|
విఠల్ భాయ్ పటేల్ |
మన భారతీయ శాఖాహార వంటలలో
ఆంధ్ర,కేరళ,తమిళనాడు,కర్ణాటక
రాష్ట్రాలలోనే భిన్న భిన్న రుచులు
కేరళీయులు కొబ్బెరతోనే వంటలను మొంచెత్తుతారు
కన్నడిగులు తీపిని ప్రతి పదార్థంలో చేరుస్తారు
తమిళులకు సాంబార్ తోటే దినం గడుస్తుంది
ఇక ఉత్తర దేశం మనకు పూర్తి వ్యతిరేకం
పూరీలు రొట్టెలు వాళ్ళకు ప్రధానం
అన్నం అంతగా ఇష్టపడరు
ఇక స్వీట్లు రకరకాలు
పెరుగు పాలు నిత్యజీవితంలో భాగం
పచ్చి కూరగాయల సలాడ్ లేకుండా
వారి భోజనం ముగియదు..
మనం బియ్యం పప్పులకోసం పెట్టినంత డబ్బు వాళ్ళు
స్వఛ్చమైన నీళ్ళు కలపని పాలకోసం పెడతారు
చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకూ
రోజూ ఒక పెద్ద గ్లాసెడు పాలు తాగటం వారికిష్టం
ఉక్కు మనిషి
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సోదరుడు
విఠల్ భాయ్ పటేల్
పుట్టపర్తి నైనిటాల్ సభకు వెళ్ళినప్పుడు
పుట్టపర్తి తదితరులను తన ఇంటికి విందు కి పిలిచాడట.
పుట్టపర్తి ఏనాడూ రుచులకు ప్రాధాన్య మివ్వలేదు
ఆకలి వేళకు ఏదో ఒకటి
అయితే వైష్ణవులకు పరమ ప్రీతి పాత్రమైన పులిహోరపై కొంత మక్కువ చూపేవారు అదీ వయసైన తరువాత
యవ్వనంలో అంతా
ఎన్నో కోట్ల జపం చేసాను
నాకు ఆధ్యాత్మిక పరమైన అనుభూతులు
ఎందుకు కలగటం లేదు..?
అని తపించి..
నిస్సంగులైన సాధువులకు ఆలవాలమైన
హిమాలయ పర్వత సానువులపై
తనకు దారి చూపే వారి కోసం వెదకిన మనిషి
రుచులకోసం అర్రులు చాస్తాడా..?
అక్కడి సాధువులకు దొరికితే భోజనం
లేకపోతే గాలే తిండి
చాలామంది దిగంబరులుగానే వుంటారు..
ఆనాటి పుట్టపర్తి వ్యక్తిత్వమూ
దృష్టీ
అతను నడచిన దారీ
ఎంతో మంది గొప్పవాళ్ళను ఆకర్షించింది
అందుకే వల్లభ భాయి పటేల్
నెహ్రూ
గాంధీజి
ఇంకా ఎంతో మంది పుట్టపర్తిని హిమాలయ శిఖరం అన్నారు
సరే
సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ వారింటికి భోజనానికి పిలిచారు
అక్కడేం జరిగింది
పుట్టపర్తి మాటల్లోనే వినండి..
ఈ సంఘటన
నైనిటాల్ లో మన పుట్టపర్తి శివతాండవ గానం చేయడానికి వెళ్ళినప్పుడు జరిగింది..
నెహ్రూ గారు పుట్టపర్తి గురించి ఏమన్నారో
మరోసారి మాట్లాడుకుందాం..
విఠల్ భాయ్ పటేల్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు
రాజీనామా చేసినాడు కదా..
ఆయన అసెంబ్లీ నుంచీ..
నైనిటాల్ కు పోయినప్పుడు ఆయనింటికి భోజనానికి పిలిచినాడు
తిన్న పదార్థాలలో ఒక్క పదార్థం అర్థమైవుంటే ఒట్టు
ఇంత పెద్ద ప్లేటు పెట్టినారు
చుట్టూరా గిన్నెలు పెట్టినారు
కొన్ని పుల్లవి,తీపివి,..
ఒక్కటిమాత్రం నాకర్థమైంది
పచ్చి ఎర్రగడ్డలు తరిగి ఉప్పేసి పెట్టినారు
తరువాత ముంత మామిడి పప్పు..
ఆయన మీమాంసా శాస్త్రంలో చాలా గొప్పవాడు
భోజనం ఏమోగానీ ఆయన చదువుకు దండంపెట్టి వచ్చా.. "
|