28 ఫిబ్ర, 2013

కోవెల సుప్రసన్నచార్యులు
కోవెల సుప్రసన్నచార్యులు గారు 
 పుట్టపర్తి ని గురించి చెబుతూ..
 "బహుభాషావేత్త 
బహు భాషల సాహిత్యంతో పరిచయమున్నవారు
అందువలన 
నూతన మైన ఉత్ప్రేక్షలు 
ఉపమానాలు 
రూపకాలు ప్రవేశించాయి
నూతన కవితా సమయాలు ఏర్పడ్డాయి
ఇతరులకంటే ఆయన కవిత్వం
 కొత్తగా అందంగా కనిపించింది
ఇతర భాషా సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని గేయపధ్ధతిలో షట్పదిలో 
ఆయన కావ్యాలు వ్రాయటం ఒక విశేషం

వైష్ణవ సంప్రదాయంలోని 
శరణాగతి సర్వ సమర్పణ భావాలు 
ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తాయి
 
ఒకసారి శివశంకర శాస్త్రి గారన్నారు
తెలుగు సాహిత్యంలో 
ఇరవయ్యవ శతాబ్దపు యాభై సంవత్సరాలలో వచ్చిన రెండు గొప్ప కావ్యలలో ఒకటి శివతాండవము


ఆయన భక్తి ప్రధానంగా అనేక కీర్తనలు రచించారు
అందులో
"కడకు మిగిలెది ఇది ఒకటే
ఎ డద జపించిన భగవన్నామము.."

ఆయన జీవితాన్నే
ఒక తపస్సులాగా నిర్వహించారనటానికి 
ఈ కీర్తన ఒక ఆధారము

జపరూపమైన తపస్సు చేసిన ఆధునిక కవులలో 
ఒకరు విశ్వనాధ రెండవవారు పుట్టపర్తి 
ఇద్దరే నాకు కనిపిస్తున్నారు

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పుట్టపర్తి 
అనువాదాలపై దృష్టి నిలపడం నాకు నచ్చలేదు
అల్ప ప్రతిభావంతులకు అనువాదాలు కానీ

స్వతహాగా ఆయన అంతర్ముఖుడు
బయటి ఆడంబరాలు కోరుకున్న వాడు కాదు ఆశించినవాడు కాదు