28 డిసెం, 2013

భాగవత వాత్సల్యం


''కటిక దరిద్రాన్నైనా అనుభవిస్తాను గానీ..
జీవితంలో క్షణమైనా నాస్తికత్వాన్ని భరించలేను..'' అన్నారు ఆచార్యులవారు
 

''వైకుఠాన్నయినా వదలిఉంటాను గాని ..
తనను ఆశ్రయించిన భక్తులను మాత్రం 
ఒక్క క్షణమైనా వదలి ఉండలేను..''
 అంటాడా యేడుకొండలస్వామి
 

ఆయనకు శ్రీ వైకుంఠం కంటే భూలోక వైకుంఠమై తిరుమల క్షేత్రం అంటేనే మహా ఇష్టమట..

అందుకే భక్తులందరితో తానూ ఒక్కడై తిరుగుతూ ఆటలాడినాడు..
ఆనందించినాడు..
పాడినాడు..
పరవశించినాడు..
ఒక్కొక్కమారు భక్తులతో పరాచికమాడినాడు..
తిట్టించుకున్నాడు..

దెబ్బలు కూడా తిన్నాడు..
 

ఇలా ఆ భగవంతుడు
తన భక్తులతో ఆడటం పాడటం పాచికలాడటం పరాచికాలాడటం ఇవి ఒకనాటివా..
ఒక యుగానివా..
యీ అనంత లీలల్లో మన ఊహకు మన బుధ్ధికి మనసుకు అందినవి అర్థమైనవి ఆసక్తిగా ఆర్తిగా చర్చించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం కదూ ..