24 డిసెం, 2011

నా గురుదేవుడు.. శ్రీ ఉప్పలపాటి రఘూత్తమరావు..నా గురుదేవుడు..
శ్రీ ఉప్పలపాటి రఘూత్తమరావు..
శ్రీ పుట్టపర్తి నారాయణాచర్యులవారు ..
విద్వత్ సామ్రాజ్జ్య చక్రవర్తులు. 
వారి రచనలు అనేక భాషలలో
 అనేక రాష్ట్రాలలో 
అనేక రూపాలు దాల్చి ఉన్నవి. 
అలాంటప్పుడు వానిని గూర్చి వ్రాయుటకు వారంతటి వారే సమర్థులు .. 
నా బోటి వాడు కాడు.. 

వారితో 
ముఫయ్ సంవత్సరాల సాన్నిహిత్యంలో..
భక్తి ప్రపత్తులతో ..
సేవా పరాయణతతో..
వారిని కొలిచి నేను పొందిన అనుభూతులను..
వారు నాకు అప్పుడప్పుడు చెప్పిన వారి జీవిత విశేషాలను..
అదీ అసమగ్రంగానే మనవి చేసుకుంటాను..
వారు బాల్యమున ఆటపాటలతో ..
అల్లరి పనులతో ..
కాలం గడుపుతూ ..
చదువు సంధ్యలను పట్టించుకోక పోవడంతో.. 
తండ్రిగారు ఆగ్రహించి ఇల్లు వెడలగొట్టారట. .

ఆ చిరుప్రాయముననే ..
పెనుగొండ చేరి ..
అచట వేంచేసి యున్న అమ్మవారిపై 
అంటే లక్ష్మీదేవిపై అశువుగా కవిత్వం చెప్పారు. .
అదే "పెనుగొండలక్ష్మి" కావ్యంగా 
రూపు దిద్దుకున్నది. 

నేను 1946లో 
B.A తగతిలో చేరడానికి 
అనంతపురం కాలేజీకి వెళ్ళాను. .
Kanakadas
అక్కడ 
తెలుగు ఉపన్యాసకులుగా
 శ్రీ పుట్టపర్తి వారు ఉన్నారని విని ..
వారి కీర్తి అప్పటికే 
వ్యాపించి యుండినది కనుక..
వారిని దర్శించుకోగలనని సంతోషించాను.. 

కానీ ..
నేనక్కడికి వెళ్ళేసరికే ..
వారు పదవికి రాజీనామా చేసి 
అక్కడినుండీ వెళ్ళి పోయారని తెలిసి 
చలా ఖేదపడినాను.
అనంతపురంలోనే B.A పూర్తి చేసుకుని ..
ఆ తరువాత BEd ముగించుకుని ..
1955 లో 
పులివెందుల హైస్కూలులో 
లెక్కల అయ్యవారుగా చేరాను..

ఆ స్కూలువారు 1956 లో 
పాఠశాల లైబ్రరీకి పుస్తకాలు కొనడానికి 
నన్ను నియమించారు. .
నేను కడపకు వెళ్ళి 
వెంకట్రామా అండ్ కో వారి వద్ద పుస్తకాలు కొని..
శ్రీ పుట్టపర్తి వారి ఆచూకీని తెలుపమని..
ఆ కొట్లో వున్న శ్రీ సూర్య నారాయణగారిని అడిగాను. 
సూర్యనారాయణ గారు.. 
ఇదిగో ఇప్పుడే ఇంటికి వెళుతున్నారు. .
Purandaradas
నీకు మార్గ మధ్యంలోనే కనపడతారు వెళ్ళమని దారి చూపారు. 
                              
నేను తక్షణమే ఆ దారిన వెళ్ళి ..
వారిని ఇదివరకు చూచి వుండకపోయినప్పటి..
కె సూర్యనారాయణగారు చెప్పిన గుర్తులను బట్టి.. 
ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూచి ముగ్ధుడనై ..
భృత్యుని నమస్కారాలు అని విన్నవించుకొన్నాను..

వారు వెంటనే నీవు ఎవరు..?
ఏమి పని..?
అని అడిగారు . 
నేనొక టీచర్ నని ..
లైబ్రరీ పుస్తకాల కొరకు పాఠశాల వారు
 నన్ను పంపారనీ.. 
మీతో కలసి మాట్లాడదలచానని ..
అన్నాను. Ramadas
 తెలుగు పుస్తకాలా ..?
అని వారడిగారు. 
అవునన్నాను. .
రేపు మా ఇంటికిరా..
అని తమ ఇల్లు చూపించి        


పొమ్మన్నారు.

కడప మోచంపేటలో ..
సందున మొదటి ఇల్లు వారిది... .
మరుసటిరోజు వారింటికి వెళ్ళి ..
వెలుపల నిలుచుండి ..
ఏకాగ్రతతో వారు రాస్తున్న దృశ్యాన్ని చూసి ..
ఆకర్షితుడనై నిలబడ్డాను. .
కొంతసేపటికి నన్ను చూసి లోపలికి పిలువగా..
వెళ్ళి నమస్కరించుకొన్నాను. 

వారు కొన్ని ముఖ్యమైన గ్రంధముల పేర్లు చెప్పి.. మిగతావి నీవే చూచుకొమ్మన్నారు. 
Kabir
అలాగేనని నాదొక చిన్న ప్రార్థన అని వేడినాను. 
ఏమది ..?
అని వారు అడిగారు.

అపుడపుడు మీ దర్శన భాగ్యం ప్రసాదించమని వారిని అర్థించాను . 
ఎందుకని వారు అడిగారు
మానసిక తృప్తి కొరకు అని నేనన్నాను. 
సరే ..
ఎపుడయినా ఒకసారి రా.. 
అన్నారు. 
మహా ప్రసాదమని నమస్కరించి వెళ్ళిపోయాను.

దారి వెంబడి వారి మూర్తిని 
నా హృదయంలో నింపుకొని నడచాను. 
పదే పదే .. 
వారిని చూడాలని నా మనసు ఉరకలు తీస్తుంది. 
అప్పుడప్పుడు వారిదర్శనం చేసుకొంటూ..
కొన్నాళ్ళకి వారికి సన్నిహితుడనైనాను..
అప్పట్లో ..
కొందరు వృధ్ధులు ..స్త్రీలు.. పురుషులు..
వారిని ఆశ్రయించి ..
తారక మంత్రము దయచేయవలసినదని ప్రార్థించుచుండేవారు. 

Tyagaraja
కానీ ..
వారికి వారు ఆశ్రయించ వలసిన మహాత్ముల పేర్లు తెలిపి పంపుతూ వుండేవారు. 
ఆచార్యులవారు నిరంతరం..
అష్టాక్షరీ మంత్రము మననం చేస్తూ ..
శంఖ చక్ర గదాదరుండైన శ్రీ మన్నారాయణుని అనుష్టించి తమ కార్యకలాపములు చేయుచుండువారు. 

నేనొకనాడు సాహసించి..
సాష్టాంగ దండ ప్రణామ మాచరించి నన్నుధ్ధరించవలసిందిగా ప్రార్థించాను. 

వెంటనే వారు ..
నన్నాశ్రయించిన కష్టాల పాలగుదువు. ..
మీ అమ్మను ఆశ్రయించు ..
అధికార ..
ఐశ్వర్య.. 
భోగ భాగ్యములు.. 
పొందగలవు అన్నారు. ..
కాని  
నేను మిమ్ములనె ఆశ్రయిస్తాను. 
నాకు ఈ లోకములోని భోగభాగ్యములు వలదు
అన్నాను. 
వారు మౌనము వహించారు.

వారట్లు కొన్ని నెలలపాటు
 నన్ను కఠిన పరీక్షలకు గురిచేసినారు . 
Annamayya
భరించలేక 
ఒకొకప్పుడు విడిపోవాలని కూడా అనుకున్నాను...
కాని ..
అమ్మ (వారి సతీమణి కనకమ్మ గారు) 
వానికేదైన ఇవ్వరాదా..
అని నా తరఫున బ్రతిమాలారు. 
కానీ 
ఆయన ఉగ్రుడై..
ఆమెను కూడా దుర్భాషలాడగా.. 
నేను భరించలేక దుఃఖించాను. 

కొన్నాళ్ళకు కనికరించి..
1959 డిశంబరులో ..
ముక్కోటి ఏకాదశి నాడు ..
అష్టాక్షరీ మంత్రము అనుగ్రహించినారు. 
వారు విధించినట్లే నడచుకొన్నాను.

జపశీలుడనైనాను. .
ఉద్యోగ నిర్వహణ చేస్తూ జపం సాగిస్తూ ఉండేవాడిని..
నాలో తన్మయత్వం కలుగుతూ వచ్చింది..
వారు ముందుగా సెలవిచ్చినట్లే ..
BA పరీక్ష రాసిన నా జ్యేష్ట కుమారుడు..
అక్టోబరు 1972 లో దివంగతుడైనాడు. 

Narayana teertha
జనవరి 1977 లో పెద్ద కుమార్తె మరణించింది. 
అంతకు పూర్వమే..
1976 లో జూన్ లో భార్యను పోగొట్టుకొన్నాను. .
ఇవేవి జరిగినా ..వారినిగాని .. వారు కృప చేసిన మంత్రమునుగాని..
విడువక ఇతోధిక భక్తితో..
 జీవితం కొనసాగిస్తూ.. వస్తూ వున్నాను.  

వారి సమక్షంలో ..
నాకు దివ్యానుభూతులు ఎన్నో కలిగినవి. 
ఒకప్పుడు రణరంగమున రధారూఢుడైన ..
శ్రీ కృష్ణార్జునులు మనో నేత్రమునకు గోచరమైనారు. 

మరియొకప్పుడు ..
కాళీయమర్దనుడైన చిన్ని కృష్ణుడు 
ఫణాగ్రమున నాట్యం చేస్తూ దర్శనమిచ్చినట్లనుభవించాను. 

వేరొకప్పుడు ..
గోవర్ధన గిరిధారి గోపికా పరివృతుడైన గోపాల కృష్ణుడు..
శేషశాయి అయిన శ్రీ మన్నారాయణుడు.. 
 యశోదాదేవి ముద్దాడుతున్న బాలకృష్ణుడు ..

ఇట్లు 
అనేక విధములైన సందర్శన భాగ్యములను పొందినాను. 

గురుదేవులైన ఆచార్యులు 
సామాన్యులు కారు. 
కొన్ని మాసముల క్రితం 
వారిని నేను నన్ను గురించి ప్రశ్నించి నప్పుడు.. 
మనం మళ్ళీ కలుస్తామని సెలవిచ్చినారు. 
నా తరువాత నీవు 
కొన్ని ఏండ్లు వుండవలయును. 
అని చెప్పినారు 

మంత్రము జపించడము మానవద్దన్నారు..
భగవతము.. 
భగవద్గీత.. 
సుందరకాండ ..
హరివాయుస్తుతి.. చదవమన్నారు..
ఇపుడు నా కాలక్షేపము అవియే..

పుట్టపర్తి వారు ..
వేదవేదాంగ విద్యా భూషితులు. 
వారి అనర్గళ కవితాధారను గురించి
 నేనేమి చెప్పగలను..?

వారు 
మంత్ర శాస్త్ర పరిశోధనా పరాయణులు కూడా..
ఒకప్పుడు 
వారి గురువులు 
ఎల్లాల ఆంజనేయ గుడికి పోయినచో
 ఫలానా రోజు
 రాముల వారు దర్శనమిచ్చునని చెప్పారట 

గురువు గారు 
నన్ను కూడ ఎల్లాలకు తీసుకు వెళ్ళినారు. 
కర్నూలు జిల్లా చాగలమర్రికి 
రెండు మైళ్ళ దూరాన ఎల్లాల గ్రామం ఉన్నది. 
అక్కడ 
ఆంజనేయ దేవాలయము బహురమ్యముగా వున్నది. 

meera
సుమరు 12...,14.. అడుగుల ఎత్తైన ఆంజనేయ విగ్రహమున్నది. 
ఇరువురం 
కాలి నడకన ఎల్లాల గ్రామంకు వెళ్ళాము. స్నానానంతరం 
గర్భగుడిలోకి వారొక్కరే ప్రవేశించి 
తలుపులు వేసికొన్నారు..


ఒక గంటా గంటన్నర తరువాత 
వెలుపలికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.

అపుడొక వెర్రివాడు ..
మిట్ట మిధ్యాన్నం గుడిలోనికి ప్రవేసించి 
కాలే ఒక బండరాతిపై  తైతక్కలాడసాగాడు. 

వానికేమి కావాలో విచారించమని 
గురువుగారు నన్నాజ్ఞాపించారు. 

నేనతనిని అడుగగా 
నీరు కావలెనన్నాడు. 
గర్భగుడిలోకి వెళ్ళి 
నీరు తెమ్మని గురువుగారు ఆజ్ఞాపించారు. 
అక్కడ వెళ్ళి చూడగా 
నీరు లేదు. 
సమీపానగల ఏటికి పోయి తెమ్మన్నారు..
ఈ మాటలు అంటూ వుండగానే ఆ వ్యక్తి అదృశ్యుడైనాడు.
నేను వెంటాడినా కనుపించలేదు. 
Shyamasastri
ఆ తరువాత అవకాశం పోగొట్టుకున్నానని గురువుగారు సెలవిచ్చారు.

ఆచార్యుల వారొకప్పుడు నన్ను 
తమ గురువైన నారాయణ మహరాజ్ వద్దకు పిలుచుకొని పోయారు.జియాగూడ హైదరాబాద్ లో వారి ఆశ్రమం. 
సమర్థ రామదాసు గురుపరంపరకు చెందిన వారు. 
వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందినాను. 
మరొక నాడు 
జనమంచి వెంకట సుబ్రమణ్యశర్మ గారి ఇంటికి  పిలుచుకొని పోయినారు.
వారు  
నాకు హైస్కూలు లో తెలుగు పండితులు. 
జ్యొతిశ్శాస్త్ర గురువులు. .
పది సంవత్సరాల ప్రాయముననే 
వారి నాశ్రయించి జ్యోతిశ్శాస్త్రము నభ్యసించినాను. శాస్త్రిగారు కూడ.. 
శ్రీ నారాయణాచార్యులే నీకు గురువు ..,
వీరిని విడువవలదని సెలవిచ్చినారు..
గురువుగారు 
నాతో ముచ్చటించిన విషయాలలో..
భక్తుల జీవిత చరిత్రలే ముఖ్యము. 
భక్త తుకారాం ..
కనకదాసు.. 
పురందర దాసు ..
రామదాసు ..
భక్త కబీరు ..
మస్తాన్ సాహెబు..
మొదలగు అనేక క్తుల చరిత్రలు 
వర్ణిస్తూ వుండేవారు. 
లౌకిక విషయ చర్చ ఎప్పుడూ లేదు. 

వారి సన్నిధిలోనే 
నాకు నిరామయ నిరంజన స్థితి అలవడింది.
వారు ఒకప్పుడు 
నాకు వ్రాసిన జాబులో..
మన ధనం సాధనం..
మన బలం దైవబలం..
అని వ్రాసినారు..
దాన్ని ఇప్పటికీ నేను భద్రపరచి వుంచుకొన్నాను. 


ఒకప్పుడు 
నా మిత్రుడు జి. చక్రపాణి ..
శైవుడు ..
తనను కూడా శిష్యుడుగా చేసుకొమ్మని..
గురువుగారిని బ్రతిమిలాడి చెప్పమన్నాడు. 
అతనిని తీసుకు వెళ్ళాను. 

కానె వారతనికి 
నీవు రమణుల వారిని ఆశ్రయించు..
వీడు నా వాడు ..
వీనిని నేను ఉధ్ధరించ వలెను.. 
అని చెప్పేసారు.

సంగీతం.. నాట్యం ..నాటకం..
మొదలగు లలిత కళలన్నీ..
వారికి కరతలా మలకములు. 
వీణ ..హార్మోనియం ..తబలా ..
మొదలగు వాయిద్య విద్యలకు కూడా 
తమకు గురువులున్నారని చెప్పేవారు. 
ఒకనాడు 
వారి ఇంట్లో భజన చేస్తూ వుండగా 
వారు హార్మోనియం తబలా రెండూ వారు వాయించగా నేను చూసాను. 


Tukaraam

వారు రచించిన సుమారు 200 పుస్తకాలు 
చాలా గొప్పవి . 
వారివి భక్తి ప్రధానములైన రచనలు.
వారు అంతర్ముఖులై ఎప్పుడూ 

అష్టాక్షరీ మంత్ర జపం చేస్తూ 
తమ కార్య కలాపములను సాగించేవారు. 
ఇతరులతో సంభాషించినా అంతే..
వారి అష్టాక్షరీ మంత్ర జపము నలభై కోట్లకు మించినదని వారే సెలవిచ్చినారు. 
ఆజన్మాంతము 
కటిక దారిద్ర్యమైనా అనుభవించగలను 
కానీ 
క్షణమైనను నాస్తికత్వమును భరించలేనన్నారు.

గురుదేవులు సామాన్య కుటుంబ జీవనం నిరాడంబరంగా సాగించారు. 
నిత్య తృప్తి వారి లక్షణం. 
చాలా సంవత్సరాల క్రితం ..


ఒకసారి ..
శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులైన
 పరమాచార్యులు
శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి 
కడప వేంచేశారు. 
శ్రీ పుట్టపర్తి గారు వారి దర్శనార్థం వెళ్ళారు. 
నేనప్పుడు వెంబడే వున్నాను. 
పరమాచార్యుల శిష్యులలో ఒకరితో 
వారి దర్శనానికి నేను వచ్చానని చెప్పప్పా ..
అన్నారు 
యధాతధంగా రమ్మని 
పరమాచార్యుల నుండీ వెంటనే పిలుపు వచ్చినది. 
బయట ఎందరో 
అధికారులు ..అనధికారులు ..పెద్దలు..
 పరమాచర్యుల దర్శనానికి వేచియున్నారు. 

చొక్కా తొడుగుకున్న ఆచార్యులవాఉ 
అలాగే లోనికి వెళ్ళి 
పరమాచార్యుల పాదాలంటి నమస్కరించారు. శంకరాచార్యుల వాఉ 
హస్త మస్తకన్యాసము చేసి ఆశీర్వదించారు. 

ఆచార్యులవారు బయటికి వచ్చినాక 
వారి ముఖంలో ఏదో మహా కాంతిని దర్శించాను.

ఉత్తరాది మధ్య పీఠాధిపతిని 
తమ గృహమునకు ఆహ్వానించి ..
పాద పూజలు సలిపి..
వారి ఆశీర్వాదము పొందినారు ఆచార్యులవారు.

వీరు ఒకసారి..
Tukaram
ఉర్దూ భాషలో ముషాయిరా (కవిసమ్మేళనం) లో పాల్గొని 
వారికి ఆహ్లాదం కలిగించారు. 


వ్యాసులవారి భాగవతం.. వాల్మీకి రామాయణం తులసీదాసు రామచరిత మానస్ ..
మరికొన్ని ఇతర భాషలలోని రామాయణాలు ..
వారికి కంఠస్తములు. 


తమ 76 వ యేట వ్యాధిగ్రస్తులై ఉండి కూడా..
నాకు భాగవతము పాఠం చెప్పారు. 
వ్యాధి తన దేహమునకే కానీ..
తనకు కాదని వారి భావము. 


ఆచార్యులవారు ..
ఎల్లప్పుడూ తెల్లని పంచె.. 
తెల్లని జుబ్బా ధరించేవారు. 
కాళ్ళకు జోళ్ళు.. 
కంటికి అద్దాలు.. 
ఉండేవి. 
మితాహారి మితభాషి. 
మితకర్మానుష్ఠాన సంపన్నులు కూడా.. 

వారు సర్వ భూత హితమునందు అనురక్తులు. .
వారి మనస్సు వెన్నపూస వంటిది. .
వారి మాటలు మేఘ గాంభీర్య విభవములు. .
వారు భజనలు చేస్తూ వుంటే 
కొందరు తన్మయత్వం చెందేవారు. .
కొందరు అశ్రువులు రాల్చేవారు. .
వారి సాన్నిధ్యంలో ఎప్పుడూ ఆనందమే. .
ఆవేదనలు ..పరివేదనలు.. వుండవు. .
సంశయాలు విచ్చిన్నములయ్యేవి. .
భగవంతుని యందు 
 భక్తి విశ్వాసములు నిత్యాభివృధ్ధి చెందేవి.                                      
Shyamasastri
1990 ఆగష్టు ఒకటవతేదీ 
మనుమడి వివాహం ముగిసినాక ..
వారూ నేనూ కలిసి 
సారస్వత పరిషత్తులో 
దేవులపల్లి రామానుజరావు గారిని కలిసినాము. ఇదే నా తుది కలయిక మీతో ..
నా అవతారం చాలిస్తున్నానప్పా ..
అని సెలవు తీసుకుని వచ్చేసారు. 

జబ్బుతో బాధపడుతూ ..
చివరి రోజులలో.. హైదరాబాదులో ..
శ్రీమతి నాగపద్మిని ఇంట్లో ఉండగా ..
నేను వారిని సన్నిధిలోనే వున్నాను. 
ప్రధమ స్కంధము ..మూడవ అధ్యాయం.. చదివించుకొని వ్యాఖ్యానం చేసారు.
అదే ..
వారి నుండి నాకు లభించిన
చివరి సందేశం.

ఆసుపత్రి నుండి 
ఆకస్మాత్తుగా కడప వెళ్ళి పోయారు. 
నాకు తెలియలేదు. 
కొన్నాళ్ళ తరువాత 
కడపకు రమ్మని శ్రీ వి.పి.రాఘవాచారి గారికి లేఖ వ్రాసారట. 
నాకా కబురు చేరే వరేఅ వారు 
01.09.1990 తెల్లవారు ఝామున దేహ త్యాగం చేసి వైకుంఠ పుర వాసులైనారని విషాద వార్త అందినది. 

వారి శిష్యులలో ఒకరైన శ్రీ బాబయ్య 
అంతిమ ఘడియలలో వారి ప్రక్కన ఉన్నారు. 
ఆయన నాకు చెప్పిన ప్రకారం 
వారి చివరి వాక్యాలు 
భగవంతుడు భాగవతము భక్తుడు మూడూ ఒక్కటే..
అని పలికి 
శ్రీనివాసా అని స్మరించి దేహ త్యాగం చేసారు. 
పెన్నిధి కోల్పోయిన పేదవానివలె దుఃఖించాను..

వైకుంఠవాసుని సన్నిధానంలో వేంచేసి యున్న 
నా గురుదేవుని విభూతికి 
ఇహలోకం నుండే సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకొంటున్నాను..

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.