18 మార్చి, 2014

గోమాతకు మాతకు భేదమె..


పుట్టపర్తి వారి వచన రచనా వైదుషి

                   జానుమద్ది గారి నమస్సులతో
పుట్టపర్తి వారి 
వచన రచనా వైదుష్యానికిది మచ్చు తునక..
వాద విజయములో శ్రీనాథుని చిత్రిస్తూ ..
 

''అరుణగిరినాథుడనుడను డిండిమునిపై వాదమునకు వెడలునపుడు:
కుంకుమ పూవు మేదించినది..
బొట్టు ముఖముపై కలకలలాడుచున్నది..
తెల్లటి విభూతి రేఖలు దానితో మరింత పరభాగతను సంతరించుకున్నవి..
ఆ విభూతి రేఖలు .. నా కుంకుమబొట్టు శివపార్వతులిరు వురు అతని ఫాలముననిలచి ఫక్కుమని నవ్వినట్లున్నది..
విద్వత్కవుల గుంపునుండి శ్రీనాథుడు లేచినాడు
ఆ లేచుట ..
వికసించిన తామరలున్న సరస్సునుండి జక్రవాకము లేచుటైనది..''
-జానుమద్ది హనుమచ్ఛాస్త్రి..