక సూత్రధారి అనిపించుకున్న కృష్ణుడు, నిత్య చైతన్య మూర్తిలానే 
నాటి ప్రజలకు ... నేటి భక్తులకు దర్శనమిస్తూ వచ్చాడు. 
ఆయన ఏ పేరుతో ఎక్కడ ఆవిర్భవించినా భక్తులు సేవిస్తూ ... స్మరిస్తూ ... తరిస్తూనే వున్నారు.

 ప్రతి ఒక్కరికీ వారి బాల్యం ఒక మధుర స్మృతి, 
కానీ పుట్టపర్తి బాల్యంలోనే తేరుకోలేని విషాదం.
 తల్లిని కోల్పోవటం. 
ప్రేమనీ ఆప్యాయతనీ త్యాగాన్నీ ఇచ్చే ఒక అమృత కలశాన్ని 
పుట్టపర్తి పెదవుల దగ్గరినుంచీ బలవంతంగా లాక్కున్నాడా పరమాత్మ
అయిదేళ్ళ ..

పాలు మరిచే ప్రాయంలో తల్లినే పుట్టపర్తి కోల్పోయారు
 

అందుకే పుట్టపర్తి విపరీతమైన అల్లరి పిల్లాడు
 మా అయ్య అల్లరిని ఆయన నోటి వెంట మేమెన్నో సార్లు విన్నాం
జనప్రియ రామాయణంలో మా అయ్యగారే వివరించారు
ఇంకా బ్రౌన్ అకాడమీ వారు ప్రచురించిన్ భాషాపరశేషభోగి లో
 

ఆనాటి పరిస్థితులూ వాతావరణం..
కొండ చిలువలు, నెమళ్ళూ జింకలూ పావురాలూ..
నిండిన పెనుగొండ కొండ..
చిత్రావతి నది అందాలు అవి పుట్టపర్తిని అలరించిన వైనం..
ఇదిగో చదవండి..


 పదేళ్ళ పిల్లోడొకడు పది మంది పిల్లకాయలనేసుకొని ఒక తోటలో దూరాదో మధ్యాన్నం
తోట కావలికున్న వాడు గుర్రు పెట్టి నిద్ర పోతున్నాడు..
అందరూ జారిపోతున్న నిక్కర్లను పైకి లాక్కుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు..
మెల్లగా పిల్లి మాదిరి తోటలో జొరబడ్డారు...
మామిడి తోట..
తోటంతా కలయజూశాడొకడు..
నలుగురైదుగురు చెట్లపైకెగబాకారు..
వెంటనే విధ్వంసం మొదలైంది
కాయలు తెంపటం
కొరకటం నేలకేసి కొట్టడం..
ఒరేయ్ రమణా ఈ కాయ బాగుంది రోయ్ ఇంద అంటూ వాణి కేసి విసిరాడు..
నువ్విది తీసుకోరా.. వాడూ వీణికో కాయ విసిరాడు
ఒరేయ్ తొందరగా కానీండ్రా వాడొచ్చేస్తాడు..
పది నిమిషాల్లో దాదాపు తోటంతా ఖాళీ..
నేలపైనంతా మామిడి కాయలే..
అందరూ చెట్ల నుంచీ దిగారు
కలిసి కాయలు సంచీ కెత్తారు..
చస్తూ పడుతూ మోసుకుంటూ..వస్తున్నాడొకడు..
అందరూ బయటికొస్తూ..
ఇంకా నిద్రపోతున్న కావలి వాడిని చూసారు
కాయలు మోస్తున్న వాడు పరిగెత్తాడు..
పిల్లల నాయకుడు.. ఒక గడ్డి పరక తీసుకొని కావలోడి దగ్గరికి పోయినాడు
పుల్లతో వాడి చెంపపై రాశాడు
ఛీ పాడు చీకటీగలు..
పగలూ నిద్ర ల్యా..
రాత్రీ ల్యా..
చెంపపై ఠాప్ మని కొట్టుకున్నాడు వాడు
మళ్ళీ రాశాడు
ఈసారి వాడు తుమ్మాడు..
అందరూ కిల కిల నవ్వారు..
ఒరేయ్ వద్దురా..అంటున్నాడొకడు భయంగా..
వాడు ఠక్కున కళ్ళు తెరిచాడు
జరిగింది అర్థమైంది వాణికి, 

కారణం ఇది మొదటి సారి కాదు ఇలా జరగటం
వెంటనే ఆ పిల్లోణ్ణి పట్టుకున్నాడు
వెంటనే ఒరేయ్ దొంగ నాయాళ్ళారా..
కాయలన్నీ తెంపేసినారా.. తోటంతా గబ్బు గబ్బు చేసినారా..
ఉండు నీ పని చెప్తా..
వాడి పట్టులో వున్న పిల్లోడు.. 

తన చేతిలో నున్న కాయతో బలంగా వాడి ముక్కుపై కొట్టాడు..
అమ్మా..
అయ్యోయ్.. వాడు ముక్కు పట్టుకున్నాడు..
పట్టులో పిల్లోడు జారిపొయాడు..
అందరూ పరుగందుకున్నారు..
ఒరేయ్ మమ్మల్ని పట్కోడం నీ చేతకాదురా..
వెనక్కి తిరిగి చూసుకుంటూ పరిగెత్తుతూ ఒక్కోకాయా విసురుతున్నాడొకడు..
ఒరేయ్ నారాయణా ఈ కాయలనేం చేస్తాం..
అన్నాడొకడు..
పుట్టపర్తి నారాయణ ఆలోచించాడు
మొన్న ఒకడు వాడి అరటి తోట నాశనం చేశారని 

ఇంటికి వచ్చి అన్న మాటలు మెదిలాయ్
ఇగో సామీ 

నీ పెండ్లాం చచ్చిపోతే ఇంగో పెండ్లి చేసుకో 
పెండ్లైతే  నీ పెండ్లామే నీ కొడుకు సంగతి చూసుకుంటాది..
ల్యాకపోతే వాణ్ణి సావగొట్టు..
అంతేగానీ 

నీ కొడుకును మాపై వదలాకు నీకు దండం పెడ్తా.. 
వాడితో మేం సావలేం ..
కొంచం భయమేసింది
ఆ కాయల గోనెను  కాలవలో పారేశాడు..
ఒరేయ్ ఒరేయ్ ఎందుకురా నీళ్ళలో యేసినావ్..
అన్నాడొకడు..
పాండిరా .. పెనుగొండ కొండపైకి పోదాం..
అంతే అందరూ కొండపైకి చేరారు..
అక్కడ...

కొండచిలువలు.. 
నెమళ్ళు.. 
జింకలు.. 
పావురాలు .. 
ఇంకా ఎన్నో..
అక్కడే వీరి ఆట పాటలు..
సాము గరిడీలు ,కుస్తీ లు, దండీలు వీరి ఆసక్తులు.
















 

27 అక్టో, 2013

పురోగమనము పుట్టపర్తి కవితా ఖండిక లో లభ్యమైన పుట్టపర్తి ఫోటో

"పురోగమనము" పుట్టపర్తి గేయ సంపుటి    లో లభ్యమైన (10.06.1951) పుట్టపర్తి ఫోటో


23 అక్టో, 2013

కిన్నెర అర్ట్స్ థీయేటర్స్ వారి నిర్వహణలో "పుట్టపర్తి శత జయంతి ఉత్సవం"



కిన్నెర అర్ట్స్ థీయేటర్స్ వారి నిర్వహణలో 
మద్దాళి రఘు గారి అధ్వర్యంలో  
"పుట్టపర్తి శత జయంతి ఉత్సవం"
ఈ రోజు సాయంత్రం 5'30 కు రవీంద్రభారతిలో
అవకాశం ఆసక్తి ఉన్నవారు రావచ్చు..
వివరాలివి..

Dr.మేడసాని మోహన్
గారికి  

"పుట్టపర్తి నారాయణ చార్యుల అవార్డు'' పురస్కారం
అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి గారు
(ఉపకులపతి పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ)
విశిష్ట అతిధి  :డా. రాళ్ళబండి కవితా ప్రసాద్
గారు

( సంచాలకులు ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ)
ఆత్మీయ అతిధి  S.అక్కినేని కొండల రావ్
గారు 

(అక్కినేని నాటక కళా పరిషద్)
ముఖ్య అతిధి : B.చంద్రకుమార్
గారు 

ప్రత్యేక అతిధి  :డా. పుట్టపర్తి నాగపద్మిని గారు 
ప్రత్యేక ఆకర్షణ ..పుట్టపర్తి అద్భుత రచన "శివతాండవం"
 కూచిపూడి నృత్య రూపకం
దర్శకత్వం డా.అనుపమా కైలాశ్
గారు


22 అక్టో, 2013

చిత్రమైన లంచం ..



లంచం ఇవ్వటం పుచ్చుకోవటం ఎక్కడైనా నేరమేనట
మరి అలాంటి నేరం చేసిన వ్యక్తినేం చేయాలి
పుట్టపర్తి వారు ఆ నేరం చేసారు..
ఎందుకో తెలుసా..
ముందు చదవండి ఇది
తరువాత శిక్ష గురించి ఆలోచిద్దాం
అది 1952 వ సంవత్సరం

కాశీలో తులసీ ఘాట్ అనే దగ్గర
తులసీదాసు పాదుకలు ఉన్నాయట
అవి దర్శించాలని పుట్టపర్తి కోరిక
కానీ 

అక్కడి పూజారి యెవ్వరినీ ముట్టుకోనివ్వమని చెప్పాడు
తులసికి అపర భక్తుడైన పుట్టపర్తికి 

వానిని ఒక్కసారి స్పృశించి కళ్ళకద్దుకోవాలని ఆశ
కాశీ లో తెలియని అశాంతితో తచ్చాడుతున్న పుట్టపర్తి మనసులో 

ఒక ఆలోచన
వెంటనే ముఖంలో కొత్త ఉత్సాహం..
అర్ధరాత్రి
తులసీ ఘాట్ .
మందిరంలో పుట్టపర్తి 

పళ్ళెంలో తులసీ దాసు పాదుకలతో
పూజారి గర్భగుడిలోంచీ బైటికి బైటికి వచ్చాడు
పరవశించి పోయారు
పుట్టపర్తి
తీవ్ర భావావేశంతో కంపిస్తున్న శరీరం
ఆ పాదుకలను మైమరపుతో స్పృశించి వానికి 

తన నుదుటిని తాకించారు
కళ్ళకద్దుకున్నారు 

కనుల నుంచీ స్రవిస్తున్న భాష్ప ధారలు 
తులసి పాదుకలను చేరి ధన్యమయ్యాయి
తొందరించాడు పూజారి ఇక చాలించమని
బలవంతంగా పాదుకలను దూరం పెట్టాడు
చేయి జాపాడు
పుట్టపర్తి జుబ్బా జోబీనుంచీ అయిదు రూపాయలు తీసి 

ఆ పూజారి చేతిలో పెట్టారు
పూజారి వాటినందుకొని  పాదుకలతో అదృశ్యమయ్యాడు
భారమైన మనసుతో అలానే నిలుచుండిపోయారు పుట్టపర్తి

21 అక్టో, 2013

సరస్వతీపుత్రుని సాహితీ వ్యక్తిత్వం..http://www.andhrabhoomi.net/node/111552

 

 

శశిశ్రీ వ్రాసిన పుట్టపర్తి మోనోగ్రఫీ పుట్టపర్తి నారయణాచార్య ను కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించింది
దానిపై ద్వానాశాస్త్రి  గారి సమీక్ష ఇది
ఆంధ్ర భూమి . నెట్ లో లభించింది

శశిశ్రీ ఆయన పద్దెనిమిది ఏళ్ళప్పటినుంచీ కాబోలు మా ఇంటికి వచ్చేవాడు
జర్నలిస్ట్ గా కొత్తగా చేరాడు జానుమద్ది హనుమచ్చాస్త్రి వైసీవీ రెడ్డి కేతు విశ్వనాధ రెడ్డి రా.రా. ఎంతో మంది మా ఇంటికి తరుచూ వచ్చేవారు
వారితోపాటూ శశిశ్రీ కూడా
షేక్ హుస్సేన్ కలం పేరు సత్యాగ్ని. నాటకాలలో వేసేవాడట.మా అయ్య పద్యాలు ఎంత అద్భుతంగా పాడతాడంటే. రాజన్న గుర్తొస్తాడు. వై యస్ రాజశేఖర రెడ్డి  తండ్రి రాజారెడ్డి కి పుట్టపర్తి అంటే అమిత గౌరవం
అలాగే వై యస్ కు కూడా
శివతాండవం చక్కగా పాడి రాజశేఖరరెడ్డిని మెప్పించి షేక్ హుస్సేన్ సాహిత్యకారునిగా ఎం ఎల్సీ స్థానాన్ని పొందాడు
పుట్టపర్తి ఒక వటవృక్షం.
దాని ధీరత్వం  సామాన్యం కాదు
ఎప్పుడూ పుట్టపర్తిపై వ్యాసాలు వ్రాయడనికి అందరూ ఉత్సాహం చూపేవారు
దాదాపు అన్ని పత్రికలలోనూ పుట్టపర్తి పై వ్యాసాలు వచ్చేవి
తరుచూ సంభాషణలలో పుట్టపర్తి చెప్పే అనేక విషయాలే యీ మోనోగ్రాఫ్ గా తయారైంది
యువభారతి అధ్వర్యంలో ఆముక్తమాల్యదపై పుట్టపర్తి చేసిన మహోపన్యాసం వినే అదృష్టం ఈ ఉపన్యాసకునికి కలిగింది అని ద్వా.నా.శాస్త్రి గారు   చెప్పుకున్నారు.

  ఇందులో దొర్లిన తప్పులు కుటుంబసభ్యులు చెప్పినా వినిపించుకోనేవారు లేరు
ఆకాశవాణి కోసం యేడువేల కృతులు రాసారట
ఇంటర్మీడియట్ కు పుట్టపర్తి తను వ్రాసిన కావ్యాన్ని తానే పాఠ్యగ్రంధంగా చదివారట
జిల్లెళ్ళమూడి అమ్మ ఇల్లు కొని రిజిష్టర్ చేసిపుట్టపర్తికి ఇచ్చిందట..
ఇంకా యెన్నో..
అవాస్తవాలు

ఇది ఇంక దాదాపు అన్ని భారతీయ భాషలలోనికీ అనువాదమౌతుంది

 

సరస్వతీపుత్రుని సాహితీ వ్యక్తిత్వం..

  • -ద్వా.నా.శాస్ర్తీ
  • 12/10/2013
పుట్టపర్తి నారాయణాచార్య,
(మోనోగ్రాఫ్),
రచయిత: శశిశ్రీ,
వెల: రు.50/-
ప్రతులకు:
కేంద్ర సాహిత్య అకాడమీ,
ఫిరోజ్‌షా రోడ్,
న్యూఢిల్లీ- 110 001

కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న ప్రచురణ కార్యక్రమాలలో ‘‘్భరతీయ సాహిత్య నిర్మాతలు’’ శీర్షిక బహుదా ప్రశంసనీయం. జాతీయతా భావాన్ని పెంపొందించే మంచి పని ఇది. ఆ పరంపరలో శత జయంతి సంవత్సరం సందర్భంగా వెలువడిన మంచి పుస్తకం ‘‘పుట్టపర్తి నారాయణాచార్య’’. దీనిని రచించినవారు శశిశ్రీ. ఈయన మంచి కవి, విశే్లషకుడు. కొంతకాలం సాహిత్య పత్రిక నడిపి చేతులు కాల్చుకున్నవాడు. అయినా అక్షరార్చనను వదలనివాడు. అంతేకాదు పుట్టపర్తివారివద్ద శిష్యరికం చేసినవాడు. కాబట్టి ఈ పుస్తకం రాయడానికి అర్హుడు!
ఆధునిక పద్య, గేయకావ్యాల కవిగా పుట్టపర్తి వారిది అగ్రస్థానం. తను రాసిన పద్యభాగాన్ని తానే పాఠ్యాంశంగా చదివిన సన్నివేశం తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే అపూర్వం. భక్తిసాధనలో సన్యాసిగా మారి ప్రాణత్యాగానికి వెళ్ళిన పుట్టపర్తివారు సరస్వతీపుత్రులుగా ఎలా తిరిగి వచ్చారో తెలిపే సన్నివేశం... ఇటువంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పుట్టపర్తి నారాయణాచార్యులు అనగానే చాలామందికి గుర్తుకువచ్చేది ఆయన రాసిన అద్భుత గేయ కావ్యం, ‘‘శివతాండవం’. సంగీత, సాహిత్య, నాట్యశాస్త్రాల సమ్మేళనమది. పుట్టపర్తివారి నోట శివతాండవం వినటం ఒక అదృష్టంగా భావించేవారు. హిమాలయాల నుండి తిరిగివచ్చిన పిమ్మట ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరస్వామిని దర్శించుకొని తరించి రాసిన కావ్యమిది.
‘‘ఆడెనమ్మా శివుడు
పాడెనమ్మా భవుడు’’
అంటూ సాగే ఈ కావ్యం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
‘‘నేను సుమారు నూటికిపైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యమూ పద్యమూ రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరూ శివతాండవ్ గ్రంథమూ పెనవేసుకుని పోయినవి’’ అన్నారు నారాయణాచార్యులు. నిజమే ఒక్కొక్క కవికి ఒక మహారచన గొప్ప ప్రఖ్యాతిని తీసుకువస్తుంది. శ్రీశ్రీ ఎన్నిరాసినా ‘మహాప్రస్థానం’ గుర్తుకువస్తుంది. శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ శతాధికంగా రాసినా ‘‘బొబ్బిలియుద్ధమే’’ చెప్పుకోవాలి. పుట్టపర్తివారు జనప్రియ రామాయణం, పండరి భాగవతం, మేఘసందేశం (అనువాద గేయకావ్యం), పెనుగొండ లక్ష్మి వంటివి ఎనె్నన్నో రాశారు. మహాభారతంపై విమర్శ గ్రంథాలు రాశారు. 1971లో హైదరాబాద్‌లో యువభారతివారి ఉపన్యాస లహరిలో రాయలవారి ఆముక్తమాల్యదపై వారుచేసిన మహోపన్యాసం ఈ సమీక్షకుడికి వినే అదృష్టం లభించింది.
వనంలో ఉండగా నారాయణాచార్యులవారు ‘‘లీవ్స్ ఇన్ ది విండ్’’ అనే ఆంగ్లకావ్యం రాశారు. దీనిని సుస్రిద్ధకవి హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ మెచ్చుకోవడం గమనార్హం. బూర్గుల రామకృష్ణారావుగార్కి ఈ అయ్యవార్లంటే మక్కువ ఎక్కువ. ఎవరైనా సరే పుట్టపర్తివారి ప్రతిభకు దాసోహం అనవల్సిందే. మలయాళంనుంచి తెలుగులోకి అనువాదాలు చేశారు. విశ్వనాథవారి ‘‘ఏకవీర’’ నవలను మలయాళంలోకి అనువదించారు. ఇది కేరళ విశ్వవిద్యాలయం పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. ఇలా తెలుగువెలుగును ఇతర భాషీయులకి అందించిన మహనీయులు పుట్టపర్తివారు. 75వ ఏట ఉర్దూ నేర్చుకోవటం గొప్ప విశేషం. కడప ఆకాశవాణికోసం ఏడువేల కృతులు రచించారు. వీరి సుప్రభాతాలు, కృతులు, సూక్తిముక్తావళలు ఆకాలంలో ఆకాశవాణికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పుట్టపర్తివారి ధారణాశక్తి అమోఘం, అద్భుతం. మిల్టన్ ‘‘పారడైజ్‌లాస్ట్’’, మనుచరిత్ర వసుచరిత్ర, తులసీదాస్ రామచరిత మానస్... అన్నీ ఆయనకి కంఠపాఠమే. సంప్రదాయ సాహిత్యానికి ఆయనొక దీపధారి.

వ్రజ భాష


20 అక్టో, 2013

కర్మ


"వజ్జలగ్గ" జయవల్లభుని ప్రాకృత కావ్యానికి పుట్టపర్తి వ్యాఖ్య







                       వజ్జలగ్గ
        జయవల్లభుని ప్రాకృత రచన పుట్టపర్తి పరిశీలన..
సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ ; పుట్టపర్తి అనూరాధ


పూర్వము సంస్కృత భాష గ్రాంథిక భాషగాను
ప్రాకృత భాష వ్యావహారిక భాషగాను ఉండుట చేత 
సంస్కృత నాటకములు వ్రాసిన మహాకవులు 
ఉత్తమ పాత్రల మట్టుకే సంస్కృతము ఉపయోగించి 
తదితర పాత్రలకు ప్రాకృత భాష వాడేవారు.  

అశోకుడి కాలంలో ముద్రించబడిన శాసనాలు 
ప్రాకృత భాష లో రాయబడ్డాయి 
 "వజ్జాలగ్గం హాలుని గాథా సప్తశతి లాంటి ప్రాకృత గాథా సంకలనం. 
దీని రచయిత శ్వేతాంబర జైనుడయిన జయవల్లభుడు. 
ఈ వ్యాసంలో రామచంద్ర గారు 
ప్రస్తుత తెలుగు పదాలకు మూల రూపమైన 
౨౩ శబ్దాలను పరిచయం చేసి
వాటి సందర్భాన్ని తెలుపుతూ
పదాలు సంస్కృత తద్భవాలు అన్న వాదనను
పూర్వపక్షం చేస్తారు. 
వీటిలో కొన్ని పదాలు, “వింతర”,””,”ఆవట్టయే,”విసూరణంవగైరా.."
ప్రాకృత వాఙ్మయంలో రామకథ తిరుమల రామచంద్ర
"పుస్తకం" లో 
తిరుమల రామచంద్ర గారి పుస్తకాలని పరిచయం చేస్తూ 
రవి రాసిన మాటలు
"
వజ్జలగ్గ"
గోష్టియందొకానొక ప్రస్తావనమునదు పలుకు చాటువులకు 
వజ్జాలగ్గమని పేరట.
వజ్జయనగా పధ్ధతియని జయవల్లభుడే వ్యాఖ్యానించెను
లగ్గమనగా లగ్న శబ్ద భవమగునా..
అంటారు పుట్టపర్తి యీ వజ్జలగ్గ గురించి

అతి చిన్న వయసులోనే ప్రాకృత భాషల గురించి
ఆధికారికంగా చెప్పి అందరినీ పుట్టపర్తి ఆశ్చర్యపరిచారు
ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో
ప్రాకృత భాషల గురించి పుట్టపర్తి మాట్లాడుతున్నప్పుడు
ఉపన్యాసం ఐపోయాక
ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి
సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశా రట
పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి గారు
ఉద్యోదనుడు ప్రాకృత భాషలో రచించిన
కువలయమాల అనే రచనను అనువదించారు...
మరి యీ వజ్జ లగ్గ గురించి పుట్టపర్తి వారేం చెప్పారో చూడండి









11 అక్టో, 2013

పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో

జ్యోతిషము జోస్యం , 
భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా 
అనేకమంది విశ్వసించే విధానం. 
ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. 
జీవి జీవితంలో జరిగినది, 
జరుగుతున్నది, 
జరగబోయేదీ  
జననకాల గ్రహస్థితి ప్రకారము, 
శరీర లక్షణాలు, అర చేతులు, 
మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. 

ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. 
ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో 
ఇది కూడా ఉంది. 

మొట్టమొదటిగా 
జ్యోతిష్య శాస్త్రాన్ని 
గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు.  
హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో 
జన్మ సిద్దాంతం ఒకటి. 

జన్మసిద్దాంతం ప్రకారము  
పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం 
ప్రస్తుత జన్మలో ఉంటుంది. 
దానికి తగిన విధంగా, 
తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. 
అనగా అటువంటి గ్రహస్థితి లో జీవి జననం జరుగుతుంది. 
ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. 
కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు 
జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. 

ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.
హస్తసాముద్రికము, గోచారము,  
నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది 
మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.
 అని వీకీ పీడియా చెప్పింది  

"ఈ నిను జూచునప్డు నిలువెల్లను గన్నులు, సేవలో సుఖం
బానెడు నపుడు నిలువంతయు చేతులు, పల్కు పల్కి నీ
యానతి గోరునపుడు నిలువంతయు నోరులు, నీ స్తవంబునం
దేను రమించు నప్డు నిలువెల్లను కంఠము లీయరా ప్రభూ.. "


 
నా గత జన్మ యేమిటి
ఈ జన్మలో నా స్థితి యేమి
కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..
ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది..
నీవిచ్చే వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ,
ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అంటుంది అక్కయ్య..
ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు  పుట్టపర్తి లో ఉన్నాయి
జ్యోతిష్య పండితులు
పుట్టపర్తి పాండిత్యానికీ
'సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళ
లో భినివేశానికీ
ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి
శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది
 

తప్పకుండా వారు వారి గమ్యాన్ని చేరారని 
మేము వారి ప్రియ శిష్యులూ భావిస్తున్నాము
వారి నిర్యాణ సమయంలో దగ్గరున్న గోవిందు అనే శిష్యుడు
అయ్య ఇచ్చామరణం పొందినట్లు మాకనిపించిందమ్మా
వారి సహస్రారం నుంచీ ఆత్మ నిర్గమించిందనిమేము 

కనుగొన్నాము అని
వివరించాడు..
ముఖ్యంగా ఇంకో విషయం
పుట్టపర్తి అంత్య సమయంలో వారి ఆధ్యాత్మ శిష్యులు మాత్రమే 

చుట్టూ వుండటం..
భాగవతం దశమ స్కందం తీయమని 

బాబయ్య తదితరులకు చెప్పి వ్యాఖ్యానిస్తూ 
దాదాపు అరగంట గంట పాటు తెల్లవారి నాలుగ్గంటల నుంచీ.. 
ఏకాదశీ తిధి నాడు
శ్రీనివాసా
ని పడకపై ఒరిగిపోవటం
యేవో రహస్యాలను విప్పీ విప్పక చెప్పటం లేదూ..




పుట్టపర్తికి కంచి పరమాచార్యతో సాన్నిహిత్యం చాలా లోతైనది..
సంప్రదాయానికి నిర్వచనం స్వామి
యే బంధాలకూ లొంగని పుట్టపర్తి
వీరి కలయికే విచిత్రంగా వుంది కాదూ
 

నిజమే ..
ఆరోజుల్లోనూ అలానే వుండేది
కంచి స్వామి ఒకప్పుడు పెనుగొండ వెళ్ళారు
అప్పుడు పుట్టపర్తి తొమ్మిదేళ్ళ పసివాడు
ఆ పసివానివంక చూసి వాని నొసటి గీతలను చదివిన స్వామివారు
వీడు గొప్ప కీర్తిమంతుడౌతాడని చెప్పారు

తరువాత తల్లి వియోగాంలో మసలే పుట్టపర్తికి కుటుంబమ్నుంచీ నిరాదరణ.. కుంగదీసింది..
రెండవపెళ్ళి చేసుకున్న తండ్రి..
ఆమెకు పిల్లలు
మరలిన తండ్రి దృష్టి
పుట్టపర్తిని తీవ్ర నిరాశకు గురిచేశాయి

తిరుపతిలో విద్వాన్ చదువుతున్నరోజుల్లో
కంచి స్వామి తిరిగి మళ్ళీ పుట్టపర్తి ని పలకరించారు
పుట్టపర్తి చదివే 

సంస్కృత విద్యాలయానికి వెళ్ళారు స్వామి
అప్పుడు సంస్కృతంలో అష్టావధానం జరిగింది..
అప్పుడూ పుట్టపర్తి పాండిత్యం స్వామివారిని మురిపించింది..

తర్వాత సీను ప్రొద్దుటూరుకు చేరింది..
అప్పుడు పుట్టపర్తి వివాహితుడు
అక్కడి ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు
అక్కడి పండితుల మధ్యా విపరీతమైన పోటీలు
కక్ష్యలు ఘర్షణ వాతావరణం..

ప్రొద్దుటూరుకీ పరమాచార్య విచ్చేశారు
స్వామివారికి ఆహ్వానం పలకడానికి ఎవరు అర్హులు..??
అందరూ వెనుకంజ వేశారు..
పుట్టపర్తి పొలిమేరలనుంచీ సంస్కృతంలో భహ్మాండమైన శ్లోకాలతో
స్వామివారిని ఆహ్వానించి కన్యకాపరమేశ్వరీ ఆలయానికి తీసుకురావటం జరిగింది..

అక్కడ కొద్ది రోజులు స్వామి బస చేశారు..
మన తెలుగు పండితులకు సంస్కృతమే అరకొరా తప్ప అన్య భాషా పరిచయమే లేకపాయె
కానీ నిజమైన శక్తి గలవారిని కిందకి లాగటం లోనూ
కుయుక్తులను ప్రదర్శించి తరిమేయడంలోనూ పాండిత్యమెక్కువ..

తమిళ సాహిత్యమూ
భక్తుల సాన్నిహిత్యమూ గల పుట్టపర్తి స్వఛ్చత స్వామిని తిరిగి దగ్గర చేసింది..
అప్పుడు పుట్టపర్తి అక్షర లక్షల గాయత్రి కొన్ని కోట్ల అష్టాక్షరీ చేసి వున్నారు..
అంతే కాదు..

ఇంకో ముఖ్య విషయం
అందరూ స్వామివారి ముందు సాగిల పడేవారు
కోర్కెలు విన్నవించే వారు..
తాము చాలా సంప్రదాయబధ్ధులమని ప్రదర్శనకు దిగేవారు ఎక్కువ

కానీ
నేనిన్ని కోట్ల సాధన చేసాను నాకు ఎందుకు ఏ ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు..
అని పదే పదే అడిగే శిష్యులు ఎవరుంటారు..
నాకు కృష్ణ దర్శనమెప్పుడవుతుందని సర్వమూ ఒడ్డి హిమాలయాలకు పరిగెత్తే వారు ఎవరుంటారు..

అందుకే ప్రతిష్టాత్మక  కంచి పీఠాధిపతి..
నడిచేదైవమని ప్రపంచమంతా పిలిచిన సన్యాసి..
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్య
పుట్టపర్తికి వాగ్దానం చేసారు..
నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..
అని..



 

 

 

 పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో

సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ : పుట్టపర్తి అనూరాధ 
 





 1947 ఫిబ్రవరి న శివతాండవం లోని శివాలాస్యం 
"భారతి"లో ప్రచురింపబడింది.
సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ : పుట్టపర్తి అనూరాధ