21 ఆగ, 2014

కోపగృహ నిర్మాణము

కోపగృహము..
రాజుల కాలంలో ఇది తప్పనిసరిగా వుండేది
అదీ రాణుల అంతఃపురాలలో
 


దేనికైనా రాణిగారికి కోపం వస్తే..
ఆవిడ ఆభరణాలన్నీ తీసి విసరి కొడుతూ..
సిగనలంకరిం
చుకున్న పూలు పీకి పడేస్తూ..
పైనున్న వస్త్రాలనూ తీసివేసి నల్ల చీరను ధరించి 

ఆ గృహంలో ఏడు స్తూ కూచుంటుంది
 

ఆ విషయం రాజుగారికి వెళుతుంది
ఆయన పరుగు పరుగున వచ్చి
ఆవిడని బతిమాలి బామాలి కోప కారణం తెలుసుకొని
ఆమె అలుక తీరుస్తాడు
అక్కడికి రాణి అలుకను విడిచి నవ్వుతుంది
 

ఈకాలంలో అంత తీరిక మగవారికెక్కడుంది
పొద్దునలేస్తే పరుగులు పెట్టటమే పని
కృష్ణుడు సత్యభామతో ఈ పాట్లన్నీ పడ్డాడు
 

పాపం రుక్మిణి  ఇలా కృష్ణుని సతాయించి ఎరుగదు
తక్కిన సతుల కింత సీనున్నట్లు కనపడదు..
ఇంక రామాయణంలో కైక కూడ కోప గృహాన్ని ఉపయోగించి రాముణ్ణి అడవుల దారి పట్టించింది..


 రాయలనాటి రసికతా జీవనము చూస్తే..
రాయల నాటి జీవనము.. జనుల వ్యవహారశైలి.. ఆచార వ్యవహారాలు తాను చూచినట్లే
మన కళ్ళకు కట్టి చూపించే  పుట్టపర్తి ప్రతిభ కాశ్చర్యము కలుగుతుంది..


ఇందులో కో పగృహ ప్రస్తావన ఉంది 
రాయల నాటి ప్రజలు 
హాలు కిచెను బెడ్ రూమ్ లున్నట్లే 
కోప గృహాలూ నిర్మించే వారట
 చదవండి .. 
 
 వారి గృహములయందొక రాయియైనను 
యలంకార హీనముగ నున్నచో 
వారి మనస్సు 'కళక్కు 'మనును
 

ప్రతి చోటను కొంచెము సందు దొరకినచో 
 నొక చేపను.. 
నెమలిని 
కడకొక మల్లెపూవునైనను జెక్కించెడివారు
 

కుడ్యములయందు  వారు వర్ణ చిత్రములు వేయుదురు..
ఒక్కొక్కప్పుడింటి పైకప్పులను గూడ

 తైల వర్ణచిత్రములతో అలంకరింతురు
 

అంతేకాదు 
ఇక్కడ ఇంకో విచిత్రమైన సంగతి యేమిటంటే
వారు వారి ఇండ్లలో 

భోజనశాలలు.. మజ్జన శాలలు చిత్రశాలలు 
వేరువేరుగ నుండెను
 

మనకు దెలియని మరియొక వి శేషమానాడుండెడిది
అది 'కోపగృహ నిర్మాణము'
ఇంటి ఆవిడకు కోపము మగనిపై వచ్చినపుడామె  యాగదిలోనికి బోయి దూరికొనును
 

కాని యాకాలమందును 
మగవారికి గోపగృహమున్నట్లు కనుపింపదు.. అంటారు..

(కోపతాపాలు అలకలు అన్నీ ఆడవారి సొత్తు 
ఆమె అలక తీర్చటమూ 
శృంగారములో ఒక భాగం కామోసు..)
 


''ఈనాడే గనుక కోపగృహముల ఆచారమున్నచో మగువలకన్న ముందే.. 
మగవారక్కడ జేరియుందురని నా యనుమానము
కారణమేమనగా
 

మనకీనాడు సంపాదించిపెట్టలేక 
దినమున కొక్కసారియైనను భార్యపై 
గోపము వచ్చుచుండును.
 

ఆనాళ్ళలో యైనను 
అందరు కవులకు కోపగృహముతో నక్కరలేదు
ముక్కుతిమ్మన్నకు మాత్ర  మాయవసరము కలిగినది
 

కృష్ణునిపై గోపమునునుగొన్న సత్యభామాదేవి
 చీకటింటి కడకంకటిపై 
'జలదాంత చంద్రరేఖాసదృశాంగియై'
శరీరమొకచోట పొందక పొరలి పొరలి యేడ్చెనట..

ఏ వాస్తు శాస్త్రకారుడు గనిపెట్టినాడో గాని 


కోపగృహాలవాడుక చాల మంచి యాచారము 
కోపగించిన యావిడ చీకటింటిలో జేరినచో 
తక్కినవారు తకరారు లేకుండ 
తమ పనులను జేసికొన వచ్చును

చూసారా.. 
మా అయ్య ఇలాంటి ప్రబంధప్రమాదాలను  
జాగ్రత్తగా బుర్రలోనే వుంచేసి.. 
ఇంట్లో కోపగృహ నిర్మాణం చెయలెదు.. 
ఒకవేళ చేసి వుంటే మేమూ అప్పుడప్పుడూ  ఉపయోగించేవాళ్ళం కదా.. 

(కోపగృహము సంగతి తెలియక నేను నా చిన్నప్పుడు
మోచెంపేటలో వుండగా నేలపై పడి పొర్లి పొర్లి యేడ్చేదాన్ని
అది కావాల.. ఇది కావాల అని
మా అయ్య వద్దకుంటె గుద్దుకో వాకిట్లో పండుకో
ఎవరైన తొక్కితె లబ లబ మొత్తుకో
అని తాను భుజాలేగిరేస్తూ  పాడేవాళ్ళు
 

ఆ కోపగృహము మా అమ్మ ఉపయోగించదు 
అంత తీరిక ఆమె కెక్కడ .. 
మా అక్కలకు బాగా పనికి వచ్చేది
వాళ్ళల్లో వాళ్ళకు పోటీలెక్కువ
వాళ్ళు పుట్టింటికి వచ్చినప్పుడు..

కోపగృహము ఎప్పుడు ఖాళీగా వుండదేమో బహుశా
ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్లో వుంటారు
పైగా బయట మరొకరు వైటింగూ
మా అయ్య పట్టించుకో
రు..
మా అమ్మకు తల వాచిపోయుండేదివాళ్ళ అలకలు తీర్చలేక .. )