28 జూన్, 2016

చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి..


ఆమె పేరు విమల
తండ్రిది చిన్న ఉద్యోగం
సినిమా రీళ్ళు పట్టుకుని ఈ థీయేటర్ కు ఆ థియేటర్ కూ తిరిగే పని
నలభైవేల అప్పు
అప్పు ఇచ్చిన మార్వాడీ కనపడినప్పుడలా విమలను దారిలో పట్టుకుని
నానా దుర్భాషలాడి అసభ్యంగా మాట్లాడేవాడు
తండ్రి అప్పు తీర్చలేడు
ఆమె యేం చేస్తుంది
లైబ్రరీలో పొద్దున సాయంత్రం కూచుంటే
ఒక ముఫై రూపాయలిస్తారు
దాంతో ఇల్లే గడుపుతుందా అవసరాలే తీరుస్తుందా..
తమ్ముణ్ణే చదివిస్తుందా..

అది పుట్టపర్తి ఇల్లు
అంటే మా ఇల్లు
అయిదుగురు ఆడపిల్లలు. ఒక కొడుకు చిన్న స్కూల్ టీచరు ఉద్యోగం
దరిద్ర దేవత తిష్ట వేసుకు కూర్చున్న కాలం
మా మూడవ అక్కయ్య తులజ కు నలుగురు స్నేహితులు
వారిలో ఈ విమల కూడ ఒకతె
ఆ నలుగురు మా అయ్యతో చక్కగా మాట్లాడేవాళ్ళు
మీ ఇంట్లో యేం వంట చేసినారే..
వంటి ప్రశ్నలతో వారితో హాస్యమాడే వారు  మా అయ్య
నే ను అప్పటికి సంవత్సరం దాన్నేమో
వాళ్ళు కూడా అయ్యా అయ్యా అంటూ బిడ్డల్లాగే సన్నిహితంగా మసలేవాళ్ళు

ఒకరోజు ఈఅప్పు ప్రస్తావన వచ్చింది
విమల మా తులజక్కయ్య దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది
అప్పుడే వచ్చారు అయ్య
యేమైందే అని అడిగారు
తులజక్కయ్య విషయం చెప్పేసింది
ఎంత అప్పు అని అడిగారు
నలభైవేలు

కొంచెంసేపు ఆలోచించారు
సరే నేనిస్తాను తీసుకుపోయి వాణికి ఇచ్చేయ్
అన్నారు
నివ్వెరపోవటం నలుగురు స్నేహితుల వంతైంది
అన్నట్టుగానే నలభైవేలు ఇవ్వటమూ 
ఆమె ఆ అప్పు తీర్చడమూ జరిగిపోయాయి
ఆమె జీవితంలో ఒక పెద్ద భారం దిగిపోయింది

1950 లలో నలభైవేలంటే తక్కువేంకాదు
అంత డబ్బును ఒక్క నిమిషం ఆలోచించి ఇచ్చివేసిన 
పుట్టపర్తి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆలోచించండి

మనలాంటి వాళ్ళైతే అసలు ఇవ్వడానికే ఆలోచిస్తారు
ఇచ్చినా ఇంక డప్పు కొట్టుకోవటం మొదలుపెడతారు
ఇచ్చి ఆ విషయాన్ని మరు నిమిషమే మర్చిపోయేవాళ్ళు
ఎంత గొప్పవాళ్ళు.. 

అటివంటివాళ్ళలో కూడా దోషాలు వెదికే కుమతులను 
వాళ్ళ కర్మానికి వదిలేయాలి..

ఈ విషయం మా తులజక్కయ్య ఇప్పుడే ఫోన్ లో మాటల మధ్య చెప్పింది
ఇంకా ఇటువంటి సంఘటనలు ఎన్ని దాగున్నాయో పుట్టపర్తిలో

అందుకే మా అయ్య అంత గొప్పవాడయ్యాడు
ఫ్రెండ్స్ నాకీ రోజు చాలా ఆనందంగా వుంది
నా గురువు చాలా చాలా ఉన్నతుడు
నన్ను ఉధ్ధరించగలవాడు..
అటువంటి గురువు దొరికిన నేను ఎంతో అదృష్టవంతురాలిని..
షం