సీతారామయ్య బక్కగా ఎర్రగా వుండేవాడు
ఆయన హోటలు కు
ఆయనే ప్రొప్రయిటరూ సప్లయరూ
టిఫెన్ కి వచ్చిన వాళ్ళకి సౌకర్యంగానూ సంతోషంగానూ వుందో లేదో వెయ్యి కళ్ళతో చూసుకొనేవాడు
ఇడ్డెన్ల మీద వెన్న రాయటం
కారప్పొడి మీద పూర్తిగా తడిసేలాగ కాచిన నెయ్యి వెయ్యడం
కొబ్బరి చెట్నీ ఓ పక్క
కొత్తిమీర చెట్నీ మరోపక్క వేసి
కస్టమర్లు ఆప్యాయంగా తింటూ వుంటే
తన కడుపు నిండినట్లు ఆనందించడం
అతనికలవాటు
కొందరు పెసరట్టుపై
ఉల్లిపాయ పచ్చిమిరప ముక్కలూ అద్దమంటే
కొందరు అల్లం జీలకర్రా కోరుకొనేవారు
ఎవరికి యే రుచి కావలిస్తే
ఆ రుచిలో అందించేవాడు
అందరికీ చిరునవ్వుతో కాఫీ టిఫెన్లు సరఫరా చేసేవాడు
కడుపునిండా తిని బిల్లు ఇవ్వకుండా
'రేపిస్తాలే'
అంటూ వెళ్ళిపోయే వాడిపట్లా అదే చిరునవ్వు..
'ఇవాళ ఇవ్వని వాడు రేపిస్తాట్ట..
గోడమీద రాసుకోవాలి..'
అని పక పకా నవ్వేవాడు..
ఇవి
పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి
'ఆరోజుల్లో.. ' లోని సజీవ చిత్రాలు
ఇందులో ఇంకా
'మీ నాన్నకి పనసపొట్టు ఇష్టం..
ఇదిగో పట్టుకెళ్ళికూరవండించు..'
'రాజమండ్రి నుంచీ ఆకాకరకాయలు తెచ్చాను.. నల్లమందు సత్యానికీ .. నారాయణం గారికీ ఇయ్యి .. '
అంటూ అందరికీ పంచే చామర్తి సుబ్బారావ్ గారూ
'అన్నదమ్ముల మధ్య కేసు యేమిట్రా మీ మొహం..
పొండి ఫోండి.. '
అనే ప్లీడరు నారాయణరావులూ
యెందరో కనిపిస్తారు
నిజమే..
ఆ రోజుల్లో కొంతైనా మానవత్వం జాలి గుణం
ఉదారత ఉండేవంటే యీ కాలం వాళ్ళు నమ్మని పరిస్థి తి
మా ఇంట్లో అలాంటి సంఘటనలు
బోలెడంటే ..బోలెడు
ఒకసారి..
ఒక చిన్న బాబా మా కడపకు వచ్చాడు
సహజంగా బాబాలు సాధువుల వెంటబడే మా అయ్య..
ఇంకేముంది
ఆ బాబా మా ఇంటికి ఆహ్వానింపబడ్డాడు
పాదాలు పద్మాలూ కడిగారు
ఆ బుల్లి బాబాకు పుట్టపర్తి సాయంత జుట్టు
అదీ రింగులు రింగులు
పైగా అవే కదలికలు
ఇంటి నిండా ఇసకేస్తే రాలని జనం ..
బాబా మహిమలు చూడటానికి రెడీగా వున్నారు..
ఓచేత అభయ హస్తం పెట్టడం
ఆ బాబా మరిచిపోలేదు
పెదవులపై లీలగా భాసించే హాసం
ఓ పదినిమిషాలు ఆయన పాదాల చెంత కూర్చుని
తన విషయం నివేదించారు అయ్య
ఆ తరువాత..
ఆయన విషయం అడిగారు..
సమాధానం చెప్పలేదు బాబా
చేతిని తిప్పి విబూతి సృష్టించి అయ్య చేతిలో పోసారు
అయ్య మాట ఆగింది
మళ్ళీ అయ్య ప్రశ్నలు సంధించేలోగా
కుంకుమ ప్రసాదించారు బాబా..
కానీ యీ నాటకం రక్తి కట్టించటం
ఆ బుల్లి బాబాకు యెక్కువ సేపు సాధ్యం కాలేదు
మాటల్లో అతనికి యే సాధనా శక్తులూ లేవని తెలిసిపోయింది
అంతే..
పీఠం మీద కూర్చున్న బాబా
కిందికి దిగి వచ్చి అయ్య పాదాలు పట్టుకున్నాడు
యేదో ఆ బాబాకున్న భక్తుల నాకర్షించి
నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఇలా చేసానని కన్నీటి పర్యంతమయ్యాడు..
అయ్య ముఖంపై తమాషాయైన చిరునవ్వు
తరువాత ఆచూపుల్లో దయ వర్షించింది
పరిస్తితి ఆరా తీస్తే అతను అనాధ
పది వరకేమో చదివాడు
వెంటనే అతను మా అతిధి అయిపొయ్యాడు
యెన్నిరోజులో మా ఇంట్లోనే భోజనం పడక
అయ్య అతనికి మంచి బట్టలు కుట్టించమని
మా అమ్మకు పురమాయించారు
అమ్మ అతన్ని వెంట బెట్టుకుని
బట్టల షాపుకు తీసికెళ్ళింది
నాకపుడు పన్నెండేళ్ళుండచ్చు
అమ్మ వెంట బజారుకు నేనూ పోయాను
వాడు మంచి పువ్వుల బట్టను యెంచుకున్నాడు
దానికి తగిన ప్యాంటు
ఓ నాలుగు జతలకు బట్ట కొని
అక్కడే టైలరుకు ఇచ్చాం
వానికి మ్యాచింగ్ డిజైన్ కలిగిన బటన్లు..
సెలక్ట్ చేసుకోవటం వాడు మర్చిపోలేదు..
మా అమ్మ వానికి డబ్బు ఇచ్చింది..
నాలుగు రోజుల్లో
ప్యాంటు షర్టులు టైలర్ నుంచీ వచ్చాయి
అయ్య వాణ్ణి కాలేజీ లో చేర్పించారు
వాడు కాలేజీ పోవటం మొదలు పెట్టాడు
స్టయిల్ గా తయారై ..
బెల్ బాటం ప్యాంటు
నీలి రంగు పువ్వుల షర్టూ
రింగుల జుట్టూ
చేతిలో పుస్తకాలూ