2 అక్టో, 2012

స్థిత ప్రజ్ఞుల చావు..

 


గాంధీజీ పోయిన వార్త
రేడియో లో వినిపించగానే 
పుట్టపర్తి వారు  నేలపై పడి ..
పొర్లి ..పొర్లి ..విలపించా రంట..!! 
ఆనాటి దేశ భక్తి అది.. 
ఊర్లు ఊర్లన్నీ శో క సముద్రంలో 
మునిగిపోయాయంట ..

తాతయ్యను గూర్చి ..

"జ్ఞా న పధ మెప్పుడును సుగమమ్ముగాదు 
అలతితో గాదు తుంగ భావార్చనంబు 
జ్ఞాన పధము కంటక కీర్ణమైన త్రోవ 
తుంగ భావార్చానము బాధ తోడి తపసు .."

అన్నారు వారు 

ఇది చూడండి ..




అదిగో ..
ఆ పక్కింటి పిల్లనీ చూడూ..
ఏమిటా కన్నీళ్ళూ ..??
తాత అర్థమైనట్లూ..!!

అదిగో ఆ గోవు..
తోకనైనా ఆడించటం లేదు..
ఏమిటా దిగాలు..??
తానూ మానవుడైనట్లూ..!!

అదిగో ఆ పువ్వు..
వాడి వత్తలైపోయింది..
ఏమా నీరవత..??
తనకూ మనసున్నట్లూ..!!

ఓ..
స్థిత ప్రజ్ఞుల చావు..
ఇలా వుంటుందేమో..