శ్రీనాధుడు 15వ శతాబ్దమున జీవించినాడు.
వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని
ఆస్ధాన కవి.
విద్యాధికారి.
ఈ కాలమందు
ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.
ఈయన పోతన కు సమకాలీనుడు.
పోతనకు బంధువని,
పోతన రచించిన
శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి
అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే
కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి
కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా
వాటి విశ్వసనీయత పై
పలు సందేహాలు,
వివాదాలు ఉన్నాయి.
డిండిమభట్టు అనే పండితుని
వాగ్యుధ్ధంలో ఓడించి
అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు.
ఈతనికి కవిసార్వభౌముడను
బిరుదము ఉంది .
చారిత్రకునిగా పేరున్న పుట్టపర్తి
పోతన శ్రీనాధుల చుట్టరికాన్ని
అంగీకరించారని అనుకోవాలా ..?
శ్రీనాధుడు మహా భోగి
తన కృతులను రాజులకు అంకితమిచ్చి
తద్వారా లభించిన సొమ్ముతో
జీవితాన్ని హాయిగా అనుభవించిన వాడు
మరి పోతన
తనకు సంప్రాప్తించిన దారిద్ర్యాన్ని కూడా
తృప్తిగా అంగీకరించి రామ భక్తి నే నమ్ముకున్న
పరమ భక్తుడు
ఇద్దరి మనస్తత్వాలలో
హస్తి మశ కాంతర భేదం
ఈ కథ పుట్టపర్తి వ్రాసిన
రాయల నీతి కథలు లోనిది
సేకరణ శ్రీ రామావఝ్హ్ఝుల శ్రీశైలం
ప్రచురణ సమయం 1955
|