3 మే, 2012

మహాకవి పుట్టపర్తి-పుట్టపర్తి అనూరాధ.



దరువుల ఫలములు దనుపారిపండ..
దరువులు భుజియింప దొరకొనునేమి..?
 
జలదంబునందు నీళులు పెచ్చుపెరుగ..
జలదముల్ద్రావునో..జనములకీక..
సజ్జనుల్గావించు సర్వతపమ్ము..
లిజ్జగమ్ముల సేమమిచ్చించి గాదె..!!





ఒకసారి ..
కృష్ణ చైతన్య ప్రభువు ..
భజన చేసికొనుచు పోవుచుండెను ..
ఒక మాదిగ కుష్ఠు రోగి ..
తాను చైతన్య దర్శనము చేసికొన లేక పోయినానే..
అని మనస్సులో బాధ పడుచుండెనట ..
వెంటనే ..
చైతన్య ప్రభువు ..
ఆ హరిజనుని  ఇంటిలో దూరి ..
యాతనిని కౌగలించుకున్నాడు. 
వాని కుష్ఠు రోగము పోయినదట..
కుష్ఠు రోగము పోయినదో ..? లేదో..?
మనకు కాబట్టదు. 
చైతన్యుడు ప్రదర్శించిన 
సర్వభూత భగవద్భావ మట్టిది. .
అట్టివారు నేడు మందున కొక్కడైనా నున్నాడా..?
మాదిగ వాడన్నంతనే ..
వానిని నీచముగ చూతుము..
వాడే ఇతర మతములో జేరి ..
మన ఇంటికి వచ్చినచో కుర్చీ నిత్తుము. .
ఎన్నిసార్లు స్నామెక్కువ చేసినచో..
హిందూ మతమున కంతగా సేవచేసినట్లు..
ఈ నడుమ ..
అనేకులను సన్యాసులను చూచుచున్నాను. ఏమున్నది.. 
సంస్కారము సున్న ..
చదువు పూజ్యము ..
ఉన్నయోగ్యత యంతయు గుండు. 
తన భక్తులు ధనికులు ..
చంకలో చందాల పుస్తకము. 
ఓహోహో ..
ఏమి మతో ధ్ధారము..
వీరి భుజస్కంధములపై హిందూమతము బ్రదకవలెననివారియాశ ..
పాపము శమించుగాక ..
సన్యాసులను నిందింపరాదు ..
ఏదో ధోరణిలో ..
నాలుగు మాటలన్నాను.
 

శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠ ధర్మ ప్రచార పక్ష పత్రిక
సంపాదకులు మహాకవి పుట్టపర్తి
15.7.1967 కడప
సంపాదకీయం నుండీ..