నేల నూతల కృష్ణమూర్తి గారి భార్య యైన పార్వతమ్మ గారు వ్రాసిన
"రామ చరిత మానసామృతము"
అను గ్రంధమునకు ఆశీర్వచనము
అను పేర వ్రాసిన పీఠిక ఇది
పుట్టపర్తి పీఠికలతో ఆయా గ్రంధములకు విలువ పెరిగేది
పార్వతమ్మ గారి భర్త అయిన
నేల నూతల కృష్ణమూర్తి గారు
శ్రీమద్రామాయణమును ఇంగ్లీషునకనువదించినారట
వారి సతీమణి తులసీదాసుని అర్చించినది
పుట్టపర్తి గారు నెల్లూరునకు
ఆ పరిసర ప్రాంతములకు సన్మానములకు వెళ్ళినప్పుడల్లా
వారింటనే దిగేవారట..
అప్పుడు
శ్రీ రామావఝుల శ్రీశైలం గారు
నేలనూతల వారింటికి వెళ్ళి పుట్టపర్తిని దర్శించేవారట
"ఇది మూలమునకు
యధాతధముగా సాగిన రచన కాదు
తనకింపుగ తోచినచోటనే అనువదించును
ఇట్టివచనములు
పాఠకులలో మూలగ్రంధమును
జదువవలెనను ఆశను రేకెత్తించును "
అంటారు పుట్టపర్తి
పార్వతమ్మ గారి రచనను పరిచయం చేస్తూ
ఇంకా
వాల్మీకి రామ తత్త్వము పూర్తిగా అర్థమవలేదట
అందువలననే కలియుగమున తులసీ దాసుగా అవతరించెనట
ఉత్తర హిందూస్థానములో
ప్రజల నమ్మకమిది
"అయోధ్య కాశీ మొదలైన ప్రదేశములలో
దీని ప్రశస్తి అంతా ఇంతా గాదు
రెండు శాస్త్రములలో సమగ్ర పండితుడైననూ
ఆదేశమున తులసీదాసునే పారాయణమొనర్చును..
బైరాగులు వీధులలో
వ్యాసపీఠముపై తులసీరామాయణముంచికొని
దానిపై రెండుపువ్వులనుంచి కూర్చొనెదరు
వారి యెదుట కాసులు కుప్పలుగా పడియుండును అంటారు..
ఇది 1961 న వ్రాసిన పీఠిక
శ్రీశైలం గారు నెల్లూరు వెళ్ళి
కష్టపడి సంపాదించినది..
"శ్రీ రామ చరిత మానసామృతము"
శ్రీమతి నేలనూతల పార్వతమ్మ గారి గ్రంధమునకు
పుట్టపర్తి అందించిన ఆశీర్వచన పీఠిక
పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ by Anu Radha